Ammayi garu Serial Today Episode మందారం, రాఘవని విజయాంబిక వాళ్లు ఫాలో అవుతారు. ఇక రాజు రూపని వెళ్లిపోమని చెప్తే రూప వెళ్లను అని వాళ్ల తల్లిదండ్రులకు అప్పగిస్తానని చెప్తుంది. ఇక నర్స్ వచ్చి మందులు తీసుకురమ్మని చెప్తే రూప వెళ్తానని రాజుని బంటీ దగ్గరకు వెళ్లమని చెప్తుంది.
రాజు: మనసులో ఇప్పుడు ఈ బిడ్డ మీద మీరు చూపిస్తున్న ప్రేమ అప్పుడు మన బిడ్డ మీద చూపించి ఉంటే ఈ రోజు మనం ఇలా విడిపోయే వాళ్లం కాదు.
రూప: (మందారాన్ని రూప వెనకనుంచే తీసుకెళ్తుంటే రూప చూసేస్తుందేమో అని విజయాంబిక రూప అని పిలిచి రూపని డైవర్ట్ చేస్తుంది) ఏమైంది అత్త అంత కంగారు పడుతున్నారు.
విజయాంబిక: కంగారేమి లేదు రూప బంటీ ఎప్పుడు లేస్తాడని చూస్తున్నాం. మనసులో మందారం అయితే తప్పించుకుంది కానీ రూపకి రాజు బిడ్డ బంటీ అని తెలీకుండా జాగ్రత్త పడాలి. రూప వెళ్దామా.
రూప: మెడిసిన్ ఇవ్వాలి.
దీపక్: మందారం తప్పించుకుంది మమ్మీ.
విజయాంబిక: సరేలే ముందు రూపని తీసుకొద్దాం పద.
రూప: రాజు డాక్టర్ ఏమైనా చెప్పారా.
రాజు: బాబుకి ఏ ప్రమాదం లేదని చెప్పారు. ఇక మీరు వెళ్లండి బాబు లేవగానే నేను తీసుకెళ్లి వాళ్ల ఇంట్లో అప్పగిస్తా.
దీపక్: ప్రస్తుతానికి మాత్రమే బాబుకి ప్రమాదం లేదు రాజు కానీ భవిష్యత్‌లో ఏ ప్రమాదం అయినా జరగొచ్చు.
విజయాంబిక: అమ్మా రూప బాబుకి ఏ ప్రమాదం లేదని చెప్పారు కదా మీ నాన్న ఎదురు చూస్తుంటారు పద.
రూప: ఎమోషనల్‌గా నీకేం కాదని నాకు తెలుసు బంటీ నిన్ను కాపాడింది నేను కాదు ఇదిగో ఈ రాజు. నువ్వు కళ్లు తెరవక ముందే నేను వెళ్లిపోతున్నా సారీ బంటీ మళ్లీ కలుస్తాను. అని నుదిటి మీద ముద్దు పెడుతుంది. సరే రాజు
విజయాంబిక: రూప పద వెళ్దాం.
బంటీ ఫ్రెండూ ఫ్రెండూ నాన్న నాన్న అని కలవరిస్తాడు. రూప వాళ్లు వినేస్తారేమో అని రాజు కంగారు పడతాడు. డోర్ దగ్గరకు వేసి కళ్లు తెరిచిన బంటీతో నీకేం కాదు బంటీ అంటాడు. బంటీ రాజుతో నాన్న నా ఫ్రెండ్ ఎక్కడా అని అడుగుతాడు. ఇప్పుడే మీ ఫ్రెండ్ వెళ్లారని బంటీ చెప్తాడు. డాక్టర్ రాజుకి జాగ్రత్తలు చెప్పి బంటీని ఇంటికి తీసుకెళ్లమని చెప్తాడు.
రాజు: బంటీ అసలు యాక్సిడెంట్ ఎలా అయింది.
బంటీ: యాక్సిడెంట్ కాదు నాన్న ఎవరో నన్ను కిడ్నాప్ చేశారు. వాళ్ల నుంచి తప్పించుకునే ప్రయత్నంలో దూకేశాను. సమయానికి ఫ్రెండ్ రావడంతో తప్పించుకున్నాను. లేదంటే ఏమై ఉండేదో.
రాజు: బంటీ నీకు ఏం కానివ్వను వాళ్లని వదలను. నా కొడుకు జోలికి వచ్చారు అంటే నా జోలికి వచ్చినట్లే వాళ్లు ఎవరో తెలిస్తే అడ్డంగా నరికేస్తా. బిల్ కడుతూ శాలరీ వచ్చింది కొంత అయినా మన సమస్యలు తీరుతాయని అనుకున్నా నీకు నచ్చింది కొనొచ్చు అనుకున్నా కానీ నీ కోసం ఇలా ఖర్చు పెడుతున్నా పర్లేదులే ఇది కూడా నీ కోసమే కదా.
నర్స్: సారీ ఈ పేషెంట్ మీద ఇప్పటికే బిల్ కట్టేశారు సార్. ఈ బాబుని జాయిన్ చేసిన మేడమే కట్టేశారు సార్.
బంటీ హాస్పిటల్లో దేవుడికి దండం పెట్టుకుంటాడు. తల్లి ఎవరో తెలీకపోయినా నా ఫ్రెండ్ నాకు ప్రాణం పోసి పునర్జన్మ ఇచ్చిందని మొక్కుకుంటాడు. రాజు మనసులో బంటీ ప్రాణం తీయాలి అనుకున్నప్పుడు రాక్షసిలా కనిపించింది అదే బంటీకి ఇప్పుడు ప్రాణం పోసి దేవతలా కనిపించిందని ఎప్పుడూ తనే బంటీకి తల్లి అని తెలీకూడదని మొక్కుంటాడు. సూర్యప్రతాప్ చంద్ర ఇద్దరూ పేదల ఇళ్ల గురించి మాట్లాడుకుంటారు. ఇంతలో దీపు వస్తాడు. అందరికీ విష్ చేస్తాడు. పంకీ దీపుకి ఎదురై మమ్మీ ఎక్కడ అని అడిగితే మమ్మీ రాలేదు డ్రైవర్ వచ్చారని చెప్తాడు. సూర్య వాళ్లు రూప ఎక్కడికి వెళ్లిందని అనుకుంటారు. చంద్ర రూపకి కాల్ చేసే టైంకి రూప వచ్చేస్తుంది. బంటీని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తుంది. ఇక రాజు బంటీని ఇంటికి తీసుకెళ్తాడు.
బంటీని అందరూ అలా ఒంటి నిండా గాయాలతో చూసి చాలా కంగారు పడిపోతారు. దాంతో రాజు కిడ్నాప్ అంటే భయపడతారు అని యాక్సిడెంట్ అని రాజు చెప్తాడు. దాంతో బంటీ అబద్ధం అని తనని ఎవరో కిడ్నాప్ చేశారని చెప్తాడు. అందరూ షాక్ అయిపోతారు. విరూపాక్షి, ముత్యాలు ఏడుస్తారు. ఇక రూప అందరికీ బంటీకి ఏం కాలేదని చెప్పడంతో ఊపిరి పీల్చుకుంటారు. కిడ్నాపర్లు తప్పించుకున్నారని రూప చెప్తుంది. కిడ్నాపర్లను వదల కూడదని వాళ్లు ఎవరో ఎంక్వైరీ చేసి జైలులో పెడతానని సూర్య ప్రతాప్ అంటాడు. రాజు ఇంట్లో అందరూ ఇకపై జాగ్రత్తగా ఉండాలి అనుకుంటారు. ఇక దీపక్‌ని చేతి గాయం చూసి ఏమైందని సూర్య అడిగితే కుక్క కరిచేసిందని చెప్తారు. ఇంతలో పింకీ లవర్ గోపి ఇంటికి వస్తాడు. పింకీ గోపిని చూసి ఎమోషనల్ అయి దగ్గరకు వెళ్తుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: కార్తీక్, దీపల ధర్నా - జ్యోత్స్న మీద తాత సీరియస్.. తల వంచిన దశరథ్!