Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల జాతకం తీసుకొని బామ్మ వాళ్లు గుడికి వచ్చి ఓ స్వామీజీకి చూపిస్తారు. బాలకృష్ణ జాతకం చూసిన స్వామీజీ ప్రస్తుతం జ్ఞాపక శక్తి కోల్పోయి గతం మర్చిపోయి చిన్న పిల్లాడిలా మారిపోయాడని అంటారు. అవునని బామ్మ వాళ్లు చెప్తారు. బాల జాతకం ప్రకారం ఆయనది తుల రాశి అందుకు వృషభరాశి మిథున లగ్నం ఉన్న అమ్మాయితో పెళ్లి చేస్తే మారుతారని స్వామీజీ చెప్తారు. జీవిత భాగస్వామి మంచి జాతకురాలు అయితే మన ఖర్మఫలం మారుతుందని అంటారు.
నాగభూషణం తల్లితో చాలా మంది అమ్మాయిలు ఉంటారు కానీ మన వాడిని పెళ్లి చేసుకోవడానికి ఎవరు ముందుకు వస్తారు అని అంటాడు. దానికి బామ్మ నా కన్నయ్యని మార్చడానికి ఎక్కడో ఒక చోట అమ్మాయి పుట్టే ఉంటుంది వాడి జాతకం మారుతుందని అంటుంది. ఇక బాల త్రిపురని సైకిల్ మీద తీసుకెళ్తాడు. ఐస్‌క్రీమ్ బండి కనిపిస్తే ట్రీట్ ఇస్తానని ఆపుతాడు. త్రిపుర తినొద్దు అంటే ఈ ఒక్క రోజే అని మారాం చేస్తాడు. ఇద్దరూ ఐస్‌క్రీమ్ తింటుంటారు. ఇంతలో బాల తాతయ్యని చంపినవాళ్లలో ఒకరైన నర్శింగిని త్రిపుర చూస్తుంది. అతని భార్య చనిపోయాడని చెప్పడం గుర్తు చేసుకుంటుంది. వాడిని ఎలా అయినా పట్టుకోవాలి అని బాలని పిలుస్తుంది. ఎందుకు అని బాల అడిగితే వాడు బ్యాడ్ బాయ్ అని చెప్తుంది.
నర్శింగి ఫణికి కాల్ చేసి మీ అన్నయ్య, ఆయనో పాటు ఉన్న అమ్మాయి నన్ను చూసేశారని చెప్తాడు. మా అన్నయ్య నిన్ను ఎలా గుర్తు పట్టలేడు ఆ త్రిపురని చంపేయమని అంటాడు. నర్శింహ తన రౌడీలకు కాల్ చేసి రమ్మని పిలుస్తాడు. త్రిపుర, బాల చెరోవైపు వెతుకుతారు. త్రిపుర ఓ షెడ్ లోకి వెళ్తుంది. అక్కడ నర్శింగిని చూస్తుంది. వాడిని ప్రశ్నిస్తుంది రౌడీని కొడుతుంది. నర్శింగి తిరిగి కొట్టడంతో త్రిపుర కింద పడిపోతుంది. త్రిపుర లేవకుండా మత్తు ఇచ్చి మూతికి ప్లాస్టర్ పెట్టేసి ఓ కారులో ఎక్కిస్తారు. గాలి ఆడక అదే చనిపోతుందిలే అని కారు మీద కవర్ కప్పేస్తారు.
త్రిపుర కోసం వెతుకుతూ వచ్చిన బాలకి కారు మీద సీతాకోకచిలుక కనిపిస్తుంది. బాల కోపంతో రగిలిపోతాడు. దాన్ని చంపాలి అని వెంట పడతాడు. ఆ సీతాకోక చిలుక కారుల చుట్టూ తిరుగుతుంది. కోపంతో బాల త్రిపుర ఉన్న కారు మీద కవర్ తీసేస్తాడు. త్రిపుర బాలని చూస్తుంది. పిలవడానికి ప్రయత్నిస్తుంది కానీ పిలవలేకపోతుంది. ఇంతలో బాల త్రిపురని చూస్తాడు. సుందరి సుందరి అని పిలుస్తాడు. త్రిపుర కళ్లు తిరిగి పడిపోతుంది. సెక్యూరిటీకి విషయం చెప్తాడు. దాంతో సెక్యూరిటీ తాళం తీసుకొచ్చి తీస్తాడు. దాంతో త్రిపురని బాల కాపాడగలుగుతాడు. బాల త్రిపురని తీసుకొని వెళ్లిపోతాడు. తర్వాత నర్శింగి ఫణికి కాల్ చేసి త్రిపుర తప్పించకుందని చెప్తాడు.
ఫణి నర్శింగిని అండర్ గ్రౌండ్‌కి వెళ్లిపోమని చెప్తాడు. యశోద సంతోషంగా అత్తయ్య, భర్త దగ్గరకు వచ్చి పంతులు చెప్పినట్లు ఓ అమ్మాయి దొరికిందని రేపు వాళ్లు వస్తారని చెప్తుంది. ఏర్పాట్లు అన్నీ చేయమని చెప్తుంది. నాగభూషణం టెన్షన్ పడితే వాసుకితో ఆ అమ్మాయి తన ప్లానే అని బాలతో పాటు గాయత్రీకి కూడా ఓ ప్లాన్ చేశానని ఒక్క దెబ్బకి రెండు పిట్టలు అయిపోతాయని అంటుంది. ఉదయం త్రిపుర పెళ్లి వాళ్లు వస్తారని అన్నీ సర్దుతుంది. బాల అటూ ఇటూ తిరుగుతూ ఉంటాడు. బాల అల్లరగా తిరుగుతూ ఉంటే కష్టం అని యశోద అంటే అవేమీ మనం దాయొద్దని మన గురించి తెలిసే వస్తున్నారు కదా అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: "ఎన్నాళ్లో వేచిన హృదయం" సీరియల్: సీఈఓ స్థానం కావాలన్న ఫణి.. బాల ఆస్తులకు సర్వ హక్కులు త్రిపురవే!