Brahmamudi Serial Today Episode:  స్టేషన్‌ లో లీవ్‌ తీసుకుని నందను కలవడానికి వెళ్తున్న ఎస్సై విశ్వాన్ని ఫాలో అవుతుంది అప్పు. ఇంతలో కావ్య ఫోన్‌ చేసి ఏమైందని అడుగుతుంది. ఇంకా ఫాలో అవుతున్నానని.. ఎలాగైనా ఇవాళ పట్టుకుంటానని చెప్తుంది. ఇంతలో రాజ్‌ వచ్చి ఎమోషనల్‌ అవుతాడు. ఆ నంద గాడు దొరికితే చంపేయాలన్నంత కోపం వస్తుంది అంటాడు. తర్వాత ఇద్దరూ లోపలికి వెళ్తారు. సీతారామయ్య బాధపడుతుంటాడు.


సీతారామయ్య: బాధపడుతున్నావా చిట్టి


ఇందిర: లేదు బావ ఇచ్చిన మాట కోసం సరస్వం వదులుకోవడానికి సిద్ద పడ్డ నిన్ను చూస్తుంటే.. గర్వంగా ఉంది. నువ్వు ఎక్కడుంటే నేను అక్కడే ఉంటాను. నువ్వు ఎక్కడ ఉండమంటే నేను అక్కడే ఉంటాను.


అపర్ణ: చాలా మంది భార్యాభర్తలు దాంపత్యం అంటే ఏంటో మిమ్మల్ని చూసి నేర్చుకోవాలి.


రుద్రాణి: ( మెల్లగా) రాహుల్‌ మన నగలు అన్ని భద్రంగా దాచావా..?


రాహుల్‌: దాచాను మమ్మీ.. వీళ్లేం ఇన్‌కం టాక్స్‌ ఆఫీసర్లు కాదు. బ్యాంకు ఆఫీసర్లు ఇళ్లంతా ఏమీ చెక్‌ చేయరు.


స్వప్న  వాళ్ల మాటలు వింటుంది.


స్వప్న: అత్తా అందరూ నగలు తెచ్చారు నువ్వు నీ నగలు తీసుకురావా..?


రుద్రాణి: నాకు నగలు ఎక్కడివి ఒక్క పుస్తెలతాడు ఉండేది అది కూడా వీళ్ల నాన్నా ఎప్పుడో తాకట్టు పెట్టేశాడు


ధాన్యలక్ష్మీ:  ఎందుకు లేవు.. నీకు మామయ్యగారు చాలా నగలు చేయించారు అవన్నీ పట్టుకురాపో నా నగలు గురించి చెప్పావు కదా..? అందుకే చెల్లుకు చెల్లు..


రుద్రాణి: నా నగలు ఎందుకు ఇవ్వాలి. అసలు నేను దుగ్గిరాల ఇంటి ఆడపడచునే కాదు. నాకు ఈ ఇంటికి అసలు సంబంధమే లేదు.


అపర్ణ: కానీ చిన్నప్పటి నుంచి నువ్వు ఈ ఇంటిలోనే ఉన్నావు కదా..?  ఆస్థి పంపకాల దాకా వచ్చేసరికి ఈ ఇంటి ఆడపడుచునంటూ పోట్లాడావు. నగలు ఇవ్వాల్సి వస్తే అసలు సంబంధమే లేదంటావా..? స్వప్నకు ఉన్న విశ్వాసం నీకు లేదు


స్వప్న: వీళ్లకు విశ్వాసం ఎలా ఉంటుంది ఆంటీ.. అయినా రూంలో బెడ్‌ కింద దాచిన నగలు నేను తీసుకొస్తాను ఉండండి.


 అని చెప్పి స్వప్న పైకి వెళ్తుంది. మరోవైపు నంద ఉన్న ఇంటికి కనిపెడుతుంది అప్పు. లోపలికి వెళ్లిన విశ్వం, నందతో డబ్బులు తీసుకోవడం కానిస్టేబుల్‌ చేత వీడియో తీయిస్తుంది. తర్వాత లోపలికి వెళ్లి నందను, విశ్వాన్ని అదుపులోకి తీసుకుంటుంది. తప్పించుకోవాలని చూస్తే కాల్చి పారేస్తానని వార్నింగ్‌ ఇస్తుంది. ఇంతలో కానిస్టేబుల్స్‌ వచ్చి నందను పట్టుకుంటారు. మరోవైపు ఆస్తుల జప్తు పూర్తి అవుతుంది.


సీతారామయ్య: మీ లెక్కలకు ఇవి సరిపోయాయా సార్‌..


బ్యాంకు ఆఫీసరు: సరిపోయాయి సార్‌ కానీ మీరు ఎలా చెప్పాలో తెలియడం లేదు కానీ ఈరోజే మీరు ఇల్లు ఖాళీ చేయాలి.


రుద్రాణి: ఉన్నది పోయే ఉంచుకున్నది పోయే అన్నట్టు ఆస్థిలో వాటా కోసం అందరితో పోరాటం చేస్తే చివరికి ఉన్నదాంట్లో కూడా ఊడ్చుకుపోతున్నారు. దేవుడు నాలాంటి దానికే ఎందుకు పరీక్ష పెడతాడో నాకు అర్థమే కావడం లేదు


అంటూ బాధపడుతుంది. ఇంతలో బాండ్‌ పేపర్స్‌ మీద సంతకం చేయమని సీతారామయ్యకు ఇస్తారు ఆఫీసర్లు. సంతకం చేయడానికి సీతారామయ్య చేయి వణుకుతుంటే.. ఇందిరాదేవి చేయి పట్టుకుని సంతకం చేయించబోతుంది. ఇంతలో అప్పు, నందను తీసుకొచ్చి సీతారామయ్య కాళ్ల దగ్గర పడేస్తుంది. నందను చూసిన రాజ్‌, కావ్య ఆశ్చర్యపోతారు.


అప్పు: తాతయ్యగారు మీరు ఇంక సంతకం చేయాల్సిన పని లేదు.  ఆస్థులు బ్యాంకు వాళ్లకు స్వాధీనం చేయాల్సిన అవసరం లేదు. ఏంటలా చూస్తు్న్నారు. మీ బ్యాంకుకు వంద కోట్టు ఎగ్గొట్టిన నంద వీడే. వీళ్ల తాతయ్యకే మా తాతయ్య షూరిటీ ఇచ్చింది. ఇన్ని రోజులు చనిపోయినట్టు నాటకం ఆడి మా డిపార్ట్‌మెంట్‌ను మా కంపెనీని మోసం చేసింది వీడే. వీడి ఆస్థులు ఎక్కడికీ పోలేదు. మా ఆస్థులు మాకు అప్పజెప్పి మీరు వెళ్లండి.


అని చెప్పగానే బ్యాంకర్లు సారీ చెప్పి వెళ్లిపోతారు. వీడి వెనక ఆ అనామిక, సామంత్‌ ఉన్నారని అప్పు చెప్పగానే రాజ్ కోపంగా వాళ్లను ఊరికే వదలను అంటూ బయటకు వెళ్తాడు. వెనకే కావ్య పరుగెడుతుంది. ఇంతలో ఇవాళ్టీ ఏపిసోడ్‌ అయిపోతుంది.


 


ALSO READ:  మీరు కోటీశ్వరులు అయ్యే ముందు ఇలాంటి కలలే వస్తాయట!