Ammayi garu Serial Today Episode రాజు- కీర్తి, రుక్మిణి- చైతన్యలు పెళ్లి పందిరి రాట కార్యక్రమంలో పాల్గొంటారు. రుక్మిణిలా ఉన్న రూపకి చైతన్య కుంకుమ పెట్టడం చూసి రాజు బాధ పడతాడు. రుక్మిణి కూడా చైతన్యకు కుంకుమ పెడుతుంది. రాజు, రుక్మిణి చాలా బాధ పడతారు. రాజు, రూపలు ఇద్దరూ కీర్తి, చైతన్యలతో పూజ చేస్తారు.
విరూపాక్షి ఏడుస్తూ దేవుడా ఏదో ఒకటి చేసి పెళ్లిళ్లు ఆపాలని కోరుకుంటుంది. సూర్యప్రతాప్ మనసులో పెళ్లిళ్లు ఏ ఆటంకం లేకుండా జరగాలి అనుకుంటాడు. పందరిరాట ఏర్పాటుకు రెండు జంటల్ని పంతులు పూజ చేయిస్తారు. తర్వాత నలుగురితో పందరిరాట పెట్టించి పసుపు తాడు కట్టిస్తారు. రాజు, రూపలు ఒకర్ని ఒకరు చూసి బాధ పడతారు. కీర్తి, చైతన్య ఇద్దర్ని చూస్తారు. కానీ ఏం అనరు. పందిరి రాట తర్వాత రాజు, కీర్తిలు చైతన్య, రుక్మిణిలు సూర్యప్రతాప్, విరూపాక్షిల ఆశీర్వాదం తీసుకుంటారు. తర్వాత పెద్దల ఆశీర్వాదం తీసుకుంటారు. విరూపాక్షి ఏడుస్తూ వెళ్లిపోతుంది.
రాజు, రూప, విరూపాక్షి దగ్గరకు వెళ్తారు. విరూపాక్షి వాళ్లతో మీ ఇద్దరూ ఇలాగే చేతులు కట్టుకొని నిల్చొంటే ఘోరం జరిగిపోతుంది. రేపే పెళ్లి మీరు ఇలాగే ఉంటే పెళ్లి జరిగిపోతుంది. పెళ్లి పీటల మీద ఆపడం కంటే ఇప్పుడే ఆపడం మంచిది అని విరూపాక్షి అంటుంది. ఇప్పుడే చెప్తే నిన్ను గెంటేస్తారని రూప అంటుంది. రాఘవని తీసుకురావడం మీ వల్లే కాలేదు ఆనంద్ వల్ల ఎలా అవుతుంది.. మీరు నా గురించి ఆలోచించొద్దు.. నేను సూర్య కలవడం కంటే మీరు కలిసి ఉండాలి అదే నాకు ముఖ్యం ఇప్పుడే వెళ్లి చెప్పేస్తా అని విరూపాక్షి అంటుంది. మందారం కూడా ఇప్పుడు చెప్తేనే మంచిది అంటుంది.
విరూపాక్షి నిజం చెప్పడానికి వెళ్తుంటే రూప ఆపి నేనే నాన్నకి నిజం చెప్తాను అంటుంది. నువ్వు చెప్తే జీవితంలో నిన్ను క్షమించరు. మేం నిజం చెప్తే ఇప్పుడు మమల్ని దూరం పెట్టినా ఎప్పుడో ఒక రోజు మమల్ని క్షమిస్తారు అని ఇద్దరూ నిజం చెప్పడానికి వెళ్తారు. కీర్తి అలియాస్ దీప్తి విజయాంబిక, దీపక్‌లతో ఎక్కడో తేడా కొడుతుందని.. రాజు తనని చూడకుండా రుక్మిణిని చూస్తున్నాడని రుక్మిణి చైతన్యను చూడకుండా రాజునే చూస్తుందని అంటుంది. నాకు అలాగే అనిపిస్తుంది. రుక్మిణి రూప అనిపిస్తుందని విజయాంబిక అంటుంది. తను రుక్మిణి రూపనో రేపు తెలిసిపోతుందని దీపక్ అంటాడు. రేపు పెళ్లిళ్లు జరిగకుండా రూప అయినా రాజు అయినా విరూపాక్షి అయినా ఆపేస్తారు అని అంటాడు.
సూర్యప్రతాప్ కోపాన్ని తట్టుకోవడం కష్టం.. పెళ్లి ఆగింది అంటే రూప నాటకం ఆడిందని రాజు, రూపల్ని బయటకు గెంటేస్తాడు. అలా జరిగితే ఈ కోట్ల ఆస్తికి మేమే రాజులు మేమే మంత్రలం అంటుంది. అది ఎలా అని కీర్తి అడిగితే రూప చేసిన మోసానికి మా మామయ్య గుండె ఆగి చస్తాడు అని అంటుంది. ఈ ఆస్తి మా సొంతం అయితే నీ వాటా నీకు ఇస్తాం. జీవన్‌ని బయటకు తీసుకొస్తాం.. ఇదంతా జరగాలి అంటే రుక్మిణి రూప అవ్వాలి అని అంటాడు.
బంటీ, సూర్యప్రతాప్ గదిలో ఉంటారు. బంటీ సూర్యప్రతాప్తో రేపు పెళ్లి అయిపోతే నేను రుక్మిణి అమ్మని అమ్మ అని పిలవలేను కదా అంటాడు. దానికి సూర్యప్రతాప్ నీకు కీర్తి అమ్మ ఉంది అంటాడు. దానికి బంటీ కీర్తి, రుక్మిణిల్లో ఎవరిని చూస్తే నీకు మా అమ్మని చూసినట్లు ఉంటుంది తాతయ్య అంటాడు. దాంతో సూర్యప్రతాప్ రూపలా ఉంటుంది కాబట్టి రుక్మిణిని చూస్తేనే రూపని చూసినట్లు ఉంటుందని అంటారు. దాంతో బంటీ నాకు కూడా రుక్మిణి అమ్మని చూస్తే మా అమ్మ గుర్తొస్తుంది. నాకు ఎందుకు అమ్మ చనిపోలేదు రుక్మిణి అమ్మలా అమ్మే నా కళ్ల ముందు తిరుగుతున్నట్లు ఉంది అంటాడు.
సూర్యప్రతాప్ బంటీతో పెళ్లిళ్లు రేపు జరుగుతాయి. అవి అయితే అన్నీ సర్దుకుపోతాయి. మీరు సర్దుకుపోతారు కానీ నేను సర్దుకుపోను నీకు రుక్మిణి అమ్మే కావాలి లేదంటే నేను ఈ ఇంట్లో ఉండను.. స్కూల్‌కి వెళ్లను అని అరుస్తాడు. ఇంతలో రాజు, రూపలు వచ్చి రాజు బంటీతో అలా మాట్లాడొద్దు అని అంటాడు. నాకు రుక్మిణే అమ్మగా కావాలి తాతయ్య మాత్రమే ఇవ్వగలరు అందుకే అడుగుతున్నా మీరేం చేస్తారో నాకు తెలీదు నాకు రుక్మిణి అమ్మ కావాలి అంటాడు. బంటీని అక్కడి నుంచి రాజు పంపేస్తాడు. సూర్యప్రతాప్ రాజుతో బంటీ ప్రశ్నలకు తన దగ్గర సమాధానం లేదని అంటాడు. రాజు, రూపలు ఇద్దరూ సూర్యప్రతాప్కి సారీ చెప్తారు. మీరంతా అనుకున్నట్లు మీ రూప చనిపోలేదు నాన్న బతికేఉందని రుక్మిణి చెప్తుంది. రూపని నేనే అని చెప్తుంది.
సూర్యప్రతాప్ ఏం మాట్లాడకుండా ఉండి పోతాడు. నీళ్లులో పడిన నేను చనిపోయాను అని మీరు అనుకున్నారు. నేను వచ్చి నిజం చెప్పాలి అనుకున్నా కానీ ఓ నిజం తెలిసింది. తర్వాత ఓ దారుణం తెలిసింది. అందుకే అత్తయ్యకు బుద్ధి చెప్పాలని నిర్ణయించుకొని రుక్మిణిలా వచ్చానని చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?