Ammayi garu Serial Today Episode రూపని రాజు దగ్గరకు తీసుకుంటాడు. రూప, రాజు, బంటీ ముగ్గురూ హగ్ చేసుకుంటారు. రాజు, రూపలు ఇంత దూరంగా ఉంటానికి ఈ అనార్థం మొత్తానికి విజయాంబిక, దీపక్‌లే కారణం అని విరూపాక్షి అంటుంది. అప్పలనాయుడు సూర్యప్రతాప్‌తో విషయం చెప్దామని అంటారు. ఇప్పుడే వెళ్లి చెప్దామని రూప అంటుంది. ఇక రూప తన బిడ్డని కంటికి రెప్పలా చూసుకున్నందుకు, తన బిడ్డని తనకు అప్పగించినందుకు పింకీకి కూడా థ్యాంక్స్ చెప్తుంది. బంటీ కూడా పిన్నికి థ్యాంక్స్ చెప్తాడు. రూప, రాజుల సమక్షంలో బంటీ పుట్టిన రోజు వేడుకలు ఘనంగా జరుగుతాయి. అందరూ హ్యాపీగా ఉంటారు.
బంటీ కేక్ కట్ చేసి అందరికీ కేక్ తినిపిస్తాడు. ఇక విరూపాక్షికి అమ్మగారు అంటే అమ్మగారు కాదు అమ్మమ్మని అని చెప్తుంది. తర్వాత రూప బంటీని ఇంటికి తీసుకెళ్లి నాన్నతో విషయం చెప్పాలని అందరూ బయల్దేరుతారు. జీవన్ వాళ్లు బంటీని కిడ్నాప్ చేసి తీసుకెళ్లిపోతారు. అందరూ ఆ కారు వెనక పరుగులు తీస్తారు. రాజు బండి తీసుకొస్తాడు. రూప, రాజులు బైక్‌లో బయల్దేరుతారు. ఇక విజయాంబిక, దీపక్‌లతో రూపకి బంటీనే తన కొడుకు అని తెలిసిపోయింది కాబట్టి బంటీని ఎలా అయినా చంపేయాలి అని ఫాలో అవుతారు. రౌడీలు బంటీని తీసుకొని ఎవరూ లేని ప్రాంతానికి పరుగులు తీస్తారు. వాళ్ల వెనకాలే రూప, రాజులు పరుగులు తీస్తారు.
ఆ వెనక విజయాంబిక, దీపక్‌లు పరుగులు తీస్తారు. అదే అడవిలో ఓ గుడెసెలో రాఘవ మందారానికి ట్రీట్మెంట్ చేయిస్తుంటాడు. రాజు అనుకోకుండా చూసి ఎవరా అని దగ్గరకు వెళ్లి చూస్తాడు. మందారాన్ని చూసి రాజు షాక్ అయిపోతాడు. తన చేతుల్లో చనిపోయిన మందారం శవాన్ని రూప ఇంటికి తీసుకెళ్లి రచ్చ చేసిన రాఘవ అది మందారమేనా కాదా అని కళ్లు తుడుచుకొని మరీ నిర్ధారించుకుంటాడు. అక్కడే రాఘవని కూడా చూస్తాడు. చాలా హ్యాపీగా ఫీలవుతాడు. ఇక రూప బంటీ కోసం రౌడీలతో గొడవ పడటం చూసి వెళ్లి వాళ్లని చితక్కొట్టి బంటీని కాపాడుతాడు. రూప బంటీని ముద్దాడుతుంది.
ఇక రాజు రూపతో మందారాన్ని చూశానని చెప్తాడు. మందారానికి ఆయుర్వేద వైద్యం చేస్తున్నారని పక్కనే రాఘవ కూడా ఉన్నాడని చెప్తాడు. రూప చాలా హ్యాపీగా ఫీలవుతుంది. మందారాన్ని చంపాలి అనుకున్నది ఎవరో తెలుసుకొని వాళ్ల అంతు చూద్దామని రూప, రాజులు పరుగులు తీస్తారు. మరోవైపు రాఘవ అటుగా పరుగెడుతున్న విజయాంబిక, దీపక్‌లను చూసి మందారాన్ని తీసుకెళ్లిపోవాలని ప్రయత్నిస్తాడు. రూప, రాజులు వెళ్లే సరికి వాళ్లు అక్కడ ఉండరు. ఇక రూప బంటీ విషయంతో పాటు మందారం విషయం తండ్రికి చెప్తే తండ్రినే చూసుకుంటాడని అంటుంది. ఆ మాటలు విన్న విజయాంబిక, దీపక్‌లు షాక్ అయిపోతారు. రూప, రాజులు వెళ్లకుండా ఆపాలని అనుకుంటారు. ఎలా తప్పించుకోవాలా అని ఆలోచిస్తారు.
ఇక రూప, రాజు, బంటీ ఇంటికి వస్తారు. వాళ్లని దీపక్ వాళ్లు ఫాలో అవుతారు. రాజు వాళ్లు ఇంట్లోకి వెళ్లే టైంకి జీవన్ కొత్త నెంబరుతో రాజుకి కాల్ చేస్తాడు. మీరు బంటీని తీసుకొని ఇంట్లోకి వెళ్తే మందారం, రాఘవని చంపేస్తానని అంటాడు. దాంతో రాజు భయపడతాడు. రూపకి విషయం చెప్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.