Ammayi garu Serial Today Episode విజయాంబిక సూర్యప్రతాప్‌ని విరూపాక్షితో కలిసి వ్రతం చేయొద్దని తగిలిస్తుంది. రూప తండ్రిని పిలుస్తే అందరూ రారు అనుకుంటారు కానీ సూర్యప్రతాప్ బయటకు వచ్చి రుక్మిణి నీ కోసం వస్తా నీ జీవితం బాగుండాలని వస్తానని చెప్పి వ్రతానికి వస్తాడు. తల్లీకొడుకులు కుళ్లుకుంటారు.
రూప మేనత్త దగ్గరకు వెళ్లి చూశావు కదా అత్తయ్య నువ్వు వెలిగించిన దీపాన్ని ఎలా ఆర్పానో అనవసరంగా మా విషయాల్లో కలుగ జేసుకోకుండా ఉంటే నీకే మంచిది అని అంటుంది. రాజు, రుక్మిణిలు వ్రతంలో కూర్చొంటారు. రుక్మిణి తల్లిదండ్రుల్ని కూర్చొమని చెప్తుంది. సూర్యప్రతాప్ ఆలోచిస్తే నాయనా ఇది మీకోసమో మా కోసమో కాదు మన కోసం అని చెప్పి తండ్రికి కూర్చొనేలా చేస్తుంది. మందారం విరూపాక్షిని తీసుకెళ్లి సూర్యప్రతాప్ పక్కన కూర్చొపెడుతుంది. రుక్మిణి చిన్నాన్న పిన్నిలకు కూడా కూర్చొమని చెప్తుంది. మూడు జంటలు కూర్చొన్న తర్వాత వ్రతం ప్రారంభమవుతుంది.
సూర్యప్రతాప్ విరూపాక్షిని చూసి ఇబ్బందిగా ఉంటాడు. ఒకటి అనుకుంటే ఇంకొకటి జరిగిందని తల్లీకొడుకులు అనుకుంటారు. వాళ్లని అలా చూస్తుంటే కడుపు రగిలిపోతుంది ఏదో ఒకటి చేయాలి అని ఫోన్ వెతకాలి అనుకుంటారు. అందరూ వ్రతంలో ఉంటే ఫోన్ వెతకాలని అనుకుంటారు. విజయాంబిక కొడుకుతో ఇద్దరం వెళ్తే అనుమానం వస్తుంది నేను వెళ్తా నువ్వు ఉండు అని అంటుంది. రూప అత్త వెళ్లడం చూస్తుంది.
విజయాంబిక రూప గదికి వెళ్లి మొత్తం వెతుకుతుంది. పంతులు రెండు జంటలకు ఒకరికి ఒకరు బొట్టు పెట్టుకోమని అంటే సూర్యప్రతాప్ ఆలోచించి విరూపాక్షికి బొట్టు పెడతాడు. రూప, రాజులు చాలా సంతోషపడతారు. రూప అత్త గురించి ఆలోచిస్తుంది. మందారాన్ని పిలిచి అత్తయ్యని కనిపెట్టమని చెప్తుంది. మందారం వెళ్తుంటే దీపక్ ఆపి కాఫీ అడుగుతాడు. మందారం వద్దు అంటే మజ్జిగ కావాలని అడుగుతాడు. మందారం వెళ్లిపోతుంది. విజయాంబికకు ఫోన్ దొరుకుతుంది.
విజయాంబిక సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి తమ్ముడు ఈ రుక్మిణి మన అందరినీ మోసం చేసింది అని అంటుంది. ఇక్కడ జరుగుతుంది ఏంటి నువ్వు చేస్తుంది ఏంటి అని సూర్యప్రతాప్ తిడతారు. తర్వాత మాట్లాడుకుందామని అంటాడు. దాంతో విజయాంబిక రుక్మిణి నిజంగా రుక్మిణి కాదు మనం చనిపోయింది అనుకున్న రూపే ఈ రుక్మిణి అని అంటుంది. అందరూ షాక్ అవుతారు. నిజం తెలిసిపోయిందని విరూపాక్షి చాలా టెన్షన్ పడుతుంది. దీపక్ తన దగ్గర వీడియో ఉందని చెప్పి ఫోన్ మొత్తం వెతుకుతాడు. అందులో వీడియో ఉండదు. తల్లీకొడుకులు షాక్ అయిపోతారు. రాజు, రూపలు నవ్వుకుంటారు. సూర్యప్రతాప్ వాళ్లతో కొట్టినా తిట్టినా ఇంటి నుంచి పంపినా మీరు మారరు వెళ్లండి అని తిడతాడు.
వ్రతం పూర్తయిపోతుంది. తల్లీకొడుకుల దగ్గరకు రూప, రాజులు ప్రసాదం తీసుకొని వెళ్తారు. వీడియో గురించి ఆలోచిస్తున్నారా ఆ వీడియో మేమే డిలీట్ చేశాం అంటారు. ఫోన్ లాక్ ఎలా తీశామని అనుకుంటున్నారా రాత్రి మీరు పడుకున్నప్పుడు వచ్చి నీ ఫేస్ ద్వారా అన్ లాక్ చేశామని రాజు చెప్పడంతో దీపక్, విజయాంబిక బిత్తర పోతారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కలవారి కోడలు కనకమహాలక్ష్మీ: 100 కోట్ల స్కామ్‌లో లక్ష్మీ.. సస్పెండ్ చేసిన విహారి..!