Ammayi garu Serial Today Episode రుక్మిణి రాఘవ, విరూపాక్షిల కూతురని విజయాంబిక సూర్యప్రతాప్‌కి చెప్తుంది. దాంతో విరూపాక్షి ఆవేశంగా విజయాంబిక దగ్గరకు వెళ్లి లాగిపెట్టి ఒక్కటి కొట్టి నా గురించి నా రక్తం గురించి తప్పుగా మాట్లాడితే నిలువునా నిల్చున్న చోటే నరికేస్తా అని వార్నింగ్ ఇస్తుంది. సూర్యప్రతాప్ కోపంగా విరూపాక్షి మా అక్క అడిగిన దాంట్లో తప్పేముంది నేను అడిగిన దానికి సమాధానం చెప్పు అని అంటాడు.
రుక్మిణి: నాయనా..సూర్యప్రతాప్: నువ్వు నన్ను అలా పిలవకు. నా ఇద్దరు బిడ్డలు చనిపోయారు. మందారం: పెద్దయ్యా మీకు చెప్పే అంత దాన్ని కాదు కానీ ఒక తల్లిగా చెప్తున్నా ఈ లోకంలో ఏ తల్లి కూడా తన బిడ్డ గురించి అబద్ధం చెప్పదు. ఎందుకంటే ఒక మామూలు మనిషిని తల్లిని చేసేది ఆ బిడ్డే. బిడ్డ గురించి ఏ తల్లి అబద్ధం చెప్పదు.విజయాంబిక: ఎందుకు చెప్పరు మందారం ప్రస్తుతం సమాజంలో ప్రియుడి కోసం బిడ్డలను చంపేస్తున్నారు. మందారం: అది ఎవరో కిలాడీలు అలా చేస్తారు. అమ్మగారికి ఆ అవసరం ఏంటి.దీపక్: నిజమే మమ్మీ మన అనుమానం కరెక్టే కాదు. అసలు ఈ అనుమానం ఎప్పుడు స్టార్ట్ అయింది. ఈ రుక్మిణి రాఘవ, అత్తయ్యల కూతురు అయినప్పుడు ఇలాగే ఉన్న రూప కూడా రాఘవ కూతురే అయిండొచ్చు కదా మమ్మీ. అందరూ బిత్తర పోతారు.
విరూపాక్షి చాలా ఏడుస్తుంది. సూర్యప్రతాప్ కంగారు పడతారు. రూప కూడా ఎప్పుడూ తల్లికే సపోర్ట్‌గా ఉండేది అని పెళ్లి నుంచి అన్నీ అత్తయ్య సమక్షంలోనే జరిగాయని సూర్యప్రతాప్‌కి అనుమానం వచ్చేలా దీపక్ చెప్తాడు. ఇక్కడేం జరుగుతుందో నాకు అర్థం కావడం లేదని రుక్మిణి అంటే నాకు అర్థమైంది అని సూర్యప్రతాప్ అంటాడు. విజయాంబిక తమ్ముడితో ఇందులో ఏది నిజమో ఏది అబద్ధమో నీకు మాత్రమే తెలుసు అంటుంది.
సూర్యప్రతాప్ ఆవేశంగా విరూపాక్షి, రుక్మిణిలను గెంటేయడానికి ప్రయత్నిస్తాడు. రాజు అడ్డుకుంటాడు. ఎవరో రాసిన లెటర్‌తో ఇలా చేయడం కరెక్ట్ కాదని అంటాడు. దానికి రాజు కావాలి అంటే డీఎన్‌ఏ టెస్ట్ చేయిద్దామని అంటాడు. విజయాంబిక, దీపక్‌లు కంగారు పడతారు. సూర్యప్రతాప్ డీఎన్‌ఏ టెస్ట్‌కి ఏర్పాటు చేయమని చెప్తారు. విరూపాక్షి బాధ పడుతుంటే రుక్మిణి, రాజులు ఓదార్చుతారు. డీఎన్‌ఏ టెస్ట్ వల్ల కనీసం రుక్మిణి అయినా తన కూతురే అని సూర్యప్రతాప్‌కి తెలుస్తుందని అంటారు. విరూపాక్షి తాను లెటర్ ఎవరు రాశారా అని ఆలోచిస్తున్నా అని అంటుంది.
విజయాంబిక వాళ్లు కూడా సూర్యప్రతాప్‌ని బాగా నమ్మించామని అనుకుంటారు. దీపక్ వాళ్లే చేసుంటారని రాజు, రూపలు అంటారు. నా బిడ్డని నా తండ్రిని చంపేసింది ఇవి సరిపోవు అన్నట్లు ఇంకా ఇన్ని చేస్తుంది. విజయాంబిక మాత్రం వదలకూడదు అంటుంది. ఉదయం సూర్యప్రతాప్ డాక్టర్‌ని రప్పించి డీఎన్‌ఏ టెస్ట్ కోసం శాంపిల్స్ తీసుకోమని చెప్తారు. డాక్టర్ సూర్యప్రతాప్, రుక్మిణిలు శాంపిల్స్ ఇస్తారు. సూర్యప్రతాప్ విరూపాక్షితో నీ నాటకాలు నా దగ్గర కాదు నా బిడ్డ ఉన్నన్నాళ్లు దాన్ని నీ వైపు తిప్పుకొని సాధించుకోవాలి అనుకున్నావ్ ఇప్పుడు ఈ అమ్మాయిని తీసుకొచ్చి నాటకాలు ఆడుతున్నాయ్ అవి ఇక సాగవు అంటాడు. నువ్వు పొరపాటు పడుతున్నావ్ సూర్య అని విరూపాక్షి చెప్తుంది. డీఎన్‌ఏ రిపోర్ట్స్‌లో నిజం తెలుస్తుంది. నీ వల్ల నా బంగారు తల్లి పుట్టుకను కూడా అనుమానించేలా చేశావ్ చీ అని సూర్యప్రతాప్ వెళ్లిపోతాడు.
సూర్యప్రతాప్ మాటలకు విరూపాక్షి చాలా ఏడుస్తుంది. రుక్మిణి మీ మామయ్య కూతురు కాదు అని తేలేలా చేయాలి అని తల్లీ కొడుకులు అనుకుంటారు. తల్లీకొడుకుల మాటలు మందారం, రూప, రాజులు వింటారు. వాళ్లు హాస్పిటల్‌కి వెళ్లకుండా ఆపాలి అని అనుకుంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: నువ్వుంటే నా జతగా సీరియల్: జల జల జలపాతం నువ్వు.. దేవా, మిథునలతో జలకాలాటాడించిన బామ్మ!