Ammayi garu Serial Today Episode రుక్మిణి, రాజులు సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి నిజం చెప్తుంది. తానే రూప అని కొన్ని నిజాలు తెలియడంతో ఇలా తన చెల్లి రుక్మిణిలా వచ్చానని చెప్తుంది. విజయాంబిక అత్తయ్యనే చెల్లిని చంపేసిందని చెప్తుంది. నిజం తెలిసిన అమ్మని నమ్మే పరిస్థితిలో మీరు లేరు కాబట్టి మమల్ని అమ్మని ఒకటి చేయాలి అనుకున్నాం అని రూప చెప్తుంది. ఈ పెళ్లిళ్లతో ఇంకెన్ని ఘోరాలు జరుగుతాయో అని ఇలా ఈ టైంలో చెప్పాం అని అంటుంది.
రాజు సూర్యప్రతాప్‌తో ఇప్పుడు చెప్పకపోతే అందరం మోసపోతాం అని ఇప్పుడు చెప్పాం అని ఇద్దరూ చేతులు జోడించి సూర్యప్రతాప్‌కి క్షమాపణ చెప్తారు. సూర్యప్రతాప్ కళ్లు తిరిగి పడిపోతారు. రాజు, రుక్మిణిలు పెద్దగా అరుస్తారు. దాంతో అందరూ ఏమైందా అని పరుగులు తీస్తారు. డాక్టర్ వచ్చి సూర్యప్రతాప్‌ని చూస్తారు. విరూపాక్షి మనసులో ఏంటి దేవుడా ఇది ఏదో ఒకటి చేసి పెళ్లి ఆపమని చేస్తే ఆయనకు ఇలా చేశావా అని ఆయనకు ఏం కాకూడదు అని మొక్కుంటుంది. డాక్టర్ ఇంట్లో వాళ్లతో ఆయన ఎక్కువ ఏమైనా ఆలోచిస్తున్నారా.. ఒత్తిడికి లోనవుతున్నారా అని అడుగుతారు. రూప నిజం చెప్పడం వల్లే ఇలా అయిందా అనుకుంటుంది. చనిపోయా అని రూపలా బాధ పెట్టాను ఇప్పుడు రుక్మిణిలా బాధ పెడుతున్నా అనుకుంటుంది.
బంటీ మనసులో రుక్మిణి అమ్మ కావాలని అడిగి బాధ పెట్టాను ఇక నుంచి బాధ పెట్టకూడదు అనుకుంటాడు. డాక్టర్ అందరితో ప్రస్తుతానికి ఆయన ప్రాణానికి ప్రమాదం జరగలేదు కానీ ఇప్పటికే రెండు సార్లు ఇలా జరిగింది ఇంకో సారి ఇలా జరగకుండా చూసుకోండి అని అంటారు. ఆయన్ను ప్రశాంతంగా ఉండనివ్వండి.. ఒత్తిడికి గురి చేయకండి.. ఒంటరిగా ఉండనివ్వకండి ఎవరో ఒకరు తోడుగా ఉండండి అని అంటారు. తాతయ్యకు నేను తోడు ఉంటాను డాక్టర్ గారు అని బంటీ అంటాడు. చంద్ర డాక్టర్‌తో హాస్పిటల్‌కి తీసుకెళ్దాం అని అంటారు.
సూర్యప్రతాప్ లేచి నాకు ఏమైంది ఎందుకు అందరూ ఇక్కడ ఉన్నారు డాక్టర్ ఎందుకు వచ్చారు అని అడుగుతారు. రుక్మిణితో నువ్వేం చెప్పావ్ అమ్మా నేను పరధ్యానంలో ఉండి వినలేదు అని అంటారు. సూర్యప్రతాప్ బంటీ మాటలు తలచుకొని బంటీని చూస్తూ ఉండిపోవడం వల్ల రుక్మిణి మాటలు వినరు. బంటీ తాతయ్యతో క్షమాపణ చెప్తాడు. ఇంకెప్పుడు ఇబ్బంది పెట్టను అని అంటాడు. సూర్యప్రతాప్ రుక్మిణితో రూప విషయంలో నేను చాలా తప్పులు చేశానమ్మా నీ విషయంలో అలా చేయను. నీ పెళ్లి అంగరంగ వైభవంగా చేస్తానని అంటారు.
రాజు, రూప, విరూపాక్షిలు మాట్లాడుకుంటారు. మొత్తం నిజం చెప్పాను కానీ ఏమైందో అని రూప అంటుంది. రాజు విరూపాక్షి వాళ్లతో ఇప్పుడున్న పరిస్థితిలో రాఘవ తప్ప ఎవరూ పెళ్లి ఆపలేరు అంటాడు. రూప ఆనంద్‌ని కాల్ చేయమని అంటుంది. రాజు కాల్ చేస్తాడు ఇంకా దొరకలేదని ఆనంద్ అంటాడు. రేపే పెళ్లి ఏదో ఒకటిచేయ్ ఆనంద్ అని రాజు అంటాడు. ఇంకేం చేయలేం మిమల్ని ఆ దేవుడే కాపాడాలి అని విరూపాక్షి అంటుంది. విరూపాక్షి వాళ్లు మాట్లాడుకుంటుండగా విజయాంబిక వస్తుంది. విజయాంబికను చూసి ముగ్గురు షాక్ అయిపోతారు. విజయాంబికతో పాటు సుమ, చైతన్య తల్లి వచ్చి రేపు పెళ్లికి గోరింటాకు పెడుతున్నారని తీసుకెళ్లిపోతారు.
విరూపాక్షి ఎలా అయినా పెళ్లి ఆగాలని కోరుకుంటుంది. ఉదయం పెళ్లి వేడుక మొదలవుతుంది. పెళ్లి మండపానికి అతిధులు వస్తారు. సూర్యప్రతాప్ చంద్రతో మన పంతులు రాలేదేంటి వేరే పంతులు వచ్చారు అంటే మన పంతులు ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుందని అందుకే ఈయన్ని తీసుకొచ్చానని అంటాడు. సూర్యప్రతాప్‌కి రెస్ట్ తీసుకోమని చంద్ర చెప్తాడు. రుక్మిణి పెళ్లి కూతురిలా రెడీ అవుతుంది. ఇంకేం చేయలేం పెళ్లి మండపం నుంచి వెళ్లిపోదాం అని మందారం అంటే దానికి విరూపాక్షి అలా వద్దు సూర్య పెళ్లి ఆపాలి కానీ సూర్యకి కోపం వచ్చేలా చేయకూడదు అని అంటుంది. రాజు కూడా రెడీ అయి చాలా బాధగా కూర్చొంటారు.
బంటీ తండ్రి దగ్గరకు వచ్చి ఈ పెళ్లి నీకు ఇష్టమేనా నాన్న అని అడుగుతాడు. నాకు మాత్రం ఇష్టం లేదు నాన్న కానీ తాతయ్యని బాధ పెట్టడం ఇష్టం లేక సైలెంట్‌గా ఉన్నానని అంటాడు. బంటీని తాతయ్య దగ్గరకు వెళ్లమని రాజు చెప్తాడు. రాజు ఆనంద్‌కి కాల్ చేస్తాడు. ఇంకా దొరకలేదని నాన్న దొరుకుతాడు అనే నమ్మకం లేదని అంటాడు. చైతన్యని తల్లిదండ్రులు పెళ్లి కొడుకుగా రెడీ చేస్తారు. ఈ పెళ్లి జరుగుతుందా చివరి నిమిషంలో ఏమైనా అవుతుందా అని చైతన్య తండ్రి అడుగుతాడు. ఈ పెళ్లి సూర్యప్రతాప్‌గారు పర్సనల్‌గా తీసుకొని చేస్తున్నారు కాబట్టి ఏం డౌట్ వద్దని చైతన్య అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?