Ammayi garu Serial Today Episode జీవన్, విజయాంబిక వాళ్లు రాజు కొడుకు బంటీ, రూపలకు డీఎన్‌ఏ టెస్ట్ చేయాలి అనుకుంటారు. దీపక్ చాటుగా రూప వెంట్రుకల్ని తీసుకొచ్చి విజయాంబికకు ఇస్తాడు. బంటిని కిడ్నాప్ చేసి బంటీ హెయిర్, రూప హెయిర్‌తో డీఎన్‌ఏ టెస్ట్ చేయాలి అని కొడుకుతో అంటుంది. ఇక మందారం బతికి ఉంటే దాన్ని చంపేయాలని మందారాన్ని వెతికించమని చెప్తుంది. 


స్కూల్‌లో పిల్లలు లంచ్ చేయడానికి రెడీ అవుతారు. రూప లంచ్  బాక్స్ తీసుకొని వస్తుంది. బంటీ రూపతో మా నాన్న బాక్స్‌ తీసుకొస్తానని అన్నాడు ఇంకా రాలేదని చక్రపొంగలి తీసుకొస్తానని చెప్పాడని అంటాడు. రూప మనసులో ఏ తల్లి బిడ్డ కానీ నాకు ఇష్టమైనవే వీడికి ఇష్టమని అనుకుంటుంది. ఇక రూప ఇద్దరికీ నేను తినిపిస్తాను అని చెప్పి తినిపిస్తుంది. రాజు బంటీకి లేట్ అయిందని ఫాస్ట్‌గా వస్తుంటాడు. రూప బంటీని తినిపిస్తూ చనిపోయాడు అనుకున్న తన బిడ్డని గుర్తు చేసుకుంటుంది. ఇక బంటీని కిడ్నాప్ చేయడానికి జీవన్, దీపక్, విజయాంబిక వాళ్లు వస్తారు. బంటీ మనసులో మా అమ్మ ఉండి ఉంటే నాకు ఇలాగే తినిపించి ఇంతే ప్రేమగా చూసుకునేది కదా కానీ నాకు అమ్మ లేదు అని అనుకుంటాడు. బంటీ రూపతో నాకు ఎప్పుడూ మా నాన్ననే తినిపిస్తాడు కానీ అమ్మ తినిపిస్తే బాగుండేదని అంటాడు. రూప బంటీకి అమ్మ గురించి అడుగుతుంది. దాంతో బంటీ తనకు అమ్మ లేదని చెప్తాడు. ఇంతలో దీపు మీద నీరు పోసుకోవడంతో రూప క్లీన్ చేస్తానని చెప్పి బంటీకి తినమని చెప్పి వెళ్తుంది.


దాంతో జీవన్, దీపక్‌లు ఒంటరిగా ఉన్న బంటీని తీసుకెళ్లిపోతారు. దూరం నుంచి దీపు బంటీని ఎవరో తీసుకెళ్లడం చూసి రూపతో చెప్తాడు. రూప షాక్ అయిపోతుంది. రూప, దీపు ఇద్దరూ కారు వెనక పరుగులు తీస్తారు. ఇక రూప దీపుని స్కూల్‌లోకి వెళ్లమని బంటీని తీసుకొస్తా అని కారు వెనక పరుగులు తీస్తుంది. బంటి అరిచి ఫ్రెండ్ అని గట్టిగా పిలుస్తాడు. మరోవైపు రాజు కూడా అటుగా వస్తుంటాడు. కారులో నుంచి బంటీ రాజుని చూసి నాన్న నాన్న అని అరుస్తాడు. అయనా రాజు పట్టించుకోడు. రూపని కూడా చూడదు. బంటీ దీపక్‌ వాళ్లని కరిచేసి కారు నుంచి దూకేస్తాడు. బంటీ కింద పడిపోతాడు. బంటీ తల నుంచి రక్తం రావడం కళ్లు తిరిగి పడిపోవడంతో రూప ఏడుస్తుంది. ఇక విజయాంబిక బంటి వెంట్రుకలు తీసుకుంటుంది. దీపక్‌ని బంటీ గట్టిగా కరిచేస్తాడు. రాజు బంటీ బాక్స్ వాచ్మెన్‌కి ఇచ్చేసి వెళ్లిపోతాడు. ఇక రూప బాబుని తీసుకొని హాస్పిటల్‌కి వెళ్తుంది. డాక్టర్ రూపని చూసి సీఎం కూతురు అని అనుకొని రూప దగ్గరకు వెళ్తాడు. యాక్సిడెంట్ అయిందని చెప్పగానే డాక్టర్ పోలీస్ కేసు అవ్వాలని చెప్తాడు.


దాంతో రూప ముందు ట్రీట్మెంట్ చేయండి ఏమైనా అయితే మా నాన్న చూసుకుంటారని చెప్తుంది. డాక్టర్ ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. విజయాంబి వాళ్లు కూడా అక్కడికే వస్తారు. బంటీకి గాయం అవ్వడంతో తన ప్రాణం పోతుందని బంటీకి ఏం కాకూడని మొక్కుకుంటుంది. బంటీ కోలుకుంటే వాళ్ల నాన్నకి కాల్ చేసి చెప్పాలి అనుకుంటుంది. డాక్టర్ వచ్చి బ్లడ్ ఎక్కువ పోయిందని బీ నెగిటివ్ బ్లడ్ కావాలి అంటే రూప కంగారు పడుతుంది. డాక్టర్‌కి ట్రై చేయమని తాను కూడా తీసుకొస్తానని అంటుంది. రాజుకి కాల్ చేస్తుంది. రాజు ఫోన్ లిఫ్ట్ చేస్తాడు. ఏం మాట్లాడడు కానీ రూప ఒక బాబుకి యాక్సిడెంట్ అయిందని నీది సేమ్ బ్లడ్ గ్రూప్ కదా వెంటనే రా అని చెప్తుంది. రాజుఫోన్ కట్ చేసి బయల్దేరుతాడు. రాజుకి మానవత్వం లేదని రూప అనుకుంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: యుద్ధానికి సిద్ధంగా ఉండమని తాతకి కార్తీక్ వార్నింగ్.. జ్యోత్స్న చేసిన పెంటకి రచ్చే ఇక!