Ammayi garu Serial Today Episode జీవన్ ఇంట్లో అందరినీ రెచ్చగొడతాడు. పింకీ మీద అరుస్తూ కాఫీ తీసుకురమ్మని చెప్తాడు. పింకీ భయపడుతూనే వెళ్తుంది. జీవన్ మనసులో ఈ టైంలో తన చెల్లి శ్వేత ఉండుంటే బాగుండేదని హారతి విషయం తెలిసినా ఇంట్లో అందరినీ అల్లాడిస్తున్నందుకు తను చాలా సంతోషించేదని అనుకుంటాడు. ఇంతలో శ్వేత వస్తుంది. జీవన్ సంతోషంగా తలచుకోగానే వచ్చావ్ శ్వేత అంటే దానికి రూప తలుచుకోగానే కాదు మేం పిలవడంతో వచ్చిందని అంటుంది. వీళ్లు నిన్ను పిలవడం ఏంటి అసలేం జరిగింది అని జీవన్ శ్వేతని అడిగితే పింకీ లవర్ గోపీ నేను చెప్తాను బావ అని ఎంట్రీ ఇస్తాడు.


జీవన్: బావ ఏంట్రా. ఎవడ్రా నీకు బావ. అయినా నేను నీకు బావ ఏంట్రా నేను నీకు అన్నని. నువ్వు ప్రేమించిన అమ్మాయి మెడలో తాళి కట్టిన దాని మొగుడిని. 
గోపీ: నేను ఇష్టపడిని పింకీ మెడలో తాళి కట్టి నువ్వు నన్ను పిచ్చోడిని చేశావ్. మరి ఆ పిచ్చి ఎలా ఉంటుందో నీకు తెలియాలి కదా బావ. నేను ఆల్రెడీ నీ చెల్లి మెడలో తాళి కట్టాను. అందరూ షాక్ అయిపోతారు. 
జీవన్: రేయ్ నా చెల్లి మెడలో నువ్వు తాళి కట్టడం ఏంట్రా.
గోపీ: నీ చెల్లి ఎదురుగానే ఉంది కదా బావ నా కాలర్ పట్టుకొనే బదులు తన మెడలో ఉన్న తాళి ఎవరు కట్టారో అడుగు.
జీవన్: శ్వేత నువ్వు మాట్లాడు.


నీకు అర్థమయ్యేలా నేను చెప్తా బావ అని శ్వేత మెడలో తాళి బయటకు తీసి చూపిస్తాడు. జీవన్ బిత్తర పోతాడు. అందరూ షాక్ అయిపోతుంది. రూప పింకీతో పింకీ జీవన్‌కి మెంటల్ ఎక్కినట్లుంది కాఫీ ఇవ్వు కూల్ అవుతాడు అంటుంది. ఇక జీవన్ శ్వేతని తీసుకొని గదిలోకి వెళ్లి శ్వేతని అడిగితే పింకీ విషయంలో నువ్వు అలా చేయడం వల్లే గోపీ నా మెడలో తాళి కట్టాడని పింకీ విషయంలో మనం చేసిన తప్పునకు దేవుడు ఇలా శిక్ష వేశాడని అంటుంది. ఇంతలో జీవన్‌కి హారతి కాల్ చేస్తే జీవన్ కట్ చేస్తాడు. ఎలా ఎప్పుడు ఏం జరిగింది అని జీవన్ అడిగితే శ్వేత మొత్తం చెప్తుంది. హారతి కాల్ చేస్తూ ఉంటుంది జీవన్ కట్ చేస్తూ ఉంటాడు.


ఇక హారతి కంటిన్యూగా కాల్ చేస్తుంటే జీవన్ లిఫ్ట్ చేసి బిజీగాఉన్నానని అరుస్తాడు. పెళ్లి చేసుకో అని హారతి అంటే చేసుకోను ఏం చేస్తావో చేసుకో అని తెగేసి చెప్తాడు. దాంతో హారతి షాక్ అయి జీవన్‌కి తన స్టైల్‌లోనే కోటింగ్ ఇవ్వాలనుకుంటుంది. అందు కోసం పింకీ మెడలో పోలీస్ గెటప్‌లో ఉన్న శ్వేత, రేణుకలు తాళి వేయడం ఆ రోజు జరిగిన వీడియో అంతా పంపిస్తుంది. దాంతో జీవన్, శ్వేతలు షాక్ అయిపోతారు. ఇక జీవన్ హారతికి కాల్ చేసి నేను వస్తానని చెప్పి ఫోన్ పెట్టేస్తాడు. జీవన్ హారతి దగ్గరకు వెళ్తాడు.


హారతితో ప్రేమగా  మాట్లాడుతాడు. ఇక హారతి వెంటనే తాళి కట్టమని అంటే జీవన్ తర్వాత కడతాను అంటాడు. హారతి మొండికేస్తుంది. దాంతో జీవన్ హారతి దగ్గర ఫోన్ తీసుకొని తాళి కట్టకపోతే ఈ ఫోన్లో వీడియో సూర్యప్రతాప్‌గారికి చూపిస్తావ్ అంతేనా అని ఫోన్ కింద పడేస్తాడు. హారతి షాక్ అయిపోతుంది.  నువ్వేం చేసుకుంటావో చేసుకో వాడు నా బిడ్డ కాదు నాకు నీకు సంబంధం లేదు అని హారతిని కొడుతాడు. హారతి ఎంత బతిమాలినా వినకుండా జీవన్ వెళ్లిపోతాడు. హారతి సంగతి క్లియర్ అయిపోయిందని అనుకొని ఇంటికి వచ్చేసరికి హారతి ఇంటికి వచ్చేసుంటుంది. జీవన్ షాక్ అయిపోయి హారతితో ప్రేమగా మాట్లాడుతాడు. హారతి ఇక్కెడికి ఎలా వచ్చిందని అనుకుంటున్నావా అని రాజు అడుగుతాడు. 


ఫ్లాష్ బ్యాక్..


హారతి జీవన్ కోసం ఎదురు చూస్తుండగా రాజు, రూపలు ముందే వెళ్లి జీవన్ వస్తున్నాడు కానీ నిన్ను పెళ్లి చేసుకోవడానికి కాదు నీ దగ్గర వీడియో తీసుకోవడానికి వస్తున్నాడు అంటారు. ఆ వీడియో పాడు చేస్తే నీకు ఆధారం ఉండదని అందుకే మాకు పంపించు అని జీవన్ తాళి కడితే ఓకే లేదంటే ఆ వీడియో చూపించి నీకు సాయం చేస్తామని అంటారు. దాంతో హారతి రాజు, రూపల్ని నమ్మి వీడియో రాజుకి పంపిస్తుంది. ఇంతలో జీవన్ రావడంతో రాజు, రూపలు దాక్కొంటారు. 


ఈ విషయం తెలిసి జీవన్ షాక్ అయిపోతాడు. అప్పుడే రూప, రాజులు హారతిని తీసుకొని ఇంటికి వెళ్తారు. ఇక జీవన్ శ్వేత మాట్లాడుకోవడం రాజు, రూపలు సీక్రెట్‌గా వినేసి హారతి దగ్గరకు వెళ్తారు. హారతి దగ్గరున్న వీడియో అందరికీ చూపిస్తారా అనుకొని జీవన్ షాక్ అయిపోతాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 


Also Read: చిరంజీవి లక్ష్మీ సౌభాగ్యవతి సీరియల్: లక్కీకి తనకు సంబంధించి విస్తుపోయే నిజం చెప్తానని మిత్రకి షాక్ ఇచ్చిన లక్ష్మీ!