Karthika Deepam Idi Nava Vasantham Serial Today Episode మీ కొడుకు ఎక్కడ.. లండన్ వెళ్లిపోయాడా అని కార్తీక్ ఎదురుగానే శ్రీధర్‌ని అతని స్నేహితుడు గంగాధర్ అడుగుతాడు. ఇంతలో దీప కార్తీక్ బాబు అని పిలుస్తూ వస్తుంది. అది విన్న గంగాధర్ క్యాటరింగ్ బాయ్‌ది నీ కొడుకుది ఒకే పేరు అంటాడు. దానిని పారిజాతం ఈ కార్తీకే శ్రీధర్ కొడుకు అని అంటుంది. ఫ్రెండ్ దగ్గర కొడుకు గురించి గొప్పలకు పోయిన శ్రీధర్‌ని గంగాధర్ ఈ అబ్బాయి నీ కొడుకా అని అడగటంతో తల దించుకుంటాడు.
శ్రీధర్: నా పరువు తీయడానికి వీడే నా కొడుకు.
గంగాధర్: ఏం బాబు ఉదయం ఇంటికి వచ్చినప్పుడు మీరు శివన్నారాయణ కొడుకు అని చెప్పలేదు.
శ్రీధర్: తమరు ఇక్కడికి వస్తారని తెలిస్తే నేను రాకపోయే వాడిని.
కార్తీక్: మీరు తినడానికి వచ్చారు నేను వడ్డించడానికి వచ్చాను ఎవరి పని వారిది.
గంగాధర్: మీరు కోటీశ్వరుడు కదా మీకు ఏంటి అవసరం బాబు.
జ్యోత్స్న: గ్రహణం పడితే ఇంతే అంకుల్. ఇందాక మీరు అన్నారు కదా మీ కొడుకు మరదల్ని కాదని ఎవర్నో పెళ్లి చేసుకున్నాడని ఇదిగో ఈ వంటలక్కనే మా బావ పెళ్లి చేసుకున్నాడు. అమెను అనుసరిస్తూ క్యాటరింగ్ బాయ్‌లా మారాడు.
శ్రీధర్: అంత వరకు వీళ్లు మా పరువు తీస్తారు.
దీప: క్షమించండి మీరు వస్తారని మాకు తెలీదు.
శ్రీధర్ రెండు పెళ్లిళ్లు గురించి గంగాధర్‌కి పారిజాతం చెప్తుంది. నలుగురు ఆయన ముందే మాటల యుద్ధం చేసుకుంటారు. దీప వల్లే దిగజారిపోయావ్ అని జ్యోత్స్న కార్తీక్‌ని అంటుంది. దాంతో కార్తీక్ జ్యోత్స్నని దీపని ఏం అంటే ఊరుకోనని అంటాడు. దాంతో శ్రీధర్ జ్యోత్స్న అడిగిన దాంట్లో తప్పేంటని అంటే దానికి కార్తీక్ మీరు ఊరుకోండి మాస్టారు నలుగురిలో ఉన్నామా అందరిలో ఉన్నామా అని ఆలోచించకుండా మాట అనే అవకాశం వస్తే అనేస్తావ్ అని గొడవ పడతాడు. ఇంతలో గంగాధర్ భార్య వచ్చి అమ్మా దీప వంటలన్నీ సూపర్ అని అంటుంది. దీప కార్తీక్ చాలా సంతోషిస్తారు. ఇక కార్తీక్ గంగాధర్‌తో కోటీశ్వరిడి కొడుకు కోట్లలోనే ఉండాల్సిన అవసరం లేదని తన సొంత కాళ్ల మీద నిలబడటానికి కింద నుంచి రావొచ్చని అంటాడు. ఇక కార్తీక్ డబ్బు లిస్తే వెళ్తానని చెప్తాడు. ఇక గంగాధర్ దీప, కార్తీక్‌ల జంటని పొగుడుతాడు. తర్వాత ఇద్దరూ వెళ్లిపోతారు. తర్వాత శ్రీధర్, పారిజాతం వాళ్లు వెళ్లిపోతారు.
డాక్టర్ దాసుని చూస్తాడు. కాశీ తండ్రి గురించి చెప్తాడు. ఒకసారి లేస్తే రెండు రకాలుగా ప్రవర్తిస్తున్నాడని చెప్తాడు. దాంతో డాక్టర్ మందులు పని చేస్తున్నాయని త్వరలోనే లేస్తారని చెప్తాడు. మరోవైపు జ్యోత్స్న కార్తీక్ గురించి ఆలోచిస్తుంటుంది. పారిజాతం వస్తుంది. కార్తీక్ ఎంతకీ నీ వైపు రాడని దీప కూడా కార్తీక్‌ని వదలదని వేరే పెళ్లి చేసుకో అని జ్యోత్స్నకి చెప్తుంది. జ్యోత్స్న నానమ్మ మీద అరుస్తుంది. దాంతో పారిజాతం ఈ లోపు నువ్వు వారసురాలివి కాదని తెలిస్తే ఇక అంతే అంటుంది. ఆ విషయం ఎవరు చెప్తారని జ్యో అంటే దాసు చెప్పేస్తే అని పారిజాతం అంటుంది. దాంతో జ్యోత్స్న అందుకే వాడికి ఆ గతి పట్టించా అనేస్తుంది. పారిజాతం షాక్ అయిపోతుంది. జ్యోత్స్న ఇలా అనేశానేంటి అనుకుంటుంది. దాసుని నువ్వే కొట్టావా అని అడుగుతుంది. దాంతో జ్యోత్స్న కవర్ చేస్తుంది.
కార్తీక్ వాళ్లు ఇంటికి వచ్చి వంటలన్నీ బాగున్నాయని అన్నారు శ్రీధర్ వాళ్లు చేసిన గొడవ గురించి చెప్తారు. కార్తీక్ ఆవేశ పడతాడు. దీప కూల్ చేస్తుంది. పట్టించుకోకూడదని అంటుంది. మీ గెలుపే అందరికి చెంప దెబ్బ అని దీప అంటే నువ్వు గెలవాలి నువ్వు గెలిస్తే మేం అంతా గెలిచినట్లే అని కాంచన అంటుంది. కార్తీక్ బాబుని గెలిపించడం నా బాధ్యత అని దీప అనుకుంటుంది. కార్తీక్ బాబుకి నచ్చకపోయినా నేను ఓ నిర్ణయం తీసుకున్నానని అదే చేస్తానని దీప అనుకుంటుంది. ఇక డాక్టర్ దశరథ్‌కి కాల్ చేసి దాసు తొందరలోనే రికవరీ అవుతారని చెప్పడంతో దశరథ్ చాలా సంతోషిస్తాడు. ఇక దాసు స్ఫ్రుహలోకి వచ్చినప్పుడు రాసిన రాతలు గురించి చెప్తాడు.
ఆ రాతల ఫొటో దశరథ్‌కి పెడతారు. అది చూసిన దశరథ్ నా కూతురు నాకు కొట్టిందని నాకు తెలుసు అనుకుంటాడు. ఇక వారసురాలు అని రాయడం చూసి వారసురాలు ఏంటి అనుకుంటాడు. దాసు ఏం చెప్పాలి అనుకుంటున్నాడు.. చూస్తుంటే ఇదేదో పెద్ద సమస్యలా ఉందని అనుకుంటాడు. ఉదయం జ్యోత్స్నకు అకౌంటెట్ కాల్ చేసి బిజినెస్ లాస్‌లో ఉంది కానీ మీరు లాభాలు చూపించమని చెప్తుంది. ఈ నిజం ఎవరికీ తెలీకూడదని అంటుంది. దాంతో దశరథ్ వచ్చి ఎన్ని నిజాలు దాస్తావు జ్యోత్స్న అని అరుస్తాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!