Ammayi garu Serial Today Episode విరూపాక్షి సూర్యప్రతాప్‌కి సపోర్ట్ చేస్తుంది. అందరూ సంతోషంతో చప్పట్లు కొడతారు. విజయాంబిక ముఖం మాడ్చుకుంటుంది. ప్రజలకు మంచి జరుగుతుంది అంటే ముందు మృత్యువు ఉన్నా సరే వెనకడుగు వేయను అని నీ సపోర్ట్ కావాలని అంటాడు. విరూపాక్షి తప్పకుండా అని చెప్పి షేక్ హ్యాండ్ ఇస్తుంది. సూర్యప్రతాప్ కూడా ఇస్తాడు. అందరూ చాలా సంతోషిస్తారు.
విరూపాక్షి తన పెళ్లి గుర్తు చేసుకొని చాలా సంబర పడిపోతుంది. సూర్యప్రతాప్ వాళ్లు వెళ్లిపోతారు. మిమల్ని పెద్దయ్యగారికి కలపడానికి హోళీతోనే శ్రీకారం చుడతా అని రాజు అంటాడు. జైలులో ఉన్న దీపక్ రాజు, రూపల వల్లే తన తల్లి ఓడిపోయిందని వాళ్లని వదలకూడదని అనుకుంటాడు. బయటకు వెళ్లగానే ఇద్దరినీ వేసేస్తా అనుకుంటాడు. ఇక విజయాంబిక జైలుకి వెళ్తుంది. ఈ సారి ఎమ్మెల్యేగా వస్తా అన్నారు ఇదేంటి ఇలా వచ్చారని పోలీసులు సెటైర్లు వేస్తుంది. విజయాంబిక దీపక్‌తో మీ మామయ్య విరూపాక్షి సపోర్ట్ తీసుకున్నాడని ఇప్పుడు ఆ సపోర్ట్‌తో మీ మామయ్య సీఎం అవుతున్నాడని వాళ్లిద్దరూ కలిసిపోతున్నారని భయంగా ఉందని అంటుంది. తనని బయటకు తీసుకొస్తే మామయ్యని, అత్తని, రూప, రాజులను చంపేస్తా అంటాడు. అది చెప్పడానికే వచ్చానని రేపు పార్టీ ఆఫీస్‌లో జరగబోయే హోళీ వేడుకకి వచ్చి అందరినీ చంపేయమని దీపక్ బయటకు రావడానికి ఏర్పాట్లు చేశానని రికార్డ్స్ ప్రకారం నువ్వు జైలులో ఉంటావ్ కానీ చేయాల్సింది చేసేయ్ అంటుంది. మందారాన్ని కూడా వదలొద్దని అంటుంది.
పార్టీ ఆఫీస్ దగ్గర అందరూ హోళీ వేడుకులకు వస్తారు. అందరూ సూర్యప్రతాప్, విరూపాక్షిలకు జేజేలు కొడతారు. పంతులు అక్కడికి వచ్చి ఏర్పాటు చేసిన రాధాకృష్ణులకు సూర్యప్రతాప్, విరూపాక్షితో పూజ చేయమంటారు. అందరూ వాళ్లే పూజ చేయాలి అనడంతో సూర్యప్రతాప్ ఒప్పుకుంటాడు. ఇక ఓ కానిస్టేబుల్ దీపక్‌ని వదులుతాడు. అందరూ పార్టీ ఆఫీస్‌లో బందోబస్త్‌కి వెళ్లారని వాళ్లు వచ్చేలోపు రమ్మని చెప్తాడు. పూజ తర్వాత సూర్యప్రతాప్‌కి రంగులు ఇచ్చి విరూపాక్షికి పూసి పార్టీలోకి ఆహ్వానించమని పంతులు చెప్తాడు. సూర్యప్రతాప్‌కి ఇష్టం లేకపోయినా పార్టీ కోసం విరూపాక్షికి రంగులు పూసి పార్టీలోకి ఆహ్వానిస్తాడు. విరూపాక్షి చాలా సంతోషిస్తుంది. రూప, రాజులు సంబర పడిపోతారు.
విరూపాక్షి సూర్యప్రతాప్‌కి రంగులు పూస్తుంది. అందరూ హోళీ ఆటలో మునికిపోతారు. సరదాగా చిందులు వేస్తూ రంగులు పూసుకుంటారు. దీపక్ కూడా తెల్లబట్టలు వేసుకొని అక్కడికి బయల్దేరుతాడు. విజయాంబిక దీపక్ రాక కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. రూప విజయాంబిక దగ్గరకువెళ్లి అమ్మా నాన్న కలిసి ఉండటం చూసి కడుపు మండుతుందా నీ కళ్ల ల్లో మంట కనిపిస్తుందని అత్త అని నీ కళ్లలో మంట నాన్నకి కనిపిస్తే బాధ పడతారు అని అందుకు నా దగ్గర ఓ ప్లాన్ ఉందని ముఖం మీద రంగు పూసి హ్యాపీ హోళీ అని చెప్పి వెళ్లిపోతుంది. ఇక దీపక్ అక్కిడికి వస్తాడు. దీంతో ఇవాళ్లి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఉష, విజయ్‌ల సీన్ చాలా పర్సనల్‌గా ఉందే!!