Ammayi garu Serial Today Episode రుక్మిణి కొంప తీసి రూప ఏంటా అని విజయాంబిక దీపక్‌తో అంటుంది. దానికి దీపక్ కచ్చితంగా అది రూప కాదని నీటిలో మునిగి చచ్చిపోయింది కదా మన ముందే కాల్చారు కదా అంటాడు. చెంప మీద కొట్టిన దెబ్బ గుర్తు చేసుకుంటుంటే అది రూప అనే అనిపిస్తుందని ఇద్దరూ అనుకుంటారు. కానీ రూపని చంపేశాం కదా అది రూప అయిండదు అని అనుకుంటారు. 

విరూపాక్షి మనిషిని పోలిన మనిషి ఉంటారు కదా అలా ఎవరినైనా విరూపాక్షి తీసుకొచ్చిందని అనుకుంటారు. అలా అయిండదు అని దీపక్ అంటాడు. రుక్మిణి ఎవరైనా సరే రూప స్థానంలో వచ్చింది కాబట్టి దాన్ని లేపేయాలి అనుకుంటారు. దీపక్ తాను చూసుకుంటా అంటాడు. చీకటి పడితే పని పడతా అంటాడు. రాత్రి రూప తండ్రి ఫొటో చూసి నిన్ను అమ్మని ఎలా అయినా కలపాలి. అత్తయ్య, దీపక్‌ల పని పట్టాలి అనుకుంటుంది. ఇంతలో రూప గదిలోకి దీపక్ వస్తాడు. ఏంటి మామ ఇట్లా వచ్చావ్ అని రుక్మిణి అలియాస్ రూప ప్రశ్నిస్తుంది. ఏం లేదు రూప అని దీపక్ అంటే నేను రుక్మిణిని మామ అని అంటుంది. ఈ ఏలప్పడు నా కాడికి ఎందుకు వచ్చావ్ మామ అని అడుగుతుంది.

దీపక్ రూపని పక్కన కూర్చొపెట్టుకొని చేయి పట్టుకొని నేను నీ మేనబావని అని రుక్మిణి యాసలోనే మాట్లాడుతాడు. నువ్వు అసలు మమల్ని ఎందుకు కొట్టావు రుక్మిణి అని అడుగుతాడు. మామ మామ అని రూప మాట్లాడుతుంది. మామ మామ అని ఇంత ప్రేమగా పిలుస్తుంది అంటే ఇది కచ్చితంగా నా రుక్మిణినే అని అనుకుంటాడు. రుక్మిణి మీద చేయి వేసి దగ్గరగా కూర్చొని పట్టుకుంటాడు. చేయి తీయ్ మామ నాకు భయంగా ఉందని రుక్మిణి అంటుంది. మీ అక్కని పెళ్లి చేసుకోవాల్సింది కుదరలేదు కనీసం నిన్ను అయినా పెళ్లి చేసుకుంటా అంటాడు. రూప మనసులో నీ పని చెప్తా ఆగు అనుకొని జాకెట్ చింపి మామ నన్ను ఏం చేయొద్దు అని అందరి దగ్గరకు పరుగులు తీస్తుంది. అందరూ హాల్‌లోకి చేరుకుంటారు. రూప విరూపాక్షితో అమ్మా నా మానాన నేను ఉంటే నా మీద చేయి వేశాడని చెప్తుంది. సూర్యప్రతాప్‌ అది వినేస్తాడు. విజయాంబిక షాక్ అయిపోతాడు. 

ఈడు వచ్చిన ఆడపిల్ల మీద చేయి వేయకూడదు అంటే ఎవరైనా వేస్తే తప్పు కానీ మామ వేస్తే తప్పు కాదు అని నా దగ్గరకు వచ్చాడు. నా రవిక చింపేశాడని విరూపాక్షికి చూపిస్తుంది. నేను కాదు అన్నట్లు దీపక్ ముఖం పెడతాడు. రుక్మిణి అబద్ధం చెప్తుంది నేను ఆ ఉద్దేశంతో చేయి వేయలేదు అని దీపక్  అంటాడు. విరూపాక్షి దీపక్‌ని లాగిపెట్టి కొడుతుంది. రూప రాజుని చూసి అంతా అబద్ధం అని కన్ను కొడుతుంది. సరదాగా మాట్లాడటానికి వెళ్లానని అంటాడు. చంద్ర కూడా తిడతాడు. సరదాగా మాట్లాడాలి అంటే మీద చేయి వేయాలా అని అడుగుతాడు. రాజు వెళ్లి దీపక్‌ని కొట్టి ఈ ఇంటికి అమ్మాయి గారు ఎంతో రుక్మిణి కూడా అంతే ఇంకో సారి ఈ అమ్మాయి గారికి వంకర బుద్ధితో చూస్తే చంపేస్తా అంటాడు. రూప తల్లితో అంతా తమాషాకి అని అంటుంది.

సుమ కూడా  మనం ఉన్న పరిస్థితి ఏంటి నువ్వు చేసిన పని ఏంటి అని తిడుతుంది. అందరూ ఇలా వదిలేస్తే దీపక్‌ని చంపేస్తారని విజయాంబిక అడ్డుకోవడానికి చిన్నగా మందలిస్తుంది. ఇంతలో సూర్యప్రతాప్‌ వచ్చి ఆడపిల్లతో తప్పుగా ప్రవర్తించిన వాడితో మాటలు ఏంటి అని గెంటేయబోతే దీపక్ సూర్యప్రతాప్‌తో మామయ్య వచ్చింది రూప ఏమో అని అనుమానం వచ్చి తెలుసుకోవడానికి కావాలనే అలా చేశానని అంటాడు. నా రూప వస్తే నా రూపలానే వస్తుంది ఇలా మారువేషంలో రావాల్సిన పరిస్థితి ఎందుకు అని వస్తుందని అంటాడు. విరూపాక్షి దీపక్‌తో ఏ ఉద్దేశంతో అయినా పరాయి స్త్రీ మీద చేయి  వేయకూడదు అని నీకు  చెప్పలేదా ఇలాంటి తల్లిని ముందు అనాలి అంటుంది. 

సూర్యప్రతాప్‌ బంటిని పిలిచి నీకు గుడ్ టచ్ బ్యాడ్ టచ్ అంటే ఏంటో చెప్తా రా అని దీపక్‌ని కొడుతూ ఆడపిల్లని భుజం మీదే కాదు ఇక్కడ ఇక్కడ ఎక్కడ ముట్టుకున్నా తప్పే అని దీపక్‌ని టచ్ చేసి చెప్పి దీపక్‌ని వాయిస్తాడు. అమ్మ లేదని అమ్మ ఉంటే నీకు బుద్ధిగా పెంచేది అనే మాట నువ్వు ఎప్పటికీ తీసుకురావొద్దు బంటీ ఎవరినైనా తోడపుట్టిన వారిలా చూడాలి.. ఏ ఆడదాన్ని అయినా తల్లిలానే చూడాలి అని అంటాడు. మందారం జీవితం నాశనం చేశావ్.. రాధిక ఇలా చాలా మంది జీవితం నాశనం చేయాలి అనుకున్నావ్ నిన్ను వదలనురా చంపేస్తా అని అంటారు. రుక్మిణి గౌరవానికి ఇబ్బంది కలిగేలా ఎవరు పని చేసినా ఊరుకోను అని చెప్పి రుక్మిణికి సారీ చెప్తారు. తర్వాత బంటీ మా తాతయ్య గురించి కథలు కథలుగా విన్నాను ఏ కథలో అయినా మా తాతయ్య హీరో అంత మంచి తాతయ్య ఇంట్లో ఉన్న నీకు ఎందుకు ఇంత నీచపు బుద్ధి వచ్చింది మీ మమ్మీ నిన్ను సరిగా పెంచలేదా అని బంటీ కూడా దీపక్‌ని తిడతాడు. దీపక్ పొట్ట మీద ఒక్కటిస్తాడు. ఆఖరికి ఈ పిల్లోడు కూడా నా కొడుకుని కొట్టాడు అని విజయాంబిక తెగ ఫీలైపోతుంది. నా పగ చల్లారదు అని అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!