Ammayi garu Serial Today Episode రుక్మిణి పెళ్లిని సూర్యప్రతాప్‌ చైతన్యతో ఫిక్స్ చేస్తారు. రాజు నోటితోనే ఈ పెళ్లి ఏర్పాట్లను నేనే చూసుకుంటా అని చెప్పేలా విజయాంబిక చేస్తుంది. విరూపాక్షిని ఉద్దేశించి సూర్యప్రతాప్‌ ఈ పెళ్లిళ్లలో ఎలాంటి ఆటంకాలు రాకూడదు అని చెప్తారు. చైతన్య వాళ్లకి గది చూపించమని చంద్రకి చెప్పి వాళ్లకి కావాల్సిన ఏర్పాట్లు సుమకి చూసుకోమని చెప్తారు.

విరూపాక్షి మనసులో నా కోసం ఈ పిల్లలు ఏదో చేయాలి అనుకున్నారు కానీ ఇప్పుడు పెళ్లి కొడుకుని కూడా సూర్య తీసుకొచ్చారని అనుకొని బాధగా వెళ్లిపోతుంది. విజయాంబిక కొడుకుతో ఈ పెళ్లి నుంచి ఎవరూ తప్పించుకోవాలి. భలే వాడిని తీసుకొచ్చారు. రుక్మిణితో మనం ఆడుకోవాలి అంటే ఈ చైతన్యని మనం వాడుకోవాలి అనుకుంటాడు. విరూపాక్షి రాజు, రూపలతో ఈ పెళ్లితో మీ ఇద్దరి జీవితాలు నాశనం అయిపోతాయి. సూర్యకి నిజం చెప్తే అర్థం చేసుకుంటాడని అనుకుంటున్నాను నిజం చెప్పేద్దాం అని విరూపాక్షి అంటుంది. రాజు, రూపలు విరూపాక్షిని ఆపుతారు. ఆనంద్ రాఘవని తీసుకొస్తానని చెప్తాడు. పెళ్లి ముహూర్తం వరకు ఆగుదాం అని అంటాడు. 

పెళ్లి మండపంలో అందరి ముందు సూర్యకి నిజం తెలియడం కంటే మన ముందు నిజం తెలిస్తే మంచిది అని అంటుంది. రాజు విరూపాక్షితో పెళ్లి కొడుకుతో మాట్లాడుదాం. కీర్తితో మాట్లాడుదాం అని అంటారు. చైతన్య అర్థం చేసుకోడని పింకీ విషయంలో పరువు పోయింది కదా అంటుంది. కీర్తికి విషయం చెప్దామని రాజుతో రూప  చెప్తుంది. రాజు కీర్తితో మాట్లాడటానికి వెళ్తాడు. రూప చైతన్యతో మాట్లాడటానికి వెళ్తుంది. విరూపాక్షి బాబాకి దండం పెట్టుకుంటుంది. ఇద్దరిలో కనీసం ఎవరో ఒకరు అయినా ఒప్పుకుంటే చాలు అని మొక్కుంటుంది. హాల్‌లో చైతన్య ఫ్యామిలీలో విజయాంబిక, సుమ, చంద్రలు మాట్లాడుతుంటారు.

రాజు, రుక్మిణిలు కిందకి వస్తారు. రాజు కీర్తిని, రుక్మిణి చైతన్యని మాట్లాడాలని బయటకు తీసుకెళ్తారు. రాజు కీర్తితో మన మధ్య ఏం జరిగిందో మనకి మాత్రమే తెలుసు. బయట ప్రపంచానికి తెలీదు. మీరు సూసైడ్ చేసుకోవడం వల్లే ఈ పెళ్లి ఫిక్స్ చేశారు. నా నిర్ణయం కూడా అడగలేదు. నాకు ఈ పెళ్లి ఇష్టం లేదు అని రాజు చెప్పేస్తాడు. కీర్తి కంగుతింటుంది. రూప కూడా చైతన్యకి తనకు పెళ్లి ఇష్టం లేదని వేరే వ్యక్తిని ప్రేమించానని చెప్తుంది. ఈ విషయం మీ నాన్నకి చెప్పండి అని చైతన్య అంటాడు. నేను నాన్నకి చెప్పలేక మీకు చెప్పుకున్నా అంటుంది. మీరే అర్థం చేసుకోండి మీకే పెళ్లి ఇష్టం లేదు అని చెప్పండి ప్లీజ్ అని బతిమాలుతుంది. 

రాజు కూడా కీర్తికి అదే విషయం చెప్తాడు. మీకు భార్యగా కాకుండా మీ బిడ్డకు తల్లిగా ఉంటాను  కాదు అనొద్దు అని చెప్తుంది. ఇక చైతన్య రుక్మిణితో అందర్ని నేనే అర్థం చేసుకోవాలా గతంలో పింకీతో పెళ్లి ఫిక్స్ చేశారు. నాకు కాబోయే భార్యని మీ బావ వేరే వ్యక్తితో పెళ్లి చేశారు. నేను ఎంత బాధ పడ్డానో మీకు తెలుసా అని బాధ పడతాడు. కీర్తికి రాజు చాలా నచ్చచెప్తాడు. నీకు మంచి సంబంధం చూస్తాను అని కూడా అంటాడు. ఇద్దరూ ఇద్దరినీ ఒప్పించే ప్రయత్నం చేస్తారు. విజయాంబిక దీపక్‌లు టెన్షన్ పడిపోతుంటారు. కీర్తి రాజుతో ఈ పెళ్లి విషయంలో నేనేం నిర్ణయం తీసుకోలేను.. అని పెళ్లి చేసుకుంటాను అంటుంది. చైతన్య కూడా తను చెప్పను అనేస్తాడు. ఈ పెళ్లి కూడా జరగకపోతే నా ఫ్యామిలీ నేను ఏ స్థితిలో ఉంటామో మీరే ఊహించండి అని కుదరదు అనేస్తాడు. 

కీర్తి, చైతన్య ఇద్దరూ మీరే వెళ్లి సూర్యప్రతాప్‌కి చెప్పుకోండి అని తాము తప్పించుకుంటారు. రాజు, రూపలు ఇద్దరూ డిసప్పాయింట్ అయిపోతారు. ఇద్దరూ దిగులుగా విరూపాక్షి వాళ్ల దగ్గరకు వెళ్తారు. ఇద్దరూ చెప్పింది విరూపాక్షి, మందారానికి చెప్తారు. కీర్తి కూడా దీపక్ వాళ్లకి చెప్తుంది. సూర్యప్రతాప్‌ చాలా హ్యాపీగా ఉంటాడు. పెళ్లిళ్లు ఇద్దరి జీవితాలు సెట్ అవుతాయి అనుకుంటాడు. ఇక పింకీని కూడా ఇంటికి తీసుకొస్తానని అప్పుడే సుమ, చంద్రలు హ్యాపీగా ఉంటారని అనుకుంటాడు. 

పెళ్లి సందడి మొదలవుతుంది. రుక్మిణిని మందారం, విరూపాక్షిలు రెడీ చేస్తారు. చాలా బాధ పడతారు. నాకు భయంగా ఉంది అని విరూపాక్షి అంటే రూప తనకు భయంగా ఉందని కానీ ఏదో మూల నమ్మకం ఉందని అంటుంది. రాజు కూడా టెన్షన్ పడతాడు. పందిరి రాట వేస్తే ఇక బయటకు కూడా వెళ్లలేం అనుకుంటాడు. బంటీ తండ్రి దగ్గరకు వెళ్లి రుక్మిణి అమ్మకి కొత్తగా వచ్చిన వాళ్లతో పెళ్లి అవుతుందా అవ్వొద్దని ఉంది నాన్న అని అంటాడు. కీర్తిని విజయాంబిక రెడీ చేస్తుంది. అందరూ పూజకు కూర్చొంటారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!