Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode అంబిక సుభాష్‌కి కాల్ చేసి సహస్ర సీక్రెట్ తెలిసిందని సహస్రని అడ్డు పెట్టుకొని లక్ష్మీని ఓ ఆట ఆడుకోవాలని తన ప్లాన్ చెప్తుంది. సహస్ర నెంబరు ఇస్తుంది. సుభాష్‌ సహస్రకు కాల్ చేసి అంబికకు లైన్ కలుపుతుంది. ఎవడ్రా నువ్వు అని సహస్ర అడుగుతుంది. పెళ్లి అయింది కానీ ఇంకా ఏ ముచ్చట లేదు అంట కదా అంటాడు. సహస్ర పిచ్చి పిచ్చిగా మాట్లాడుతున్నావ్ అని తిడుతుంది. 

సుభాష్ సహస్రతో నీ పెళ్లి ఎలా జరిగిందో నాకు తెలుసులే.. ఆ డాక్టర్‌తో కలిసి బాగానే యాక్ట్ చేశావ్.. పాతికి లక్షలు ఇచ్చావ్ అంట కదా అంటాడు. సహస్ర చాలా కంగారు పడుతుంది. కానీ రాంగ్ నెంబరు అని  అంటుంది. అయితే విహారికి చెప్తా అంటాడు. దాంతో సహస్ర భయపడి ఏం కావాలి అని అడుగుతుంది. దాంతో సహస్రకు సుభాష్ లక్ష్మీ ప్రాజెక్ట్‌ ప్రజంటేషన్‌కి సంబంధించిన పెన్‌డ్రైవ్‌ తీసుకొచ్చి ఇవ్వమని చెప్తాడు. బావకి లక్ష్మీకి తెలిస్తే తిడతారని సహస్ర అంటే అయితే విహారికి నిజం చెప్పేస్తా అంటాడు. దాంతో సహస్ర పెన్‌డ్రైవ్ ఇవ్వడానికి ఒప్పుకుంటుంది. 

లక్ష్మీ, యమునలు రాత్రి అందరికీ భోజనాలు వడ్డిస్తారు. యమున లక్ష్మీని పంపేస్తే యమున ఆపుతుంది. పద్మాక్షి ప్రశ్నిస్తే తనకు ప్రాజెక్ట్ వర్క్ ఉందని యమున అంటుంది. విహారి పద్మాక్షితో తనేం పని మనిషి కాదు కదా అంటాడు. అంబిక, పద్మాక్షి సో ఆఫ్ అంటాడు. ఆ ప్రజంటేషన్ ఏంటో నువ్వు, సహస్ర చూసుకుంటే సరిపోతుంది కదా అంటుంది. దాన్ని వెనక వేసుకొని వచ్చి నెత్తిన పెట్టుకోండి అని అంటుంది. అందరూ లక్ష్మీని వెనకేసుకొస్తారు. ఏదో ఒక రోజు తను పంగనామాలు పెట్టేస్తుందిలే అని పద్మాక్షి అంటే లక్ష్మీకి అలాంటి ఉద్దేశం లేదని తను తప్పు చేయదు తన ముందు తప్పు కనిపించినా వదలదు అని యమున, విహారి, వసుధ, చారుకేశవ్ అంటారు. 

పద్మాక్షి కోపంగా లేచి వెళ్లిపోతుంటే విహారి పిలిచి లక్ష్మీని అనవసరంగా ఏం అనొద్దు అని అంటాడు. సహస్రకు మళ్లీ సుభాష్ కాల్ చేస్తాడు. చెప్పిన పని చేశావా అంటే సహస్ర చేశాను అంటుంది. రాత్రి అందరూ పడుకున్న తర్వాత సహస్ర లక్ష్మీ గదికి వెళ్లి లక్ష్మీ పడుకున్న తర్వాత లక్ష్మీ బ్యాగ్ నుంచి పెన్ డ్రైవ్ తీసేస్తుంది. సుభాష్ మా వాడు వస్తాడు పెన్‌డ్రైవ్ ఇచ్చేయ్ అని మా వాడు మీ ఇంటికి వచ్చాడు ఇచ్చేయ్ అంటాడు. ఇంత రాత్రి అయితే కష్టం అని సహస్ర అంటే అయితే మీ బావకి కాల్ చేస్తా అంటాడు. దాంతో సహస్ర బయటకు వెళ్తుంది. సుభాష్ మాస్క్ పెట్టుకొని వెయిట్ చేస్తాడు. సహస్ర రాగానే పెన్ డ్రైవ్ తీసుకొని వెళ్లిపోతాడు.

విహారి వాళ్లంతా ఉదయం ఆఫీస్‌కి వెళ్తారు. అందరూ లక్ష్మీ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. లక్ష్మీ రాగానే చారు కేశవ చూసి మన ఎండీ గారు వచ్చేశారు అంటాడు. లక్ష్మీకి విహారి బొకే ఇచ్చి కంగ్రాట్స్ చెప్తాడు. లక్ష్మీని తీసుకెళ్లి ఎండీ సీట్‌లో కూర్చొపెడతారు. అంబిక మనసులో కూర్చొవే అది ముళ్ల స్థానం దానికి నువ్ సరిపోవని త్వరలోనే నిరూపిస్తానని అనుకుంటుంది. విహారి మనసులో కనకం నీకు నా భార్య స్థానం ఇవ్వలేకపోయా కానీ నువ్వు నీ టాలెంట్‌తో నీకు గుర్తింపు తెచ్చుకున్నావ్ అని అనుకుంటాడు. లక్ష్మీ ఎండీగా మొదటి సంతకం పెడుతుంది. విహారికి, అందరికీ థ్యాంక్స్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: అమ్మాయి గారు సీరియల్: కీర్తి, చైతన్యల్ని బతిమాలిన రాజు, రుక్మిణిలు.. రాజు, రూపల జీవితాల్లో ఏం జరగనుంది?