Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode సహస్రని తీసుకొని విహారి వాళ్లు ఇంటికి వస్తారు. విహారి, సహస్రకు లక్ష్మీ దిష్టి తీస్తుంది. వసధ, పద్మాక్షి హారతి ఇస్తారు. ఇద్దరినీ ఒకరి పేరు ఒకరికి చెప్పుకొని లోపలికి రమ్మని అంటారు. నేను మా బావతో వచ్చానని సహస్ర చెప్పి సిగ్గు పడిపోతుంది. మీ ఆయన పేరు చెప్పు అని అంటే నేను మా ఆయన విహారితో వచ్చాను అని సిగ్గు పడుతుంది. ఇక విహారిని అడుగుతారు.
విహారి లక్ష్మీని చూస్తూ ఉంటాడు. అందరూ చెప్పు చెప్పు అని అడగటంతో విహారి చెప్పడు. సహస్ర బావతో బావ నీకు చెప్పడానికి ఇబ్బందిగా ఉంటే వదిలేయ్ వెళ్లిపోదాం అంటుంది. అంబిక, పద్మాక్షిలు నీ పేరు చెప్పడానికి ఇబ్బంది ఏంటి. భార్య పేరు చెప్పడానికి ఇబ్బంది ఏంటి అంటారు. నేను సహస్ర వచ్చాం అని విహారి చెప్తాడు. తర్వాత ఇద్దరూ కుడికాలు లోపల పెట్టి వెళ్తారు. నా కూతురు చావు బతుకుల వరకు వెళ్తే కానీ విహారికి నా కూతురిని పెళ్లి చేసుకోవడానికి మనసు రాలేదు అని పద్మాక్షి అంటుంది. ఎలా అయితే ఏంటి అమ్మ నా బావ నా భర్త అయ్యాడు నా డ్రీమ్ నెరవేరింది అని సహస్ర అంటుంది. అందరూ రిసెప్షన్ గ్రాండ్‌గా చేయాలి అనుకుంటారు.
లక్ష్మీని సహస్ర తన లగేజ్ తీసుకురమ్మని చెప్తుంది. సహస్రని లోపలికి వెళ్లి రెస్ట్ తీసుకోమని యమున అంటుంది. సహస్ర కాళ్లు నొప్పి అని కూర్చొండిపోతుంది. అంబిక తీసుకెళ్తా అంటే సహస్ర వద్దని బావ వైపు చూపిస్తుంది. దాంతో అంబిక విహారి ఎత్తుకొని తీసుకెళ్తాడులే అని చెప్తుంది. విహారి లక్ష్మీని చూస్తాడు. నీ భార్యని నువ్వు తీసుకెళ్లు విహారి అని అందరూ చెప్తారు. విహారి సహస్రని ఎత్తుకొని గదిలోకి తీసుకెళ్తాడు. విహారి సహస్రని తన గదికి తీసుకెళ్తే ఇదేంటి బావ నా గదికి తీసుకొచ్చావ్ నిన్నటి వరకు నా రూం ఇది ఈ రోజు నుంచి నీ గదే నా గది అని అంటుంది. అందరూ మురిసిపోతూ విహారి గదికే తీసుకెళ్లమని చెప్తారు. విహారి తీసుకెళ్లి బెడ్ మీద పెడతాడు. యమున భోజనం ఏర్పాట్లు చూసుకుంటా అని వెళ్తుంది. ఇక లక్ష్మీ లగేజ్ తీసుకొని లోపలికి వస్తుంది.
సహస్ర లక్ష్మీని విహారి చూడటం చూసి కోపంతో రగిలిపోతుంది. కంట్లో నలక పడినట్లు నటిస్తుంది. విహారిని చూడమని చెప్తుంది. విహారి చూస్తూ ఉంటాడు. నువ్వు భర్తగా ఆరాధిస్తున్న నా బావని నేను నీ కళ్ల ముందే భర్తని చేసుకున్నా ప్రతీ క్షణం నీకు నరకం చూపిస్తా అనుకుంటుంది. లక్ష్మీని చూసి లోపలికి రమ్మని అంటుంది. ఇక తన ఫోన్ తీసుకుంటుంది. తనని లేపమని విహారికి చెప్పి తనకు తన బావకి ఫోటోలు తీయమని లక్ష్మీకి చెప్తుంది. బావని పట్టుకొని ఫొటోలకు ఫోజ్‌లిస్తుంది. లక్ష్మీ కన్నీరు పెట్టుకుంటుంది.
లక్ష్మీ వెళ్తుంటే వెనకాలే విహారి వెళ్లి లక్ష్మీని పట్టుకొని ఆపి చాలా పెద్ద తప్పు చేశాను లక్ష్మీ అని విహారి లక్ష్మీ చేతులతో తనని తాను కొట్టుకుంటాడు. పద్మాక్షి వాళ్లు వ్రతం గురించి మాట్లాడుకుంటారు. పంతులకి పద్మాక్షి ఫోన్ చేస్తుంటే కాదాంబరి ఆపుతుంది. ఎన్నడూ లేనిది యమునను అమ్మా యమున అని పిలుస్తుంది. పద్మాక్షి వాళ్లు షాక్ అయిపోతారు. విహారి, యమున చాలా సంతోషిస్తారు. యమున వచ్చి ఏంటి అత్తయ్యా అని అడిగితే కూర్చో అమ్మా అని కాదాంబరి అంటుంది. యమున గతంలో తనని అవమానించడం గుర్తు చేసుకొని ఇప్పుడు చాలా సంతోషపడుతుంది. కన్నీరు పెట్టుకుంటుంది. కాదాంబరి యమునని తన పక్కనే కూర్చొపెట్టుకుంటుంది. నా కొడుకు వల్ల దూరం అయిన బంధాన్ని నీ కొడుకు కలిపాడు యమున అంటుంది. అత్తాకోడళ్లు సంతోషంగా మాట్లాడుకుంటారు.
కాదాంబరి యమునతో పెళ్లి అయిపోయింది తర్వాత కార్యక్రమాలు చేయాలి కదా పంతులుతో మాట్లాడాలి అనుకుంటున్నాం నువ్వేం అంటావ్ అమ్మా అంటే మీరే మాట్లాడండి అత్తయ్య అని యమున అంటుంది. తర్వాత విహారి హాల్‌లో ఒంటరిగా ఉంటాడు. సహస్ర బయటకు వచ్చి నీదీ నాది ఒకే రూం అనగానే గది వైపే రావడం మానేశావే ఎంత సేపు హాల్‌లో ఉంటావో నేను చూస్తాను అంటుంది. కిందకి వచ్చి లక్ష్మీని పిలిచి నాకు బావకి కాఫీ తీసుకొని రా అంటుంది. విహారి వద్దు అంటే లక్ష్మీ పెట్టే కాఫీ నీకు ఇష్టం కదా అంటుంది. ఇంతలో సహస్ర ఫ్రెండ్స్ వస్తారు. సహస్ర ఫ్రెండ్స్ నీ పెళ్లిని మేం ఎవ్వరం చూడలేదు మా ముందు దండలు మార్చుకోండి అని తీసుకొస్తారు. అందరూ చూడటానికి రెడీ అయిపోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: కావేరికి సీరియస్.. బాలరాజు, కావేరిల కూతురే చిన్ని అని ఉష కావేరి ఒక్కరే అని తెలుసుకున్న దేవా, వల్లి!