Ennallo Vechina Hrudayam Serial Today Episode బాల జాతకం స్వామీజీ చూస్తారు. బాల కోసం ఓ తాయెత్తు ఇస్తారు. అది కట్టుకోమని చెప్తే నాకు ఈ తాయెత్తు కట్టుకోవడానికి కరెక్ట్ ఆన్సర్ చెప్తేనే కట్టుకుంటా అంటాడు. దాంతో స్వామీజీ మీతో మాట్లాడాలి అని చెప్పి బాలని పక్కకు వెళ్లమంటారు. బాల గుడి లోపలే ఉంటానని చెప్ప వెళ్తాడు.
త్రిపుర, గిరిల పెళ్లికి పది రోజుల్లో అంటే 25 వ తేదీన పెళ్లి ముహూర్తం ఫిక్స్ చేస్తారు. ఇక బాల ఆంజనేయ స్వామి దగ్గరకు వెళ్లి నాకు ఎవరూ సమాధానం చెప్పడం లేదు నువ్వు చెప్పడం లేదు అని అంటాడు. ఇక త్రిపుర దండం పెట్టుకోవడానికి దేవుడి దగ్గరకు వెళ్తుంది. తల్లిని కాపాడుకోవడానికి ఇంత కంటే మంచి అవకాశం కనిపించలేదని అనుకుంటుంది. బాల దగ్గర్లో ఓ చిన్ని పిట్ట కింద పడిపోతుంది. దేవా చూసి పట్టుకుంటాడు. ఇంతలో త్రిపుర అక్కడి వస్తే సుందరి నువ్వా ఈ పక్షి పిల్లని మీద పెట్టి వస్తా అని చెప్పి చెట్టు ఎక్కి పక్షి గూడులో పిల్లని పెట్టి వస్తాడు. అప్పుడే బాల తాయెత్తు పడిపోతుంది.
ఇక రత్నమాల కొడుకుతో అమ్మవారికి ముడుపు కట్టమని చెప్తుంది. గిరి తన ఫ్రెండ్స్‌తో ముడుపు కట్టడానికి త్రిపురవాళ్లు ఉన్న వైపు వస్తాడు. ముడుపు కడతాడు. ఇక బాల త్రిపురతో నీకు డబ్బులు అవసరం ఉంది కదా అనంత్‌కి చెప్పాను నీకు సాయం చేస్తాడు నాతో రా అని త్రిపురని తీసుకెళ్లబోతే ఇప్పుడు మరి డబ్బు అవసరం లేదని త్రిపుర చెప్తుంది. దాంతో బాల నీ సమస్య తీరిపోయిందా పోనీలే అని అంటాడు. ఇక త్రిపుర బాలతో ఎలా వచ్చారు ఇక్కడికి అని అంటే జాతకం చెప్పించుకోవడానికి తన ఫ్యామిలీతో వచ్చానని స్వామీజీ దగ్గరకు వచ్చానని అంటాడు. ఇక స్వామీజీ తనకు అంతా మంచే జరుగుతుందని తాయెత్తు ఇచ్చారని అంతా మంచే జరుగుతుందని ఇచ్చారని నేను అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పలేదని కట్టుకోలేదని అంటాడు. చూస్తే జేబులో తాయెత్తు ఉండదు. దాంతో త్రిపుర ఆంజనేయ స్వామి దగ్గర ఉన్న రక్ష తాడు కడతాను అంటే ఎందుకు కట్టుకోవాలని బాల అడుగుతాడు. దాంతో త్రిపుర ఇది కట్టుకుంటే నెగిటివ్ ఎనర్జీ పోతుంది. మనకు మంచి జరుగుతుందని చెప్తే బాల ఆ తాడు త్రిపురకే కట్టమని అంటాడు. త్రిపుర ఆ తాడుని బాల చేతికి కడుతుంది.
బాల త్రిపురను ఒక్కదగ్గర చూసిన రమాప్రభ త్రిపురని పిలుస్తుంది. త్రిపుర వెళ్తుంది. ఇక బాల బామ్మకి సుందరిని చూపిస్తానని అనుకొని వెళ్తాడు. వెళ్లేసరికి పంతులు ఓ దంపతులని దీవిస్తాడు. కుంకుమ ఇవ్వడంతో భర్త తన భార్యకి కుంకుమ పెడతాడు. పంతులు వాళ్లని దీవిస్తాడు. దాంతో బాల పంతులకి ఎందుకు అలా దీవించారని అడిగితే మంచి జరగాలని దీవిస్తున్నానని అంటాడు. దాంతో బాల కుంకమ తీసుకొని సుందరిని పెడతా అప్పుడు పంతులు సుందరికి దీవిస్తారు. సుందరికి మంచి జరుగుతుందని అనుకొని కుంకుమ తీసుకొని వెళ్తాడు. అది గిరి చూసి బాల దగ్గరకు పరుగులు తీస్తాడు. బాలని గిరి నెట్టేయడంతో కుంకుమ ఎగిరి త్రిపుర నుదిటి బొట్టులా పడుతుంది. అది చూసిన గిరి బాలని చితక్కొడతాడు.
త్రిపుర వద్దని ఎంత చెప్పినా వినకుండా కొడతాడు. ఇంతలో రత్నామాల అక్కడికి వచ్చి బాలని కొట్టమని అంటుంది. బాలని గిరి చాలా గట్టిగా కొట్టేస్తాడు. ఇంతలో ఓ సీతాకోక చిలుక బాల మీద వాలడంతో బాల ఇరిటేట్ అయి ఎక్కడి లేని ఆవేశం వచ్చి గిరిని బాల కొడతాడు. గిరి స్నేహితులు ఎంత పట్టుకున్నా బాల రెట్టింపు పవర్‌తో చితక్కొడతాడు. ఓ వ్యక్తి అదంతా వీడియో తీస్తాడు. గిరిని గుర్తించిన బాల దొంగ దొంగ అని అరుస్తాడు. ఇంతలో రత్నమాల గిరిని, రమాదేవి త్రిపురని తీసుకెళ్లిపోతారు. బాల కళ్లు తిరిగి పడిపోతాడు. బాల తల్లి, తమ్ముడు, బామ్మ బాల కోసం వెతుకుతూ కిందపడిపోయిన బాలని చూసి కంగారు పడతారు. ఓ వ్యక్తి బాలకు మరో వ్యక్తికి గొడవ అయిందని చెప్తారు. ఇంటికి వెళ్లిన తర్వాత యశోద భర్తతో విషయం చెప్తుంది. ఇక బాల చేతికి ఉన్న తాడు చూసి ఏంటని అడిగితే సుందరి రక్ష తాడు కట్టిందని చెప్తాడు. సందరి బాల కల కాదు నిజంగా ఉందని అంటే నాగభూషణం వచ్చి వాడికి బుర్రపోతే మీకు పోయిందా అని అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: కార్తీకదీపం 2 సీరియల్: తండ్రీ, మరదలు వచ్చిన ఫంక్షన్‌లోనే పనోడిగా కార్తీక్.. పరువు పాయే!!