Ammayi garu Serial Today Episode విజయాంబిక గంట తర్వాత లేచి ఎప్పటిలా లేచి కూర్చొంటుంది. చంటి పిల్లలా తన అవతారం చూసుకొని ఇలా ఉన్నాను ఏంటి అనుకుంటుంది. హోళీ ఆడుతుంటే ఇలా అయింది ఏంటి అనుకుంటుంది. ఏం లేదని సూర్య చెప్తాడు. ఇక హాస్పిటల్‌లో డాక్టర్ మందారాన్ని చూసి షాక్ అయిపోతారు. వార్డ్ బాయ్‌ని పిలవడంతో రాజు, రూపలు కూడా లోపలికి వస్తారు.


ఎవరో పేషెంట్ మీద దాడి చేశారని డాక్టర్ చెప్పి మందారాన్ని చూసి రాజు, రూపలకు సారీ చెప్తారు. ఇక దీపక్ ఇంటికి వచ్చేస్తాడు. అక్కని బాగా చూసుకో అని సూర్య చెప్పి వెళ్లిపోతారు. ఏమైందని విజయాంబిక అడిగితే హోళీలో మందారానికి వేయాల్సిన ఇంజెక్షన్ రూప, రాజుల వల్ల నీకు గుచ్చుకుంది. మందారానికి రావాల్సిన పిచ్చి నీకు వచ్చిందని అంటాడు. మందారానికి రాజు, రూపలు ట్రీట్మెంట్ ఇచ్చి గతం గుర్తు రావాలని ప్రయత్నించారని తాను వెళ్లి మందారాన్ని కొట్టాడని మందారం బతికే ఛాన్స్ లేదని అంటాడు. 


రూప, రాజులు ఇంటికి పరుగులు తీసుకొని వస్తారు. సూర్యని పిలుస్తారు. అందరూ ఇద్దరి కంగారు చూసి ఏమైందా అనుకుంటారు. మందారం చావు వార్త తీసుకొని వచ్చారని దీపక్ వాళ్లు అనుకుంటారు. రాజుని చూసిన సూర్య రాజుని ఆపి రూప మీద కోప్పడతారు. వీడిని ఎందుకు తీసుకొచ్చావ్ మందారం ఎక్కడ అని అడుగుతారు. 


రూప: ఎవరు ఏమన్నా రాజు నా భర్త రాజుని కలవడానికి ఎవర్నీ అడ్డు పెట్టుకోవాల్సిన అవసరం లేదు. నాన్న మందారానికి ట్రీట్మెంట్ జరుగుతుంటే ఎవరో మందారం అడ్డు తొలగించుకోవాలని చూశారు నాన్న. మందారం తల మీద రాడ్డుతో బలంగా కొట్టారు. 


డాక్టర్ మందారం చనిపోయింది అనుకునే లోపు మందారం కదులుతుంది. డాక్టర్ ట్రీట్మెంట్ చేస్తారు. మందారానికి గతం గుర్తొస్తుంది. రాజు, రూపలు చాలా సంతోషపడతారు. పెద్దయ్య గారు సీఎం అయ్యారా అని మందారం అడుగుతుంది. దీపక్ బాబు అత్తయ్యగారే నన్ను పొడిచారు అని మందారం చెప్తుంది. దాంతో రాజు వెంటనే పెద్దయ్య గారికి నిజం చెప్దామని అంటుంది. 


మందారానికి దారిలో ఎలాంటి ప్రమాదం జరగకూడదు అనే రాజుని పిలిచాను అని రూప చెప్తుంది. సూర్య మందారం ఎక్కడ అనగానే మందారం లోపలికి వస్తుంది. నిన్ను ఎవరు చంపాలి అనుకున్నారో తెలుసా అని సూర్య అడిగితే తెలుసు అని మందారం చెప్తుంది. ఇక దీపక్ మందారాన్ని పట్టుకొని అమ్మ దగ్గర ఉండిపోయా లేదంటే నిన్ను జాగ్రత్తగా చూసుకునే వాడిని అని గదిలోకి తీసుకెళ్లడానికి పట్టుకుంటే మందారం దీపక్‌తో చేయ్‌ తీయరా ముందు చేయి తీయురా అంటుంది. దీపక్‌నే తనని చంపడానికి ప్రయత్నించాడని సూర్యతో చెప్తుంది. దీపక్ ఇంట్లోనే ఉన్నాను కదా మామయ్య అని అంటే సూర్య అవును అని చెప్తాడు. విజయాంబిక వాళ్లు తెలివిగా రాజు వల్లే అలా చెప్తుందని అంటారు. మందారానికి తలకు ఇప్పుడు గాయం తగలడం వల్లే గతం గుర్తొచ్చిందని రాజు చెప్తాడు. అప్పటి వరకు మందారానికి గతం గుర్తు రాకుండా కేవలం రాజు చెప్పినట్లు అబద్ధం చెప్పింది అనుకున్న అంతా మందారానికి గతం గుర్తొచ్చిందని తెలిసి సూర్య వాళ్లు హ్యాపీగా ఫీలైతే దీపక్ వాళ్లు షాక్ అయిపోతారు. 


గతంలో తనని పొడిచింది దీపక్‌నే అని మందారం చెప్తుంది. సూర్య షాక్ అయిపోతారు. దీపక్‌తో పాటు అత్తయ్య కూడా ఉన్నారు అనగానే సూర్య బిత్తరపోతాడు. దీపక్, విజయాంబికలు దొరికిపోయాం అని ఒకరి ముఖం ఒకరు చూసుకుంటారు. ఇద్దరూ కలిసే తనని చంపాలని చూశారని చెప్తుంది. విజయాంబిక కూర కట్ చేయడమే నాకు రాదు నిన్ను చంపడం ఏంటి అని అంబిక ప్లేట్ తిప్పేస్తుంది. మందారానికి పిచ్చి అని అనడంతో రూప రిపోర్ట్స్ చూపించి మందారానికి ఏం పిచ్చి లేదు కావాలంటే చూడండి అని రిపోర్ట్స్ ఇస్తుంది. దీపక్ వాళ్లు చంపాలి అనుకున్న ప్రతీ సారి రాజు కాపాడుతూ ఉన్నాడని రూప చెప్తుంది. సుమ మందారంతో ఆ రోజు అసలు ఏం జరిగిందో నీకు గుర్తుందా అని అడుతుంది. ఆ రోజు వరకు అంతా గుర్తుందని దీపక్ తనని ప్రేమతో ప్రెగ్నెంట్ చేయడం.. రాజు, రూపలు ఇద్దరికీ పెళ్లి చేయడం.. పెద్దయ్య గారు నాకు న్యాయం చేశారని.. ఇలా మొత్తం చెప్తుంది. విజయాంబిక మాత్రం నిజంగా మందారానికి పిచ్చి అని ఇదంతా విరూపాక్షి రాజులు ఆడిస్తున్న నాటకం అని చెప్తుంది. దానికి సూర్య విజయాంబికను ఆపి మందారానికి చెప్పమని అంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్ష్మీకి ఓ అవకాశం.. మనీషాకి తెలీకుండా HCG టెస్ట్ చేసేదెలా?