Ammayi garu Serial Today Episode బంటీని సూర్యప్రతాప్ దగ్గరకు తీసుకెళ్తే మందారం, రాఘవల్ని చంపేస్తామని జీవన్ రాజుకి కాల్ చేస్తాడు. వాడు ఎవరో తెలుసుకోవాలి మందారాన్ని కాపాడుకోవాలి అని వెళ్దాం పద అని రూప అంటే దానికి రాజు తొందర పడొద్దని మందారాన్ని అడ్డు పెట్టుకొని మనల్ని బెదిరించాడు అంటే మనం అంటే గిట్టని వాళ్లే అని అర్థమని అంటాడు. దాంతో రూప వీడియో కాల్ చేయమంటే రాజు చేస్తాడు. దాంతో జీవన్ కాల్ లిఫ్ట్ చేయడు. 


రూప: వీడు ఎవడో కానీ ఆ రోజు మందారాన్ని చంపాలని చూసింది వీడే అయింటాడు రాజు వీడిని ఊరికే వదలకూడదు.
రాజు: ముందు నుంచి మందారాన్ని చంపాలని చూస్తుంది దీపక్, విజయాంబికలు మాత్రమే అమ్మాయిగారు. ఇంకెవరికీ ఆ అవసరం లేదు.
రూప: అవును రాజు ఈ రోజు కూడా అత్తయ్యా దీపక్‌లు జీవన్‌ని కలిశారు. వాళ్లిద్దరికీ బంటీ మన బిడ్డే అని తెలుసు. నాకు తెలిసి బంటిని కిడ్నాప్ చేసింది కూడా వాళ్లే అని అనిపిస్తుంది. లేకపోతే బంటీ నా కొడుకు అని తెలిసి వాళ్లు మనల్ని ఇంట్లో అడుగుపెట్టకుండా ఆపుతారా రాజు.  
రాజు: మనం అనుమానాలన్నీ నిజం కావొచ్చు కానీ నిజం తొందరపడి చెప్పొద్దు. ఇన్నాళ్లు బంటీ లేరని అనుకున్నారు అలాగే ఉండండి. నేను మందారం కోసం వెతుకుతాను. మందారం దొరికితే రాఘవ దొరుకుతాడు. దాంతో అమ్మగారు, అయ్యగారు కలుస్తారు. 
బంటీ: ఎవరు నాన్న వాళ్లు.
రూప: దీపు వాళ్ల అమ్మే మందారం బంటీ. 


రాజు బంటీని తీసుకొని వెళ్లిపోతాడు. పెద్ద గండం తప్పిందని విజయాంబిక, దీపక్‌లు రిలాక్స్ అవుతారు. మనం చెప్పిన అబద్ధం నేను నిజం చేస్తానని జీవన్ అంటాడు. ఇక ఈ సారి బంటీ దొరికితే దొరికిన చోటే చంపేయమని విజయాంబిక అంటుంది. మీ మామయ్యకి నిజం తెలిసి మనల్ని బయటకు గెంటేయడం కంటే ముందు మనం బయటకు వెళ్లిపోవాలని నీకు ఫారెన్ సంబంధం చూస్తాను చక్కగా ఫారన్ చెక్కేద్దామని అంటుంది. రూప మందారం ఫొటో దగ్గరకు వెళ్లి దండ తీసేస్తుంది. ఇక విజయాంబిక సూర్యప్రతాప్‌తో దీపక్‌కి పెళ్లి చేయాలని అనుకుంటున్నానని అంటుంది. దీపు కూడా తనకు రూపే తల్లిగా కావాలని అంటాడు. దానికి విజయాంబిక రూప, రాజులు కలుస్తున్నారని ఏదో ఒక రోజు కలిసిపోతారని అప్పుడు దీపు అనాథ అయిపోతాడని లేదంటే రూప ఇలా ఎన్నాళ్లు ఒంటరిగా ఉంటుంది మరో పెళ్లి చేస్తే అప్పుడైనా దీపు ఒంటరిగా మిగిలిపోతాడని అంటుంది. రూప వద్దని అంటే అయితే నువ్వే దీపక్‌ని పెళ్లి చేసుకో అని అంటుంది. సూర్య కూడా ఓకే చెప్పేస్తాడు. మంచి సంబంధం చూడమని చెప్తాడు. 


మరోవైపు బంటీ కిడ్నాప్ అయ్యాడని అందరూ బాధ పడుతుంటారు. ముత్యాలు ఏడుస్తుంది. ఇంతలో రాజు బంటీని తీసుకొని వస్తాడు. బంటీని చూసి అందరూ చాలా సంతోషపడతారు. రూప గురించి విరూపాక్షి అడుగుతుంది. రాజు అమ్మాయిగారు ఇంటికి వెళ్లిందని చెప్తాడు. ఇక రాజు మందారం బతికే ఉందన్న విషయం ఇంట్లో వాళ్లకి చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. మందారం, రాఘవ ఇద్దరూ కనిపించారని చెప్తాడు. మందారం చితికి నువ్వే కదా నిప్పు పెట్టావ్ అంటే నిజమే కానీ నేను కళ్లారా చూశామని అంటాడు. బంటీని తీసుకొని పెద్దయ్యగారి దగ్గరకు వెళ్తే మందారాన్ని చంపేస్తామని బెదిరించారని చెప్తాడు. ఇక రూప రాజుకి కాల్ చేసి దీపక్‌కి పెళ్లి చేయాలనుకున్న విషయం చెప్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కూతురి పరిస్థితికి కుమిలి కుమిలి ఏడుస్తున్న దీప.. జ్యోత్స్న బుద్ధి ఇంత దారుణమా!