Ammayi garu Serial Today Episode రూప, రాజులు విజయాంబిక, దీపక్‌లతో మాట్లాడుతారు. మీరే రాధికను హత్య చేశారని రాధిక మాకు చెప్పేసింది మాకు నిజం తెలియకపోయున్నా బాగున్ను మాకు నిజం తెలిసిపోయింది అని రాజు అంటే దీపక్ ఆవేశంగా అయితే ఏంట్రా అయితే ఏంటి అని రాజు మీదకు వెళ్తాడు.
దీపక్: అవునురా రాధికను చంపింది నేను. మాములుగా కాదురా కసి తీరా పొడిచి పొడిచి చంపాను.రాజు: నిన్నూదీపక్: ఏం చేస్తావ్ హా.. ఏం చేయలేవ్. నీకో విషయం తెలుసా ఇంత కాలం మేం చదరంగంలో రాంగ్ స్టెప్స్ వేయడం వల్ల కేవలం ఓడిపోతూ వచ్చాం. విజయాంబిక: మీకు ఎత్తులు వేయడం వస్తే మీ ఎత్తులకు పై ఎత్తులు వేయడం మాకు వచ్చు. మేం మొదలు పెట్టిన చదరంగంలో రాజు అంటే మీ నాన్న సూర్యప్రతాప్.. మిమల్ని ఓడించే ప్రయత్నంలో మేం వాడుకుంటున్న భటులే ఆ రాధిక, మందారం, రాఘవ.దీపక్: అందుకే ముందు ఆ భటులని వాడుకుంటున్నాం. తర్వాత ఆ రాజుకి సేనాపతి అయి నిన్ను(రాజుని).విజయాంబిక: రాజుకి ప్రాణం అయిన నిన్నూ (రూపని) లేపేస్తాం. అప్పుడు చెక్ పెడతాం మీ రాజుకి. దీపక్: ఇంత ఓపెన్‌గా చెప్తున్నాం ఏం చేసుకుంటారో చేసుకోండి పోండీ.రూప: సాక్ష్యాలతో మిమల్ని బయట పెడతాం.దీపక్: ఏం పీకలేరు వెళ్లండి. విజయాంబిక: అందరినీ లేపేయాలి దీపక్ ఈ ఆస్తి మొత్తం సొంతం చేసుకోవాలి. వీళ్లని అంత తక్కువ అంచనా వేయకూడదు. మనం ఏం చేయగలమో తెలిస్తే అడ్డుకోకుండా ఎలా ఉంటారు.
రూప రాజులు రాధిక గురించి ఆలోచిస్తారు. రాధికని కాపాడుకోలేకపోయాం కదా రాధిక బిడ్డని మనం చూసుకుందామని రాజు అంటాడు. తర్వాత దీపక్‌ని పని పడతాం అంటాడు. విజయాంబిక, దీపక్‌లు ఆస్తి కోసమే ఇదంతా చేస్తున్నారని అనుకుంటారు. రూప చాలా టెన్షన్ పడుతుంది. ఆస్తిని సొంతం చేసుకోవడానికే అడ్డంగా ఉన్న మా అమ్మ ప్లాన్ వేసి పంపేశారని ఆస్తి కోసమే దీపక్‌కి నన్ను ఇచ్చి పెళ్లి చేయాలి అనుకున్నారని మొత్తం గుర్తు చేసుకుంటారు. గౌతమ్‌తో చేతులు కలిపారు. జీవన్‌తో చేతులు కలిపారు అని గుర్తు చేసుకుంటారు.
రాజు ఈ చదరంగంలో పెద్దయ్య గారిని చంపాలి అంటే నన్ను దాటుకొని వెళ్లాలి అని రాజు అంటాడు. ప్రతీసారి మనం కాపాడుకోలేం కదా అని రూప అంటుంది. ఇక రూప ఓ నిర్ణయం తీసుకున్నానని ఈ ఆస్తి మొత్తం మా దగ్గర ఉండటం వల్లే ఇదంతా అవుతుందని అంటుంది. నువ్వేం ఫీల్ అవ్వను అంటే నా నిర్ణయం ఒకటి చెప్తానని రూప అంటుంది. రాజు రూపతో రాజు అంటే అమ్మాయిగారిలో సగం మీరేం నిర్ణయం తీసుకున్నా అది నా నిర్ణయంలో సగం అంటాడు. ఇక రూప ఆస్తి మొత్తం తదనాంతరం దేవాలయం ట్రస్ట్‌కి దక్కేలా రాసిచ్చేస్తానని అంటుంది. మనం ఉన్నంత వరకే వాళ్లకి ఆశ్రయం ఉంటుంది. లేదంటే వాళ్లు రోడ్డున పడతారు అని అంటుంది. ఇలా అయితే వాళ్లు పెద్దయ్యగారిని కాపాడుకుంటారని కానీ మీ నాన్న చిన్నాన్నలు ఒప్పుకుంటారా అంటే ఒప్పుకుంటారని రూప అంటుంది.
రూప, రాజులు ఉదయం అందరితో మాట్లాడుదామని పిలుస్తారు. రూప తన పేరు మీద ఉన్న ఆస్తి తన తదనాంతరం మన గుడి పేరున ఉన్న ట్రస్ట్‌కి రాసిచ్చేయాలి అని నిర్ణయించుకున్నా అని చెప్తుంది. విజయాంబిక, దీపక్‌లు అడ్డుకుంటారు. నీ పేరు మీద వందల ఎకరాలు ఉన్నాయి కదా అలా ఎలా రాసేస్తావ్ అంటారు. ఆస్తి మొత్తం ఇచ్చేస్తే తర్వాత ఎలా అని సూర్య ప్రతాప్ అంటే నేను ఉన్నాను పెద్దయ్యగారు నేను అమ్మాయి గారి ఆస్తి చూసి పెళ్లి చేసుకోలేదు అని అంటాడు. ట్రస్ట్‌కి రాసిస్తే మనం ఆస్తి దక్కించుకోలేమని విజయాంబిక అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!