Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ నిర్దోషిగా కోర్టు తేల్చడంతో ఇంటికి తీసుకొస్తారు. హారతి ఇచ్చి వసుధ ఆహ్వానిస్తుంది. లక్ష్మీ తప్పు ఏం లేదని భలే నిరూపించారని విహారి, లక్ష్మీని పొగుడుతారు. ఇంతలో పద్మాక్షి, అంబిక, సహస్రలు వస్తారు. పద్మాక్షి వచ్చి అదేం యుద్ధం చేసి గెలిచి రాలేదు కదా పొగడ్తలు ఆపండి అని తిడుతుంది. ఎందుకు అత్తయ్యా ఎప్పుడూ లక్ష్మీనే అంటారు అని విహారి అడుగుతాడు.

పద్మాక్షి విహారితో నువ్వు ఎందుకు ఎప్పుడు లక్ష్మీని వెనకేసుకొస్తావని అడుగుతుంది.  లక్ష్మీ నా భార్య అని విహారి చెప్పబోయి ఆగుతాడు. సహస్ర తల్లిని తీసుకెళ్లిపోతుంది. అందరూ ఎటూ వాళ్లు అటు వెళ్లిపోతారు. విహారి లక్ష్మీ మీద ఎవరు అటాక్ చేశారు. ఇదంతా ఎవరు చేస్తున్నారు అని ఆలోచిస్తాడు. ఎండీ అయింది అని ఎవరైనా పగ పట్టారా మొత్తం తెలుసుకోవాలి అనుకుంటాడు. లక్ష్మీ బయట కూర్చొని ఆలోచిస్తూ ఉంటుంది. లక్ష్మీ దగ్గరకు అంబిక వెళ్తుంది.

అంబిక: హత్య చేసి కూడా భలే తప్పించుకున్నావ్.లక్ష్మీ: నేను చేయని హత్యానేరం నా మీద వేశారని మీకు తెలీదా. అంబిక: ఎవరికీ తెలీకుండా నీ రూంకి వచ్చిన వాడు ఎలా శవం అయిపోయాడు.లక్ష్మీ: అది మీరే చెప్పాలి. ప్లాన్ మీరు వేసి నన్ను ప్లాన్డ్‌గా జైలుకి పంపాలని చూశారు. అంబిక: ఆ అవసరం నాకు ఏం ఉంది.లక్ష్మీ: మీరు చేసే పనులకు అడ్డుగా ఉంది నేనే కదా. మీ నిజస్వరూపం తెలిసింది నాకే కదా. అంబిక: నా మీద నిందలు వేస్తే నేను ఊరుకుంటానా.లక్ష్మీ: నాకు కానీ విహారి గారికి కానీ శత్రువులు ఎవరూ లేరు. అప్పుడు నా బ్యాగ్‌లో నగలు వేసింది మీరే. ఇప్పుడు ఆత్మరక్షణ కోసం కొడితే వాడిని చంపేసి నా మీద వేసేశారు. ఇప్పుడు నేను ఇంటికి రాగానే నా దగ్గరకు ఎందుకు వచ్చారు.అంబిక: సానుభూతితో వచ్చాను.లక్ష్మీ: కాదు ఎక్కడ మీరు దొరికిపోతారో అని వచ్చారు.అంబిక: నాకేం భయం. లక్ష్మీ: అవునా అయితే పదండి లోపలికి వెళ్దాం. నాకు తెలిసిన మీ నేరాల చిట్టా మొత్తం చెప్తా పదండి. నేను నోరు విప్పితే మీ స్థాయి, స్థానం ఎక్కడుంటాయో తెలుసా. మిమల్ని వదలను గుర్తు పెట్టుకోండి. ఇప్పటికి పోలీసులు నిందితుడి కోసం వెతుకుతున్నారు. మీ వరకు వస్తారు. జాగ్రత్త.అంబిక: ఛా ఒక్క సారి కాళ్ల కింది భూకంపం వచ్చినట్లు అయింది ఏంటి.

యమున రాత్రి లక్ష్మీ దగ్గరకు వెళ్లి నిన్న నుంచి నువ్వు ఎంత క్షోభ అనుభవించావో కదామ్మా అంటే లక్ష్మీ ఏడుస్తుంది. వాడు రాగానే నేను మిమల్ని పిలవాలి అనుకున్నా కానీ నా నోరు నొక్కేశాడు. నేను ఎప్పుడు అతనికి మెసేజ్ చేయలేదు. చివరకు అతను నా దగ్గరకు వచ్చి చనిపోయాడు అని లక్ష్మీ ఏడుస్తుంది. నువ్వు అతన్ని సీసాతో కొట్టిన తర్వాత మరో వ్యక్తి అతన్ని చంపేసి నీ మీద నింద వేయాల్సిన అవసరం ఏంటి అని యమున అడుగుతుంది. అదంతా విహారి చాటుగా వింటాడు. లక్ష్మీ మనసులో ఇదంతా చేసింది అంబిక అమ్మ అని మీతో ఎలా చెప్పాలి అనుకుంటుంది. విహారి మనసులో ఇంత ప్లాన్‌గా ఇలా చేశారు అంటే లక్ష్మీని ఎవరో బాగా అబ్జర్వ్ చేస్తున్నారు. లేదంటే నన్ను టార్గెట్ చేసిన వాళ్లు లక్ష్మీ నాకు తోడుగా ఉందని తనని టార్గెట్ చేశారా. ఏది ఏమైనా నా భార్యని నేను కాపాడుకోవాలి అని అనుకుంటాడు.

లక్ష్మీకి అదికేశవ్ కాల్ చేస్తాడు. మేం కలవడం లేదు ఏం అనుకోవద్దు నాన్న అని లక్ష్మీ అంటే ఏం పర్లేదు అని అదికేశవ్ అంటాడు. ఇక ఆదికేశవ్ లక్ష్మీతో నిన్ను అన్యాయంగా ఇరికించిన వాళ్లు ఎవరో తెలిసిందా.. నువ్వు అల్లుడుగారు జాగ్రత్తగా ఉండాలమ్మా ఎవరో మిమల్ని కుట్రలో ఇరికిస్తున్నారని అంటుంది. అంబిక చూసి ఇది ఎవరితో మాట్లాడుతుంది అనుకుంటుంది. దగ్గరకు వచ్చి ఫోన్ తీసుకుంటుంది. లక్ష్మీ ఫోన్ ఇవ్వమని అడుగుతుంది. అంబిక ఆ నెంబరుకు డయిల్ చేయగానే లక్ష్మీ లాక్కుంటుంది. ఇక లక్ష్మీ అంబికతో నగలు తెచ్చినదాన్ని వాడికి ఎవరు ఇచ్చారో తెలుసుకోలేనా అన్నీ తెలిశాక విహారి గారికి చెప్పడానికి క్షణం కూడా ఆలోచించను అనగానే అంబిక వెళ్లిపోతుంది. 

సహస్ర చాలా టెన్షన్ పడుతుంది. లక్ష్మీ నుంచి బావని దూరం చేయలేకపోతున్నా అని బాధ పడుతుంది. సహస్ర దగ్గరకు పద్మాక్షి వస్తుంది. ఎందుకే టెన్షన్ పడుతున్నావ్.. నీ బాధ నాకు అర్థమైందే నిజం ఎవరికీ తెలిసిపోతుందే అనే కదా అని విహారిని డాక్టర్‌తో కలిసి నాటకం ఆడి పెళ్లి చేసుకోవడం గురించి మాట్లాడుకుంటారు. అంబిక మొత్తం వినేస్తుంది. అంబిక మనసులో సహస్ర ఇంత ప్లాన్ చేశావా మీ పని చెప్తా అనుకుంటుంది. ఇక అంబికకు సిద్దార్థ్ కాల్ చేస్తాడు. తన నగలు పోయిన విషయం చెప్తాడు. సిద్దార్థ్ మళ్లీ డబ్బులు అడిగితే నా దగ్గర రూపాయి లేదు కొన్నాళ్లు వెయిట్ చేస్తే చేయ్ లేదంటే నీకు నచ్చింది చేయ్ అని ఫోన్ కట్ చేసేస్తుంది. తర్వాత సహస్ర, పద్మాక్షి ఇద్దరూ తన దగ్గర ఇంత పెద్ద విషయం దాచారని ఈ సీక్రెట్‌తో సహస్రతో ఆడుకుంటానని అంబిక అనుకుంటుంది. వెంటనే సుభాష్‌కి కాల్ చేస్తుంది. నాతో ఏ అవసరం ఉంది ఇప్పుడు కాల్ చేశావ్ అంటాడు. సహస్రకు సంబంధించిన సీక్రెట్ తెలిసింది దాన్ని వాడుకుందాం అని అంటుంది. అందుకు తగ్గట్టు ప్లాన్ చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.

Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: కోర్టులో ఉత్కంఠ.. లక్ష్మీకి శిక్ష గ్యారెంటీ.. విహారి ఏం చేయనున్నాడు!