Ammayi garu Serial Today February 15th: అమ్మాయి గారు సీరియల్: రూప గదిలో రాజుని సూర్యకి పట్టించిన విజయాంబిక.. చివరి నిమిషంలో ట్విస్ట్!

Ammayi garu Today Episode రూపని కలవడానికి రాజు ఇంటికి వచ్చాడని విజయాంబిక సూర్యప్రతాప్‌కి చెప్పడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.

Continues below advertisement

Ammayi garu Serial Today Episode రూప తినకపోవడంతో సుమ రాజుకి కాల్ చేసి రూప భోజనం చేయడం లేదని మందారం కోసం తెచ్చిన మూలికలు పని చేయలేదని బాధ పడుతుందని చెప్తుంది. రాజు సుమతో పింకీని మీకు ఇష్టం లేని పెళ్లి చేసినందుకు నా మీద కోపంగా ఉందా అని అడుగుతాడు. నా బిడ్డ సంతోషం కంటే మాకు ఇంకేం అవసరం లేదని చెప్తుంది. 

Continues below advertisement

రాజు: పింకీ ఎలా ఉందని కూడా అడగరా అమ్మగారు.
సుమ: పింకీ మా ఇంట్లో ఉన్నప్పుడు ఎలా చూసుకున్నావో తెలిసిన దాన్ని ఇప్పుడు ఎలా ఉందని ఎందుకు అడుగుతాను. పింకీ గురించి వదిలేసి మీ అమ్మాయిగారి గురించి ఆలోచించు. 
రాజు: ఫోన్‌లో కాదమ్మగారు నేను వస్తా. 
సుమ: వద్దు రాజు బావగారు ఉన్నారు కదా.
రాజు: అది నేను చూసుకుంటానమ్మ. 
సుమ: రాజుకి కాల్ చేసి తప్పు చేశానా. రాజు వస్తే బావగారికి తెలిస్తే ఇంకేమైనా ఉందా. 

సుమ ఫుడ్ తీసుకెళ్లి రూప గదిలో పెడుతుంది. విజయాంబిక వాళ్లు చూసి మనం ఇచ్చిన ట్విస్ట్‌కి రూపకి తల నొప్పి వచ్చినట్లుందని దీపక్‌తో చెప్తుంది. రాజు సీఎం ఇంటికి వస్తాడు. రూప గదికి వెళ్తాడు.రూప రాజుని చూసి షాక్ అయిపోతుంది. సుమనే విషయం చెప్పిందని రాజు అంటాడు. రాజుని వెళ్లిపోమని రూప చెప్తుంది. ఇక సుమ భోజనం ప్లేట్ రాజు చేతిలో పెట్టి వెళ్లిపోతుంది. రాజు రూపకి తినిపిస్తాడు. సుమ సంతోషంగా ఉండటం చూసిన విజయాంబికకు అనుమానం వస్తుంది. దీపక్‌ని తీసుకొని రూప గది వైపు వెళ్తుంది. రాజు రూపకి తినిపించడం చూసి తల్లీకొడుకులు షాక్ అవుతారు. రాజుని, రూపని సూర్యప్రతాప్‌కి పట్టించాలని రాజు వచ్చిన వెనక వైపు కిటికీ గడియ పెట్టేస్తాడు. తర్వాత సూర్యప్రతాప్ దగ్గరకు వెళ్లి రూప దగ్గరకు రాజు వచ్చాడని చెప్తుంది. అందరినీ తీసుకొని రూప గది దగ్గరకు వెళ్తుంది. 

విజయాంబిక డోర్ కొడుతుంది. రూప చాలా టెన్షన్ పడుతుంది. రాజుని వెళ్లిపోమని చెప్తే కిటికీ లాక్ చేసి ఉంటుంది. దాంతో రూప రాజుని సోఫా వెనక దాస్తుంది. ఇంతలో సుమ ఇంటి మెయిన్ ఆపేస్తుంది. దాంతో రాజు మెయిన్ డోర్ నుంచి వెళ్లిపోతాడు. తర్వాత సుమ మెయిన్ ఆన్ చేస్తుంది. రాజు ఎక్కడ అని సూర్యప్రతాప్ విజయాంబికను అడుగుతాడు. రాజు కచ్చితంగా వచ్చాడని ఎక్కడో ఓ చోట దాక్కొని ఉంటాడని అంటుంది. ఇది సీఎం ఇళ్లు సెక్యూరిటీ, సీసీ కెమెరాలను దాటుకొని ఎవరూ రారు అని సూర్యప్రతాప్ చెప్పడంతో విజయాంబిక రూప తిన్న అన్నం ప్లేట్ చూపించి రూప అన్నం తిన్నది కానీ చేతిలో ఒక్క మెతుకు కూడా లేదని అసలు చేతితో తిన్నట్లే లేదని అంటుంది.

దాంతో నీ చేతికి ఎంగిలి లేదని ప్రశ్నిస్తాడు. దాంతో రూప మీరు పిలవడంతో చేయి కడుక్కొని వచ్చానని అందుకే తలుపు తీయడానికి టైం పట్టిందని అంటుంది. సూర్యప్రతాప్ విజయాంబికలతో మీరు అస్తమానం రాజు గురించి ఆలోచించడం వల్ల ఇలా భ్రమ పడ్డారని ఆ ఆలోచనలు వద్దని అంటాడు. ఇక టైంకి పవర్ ఆపినందుకు రూప సుమకి థ్యాంక్స్ చెప్తుంది. రూప రాజుకి కాల్ చేసి ఇక ఏ ప్రాబ్లమ్ లేదని రేపు గుడిలో కలుద్దామని చెప్తుంది. ఉదయం స్వామీజీ మృత్యుంజయ హోమం ఏర్పాట్లు చేస్తారు. విరూపాక్షి, రాజులు స్వామీజీని కలుస్తారు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న.. వారసురాలి గురించి తెలుసుకున్న దశరథ్!

Continues below advertisement