Ammayi garu Serial Today Episode రూప, రాజులు తేనీటి విందులో నుంచి బయటకు వెళ్లడంతో సూర్యప్రతాప్‌ పరువు తీయాలని తాను జీవన్ కలిసి ప్లాన్ చేసిన మానభంగం నింద వేయాలని మాధవి అలియాస్ రాధిక ప్లాన్ చేస్తుంది. అందులో భాగంగా జ్యూస్ సూర్యప్రతాప్‌ డ్రస్ మీద పడేలా చేస్తుంది. సూర్యప్రతాప్‌ డ్రస్ మార్చుకోవడానికి వెళ్తాడు. 

విరూపాక్షిని అడ్డుకున్న విజయాంబిక..

రాజు, రూపలు బయటకు వెళ్తుంటే అసలైన మాధవి రాజు వాళ్లు కారుని ఢీ కొట్టి పడిపోతుంది. దాంతో ఛీప్ సెక్రటరిని కలవాలని అనుకున్న ఇద్దరూ ముందు ఆమెను హాస్పిటల్‌కి తీసుకెళ్లాలని అనుకుంటారు. ఇక మాధవి మేడ మీదకు వెళ్లడం చూసిన విరూపాక్షి వెళ్లబోతే విజయాంబిక అడ్డుకుంటుంది. విరూపాక్షిని మీదకు వెళ్లనివ్వదు. 

సూర్య మీద మీరు ఏదో కుట్ర చేస్తున్నారు..

సూర్యప్రతాప్‌ మీద మీరు ఏదో కుట్ర చేస్తున్నారు నేను ఉండగా మీ పప్పులు ఉడకవు అని విరూపాక్షి అంటుంది. మాధవి ఎక్కడికి వెళ్లిందని అడిగితే తను సూర్యప్రతాప్‌ పర్సనల్ అదే పీఏ అని అంటుంది. విరూపాక్షి షాక్ అవుతుంది. మాధవిని ఆపే హక్కు నీకు లేదని అంటుంది. మాధవిని మామయ్యే ఏరి కోరి నియమించుకున్నారని దీపక్ విరూపాక్షికి చెప్పి వెళ్లిపోమంటాడు.

మాధవిని రాజు రూప తీసుకెళ్లారు..

రౌడీలు జీవన్‌కి కాల్ చేసి మాధవిని రాజు, రూపలు తీసుకెళ్లారని చెప్తారు. మాధవి బతకడానికి వీల్లేదని జీవన్ వాళ్లకి చెప్తాడు. ఎలా అయినా వాళ్లని అడ్డుకోమంటాడు. జీవన్ దొంగ మాధవి అదే రాధికకు కాల్ చేసి అసలైన మాధవి తప్పించుకొని రాజు, రూపలు దొరికిపోయిందని అంటాడు. రాధిక షాక్ అయిపోతుంది. వాళ్లు నిజం తెలిసి వచ్చేలోపు మీ పని పూర్తి చేసుకోండి అంటారు.

సూర్యప్రతాప్ గదిలో మాధవి..

సూర్యప్రతాప్‌ గదిలోకి వెళ్లి డ్రస్ మార్చితే బెటర్ అనుకుంటాడు. మాధవి అదే గదిలోకి వస్తుంది. సూర్యప్రతాప్‌ అర్థనగ్నంగా ఉంటారు. మాధవిని చూసి నువ్వేంటి ఇక్కడ బయటకు వెళ్లు అని అంటారు. దాంతో మాధవి నేను ప్రాబ్లమ్లో ఉన్నా సార్ మీరే కాపాడాలి అంటుంది. సూర్యప్రతాప్‌ చేతులు పట్టుకొని సార్ నన్ను కాపాడండి అని జుట్టు పీక్కొని, చీర లాగేసుకొని అందరూ చూసినట్లు ప్లీజ్ సార్ నన్నేం చేయకండి ప్లీజ్ సార్ అని బయటకు వస్తుంది. వెనకాలే మాధవి మాధవి అని సూర్యప్రతాప్‌ వస్తారు. 

సీఎం గారు నా మీద అత్యాచారం చేశారు..

మాధవి ఏడుస్తుంది. అందరూ ఏమైందని సూర్యప్రతాప్‌ గారు నా మీద అత్యాచారం చేయబోయారని చెప్తుంది. అందరూ షాక్ అయిపోతారు. సూర్యప్రతాప్‌ కూడా బిత్తరపోతారు. మీడియా ఫొటోలు తీస్తారు. విరూపాక్షి సూర్యని చూస్తూ షాక్ అయిపోతుంది. మరోవైపు రాజు, రూపలు మాధవిని హాస్పిటల్‌లో జాయిన్ చేస్తారు. అందరూ సూర్యప్రతాప్‌ మీద బురద చల్లాలి అని చూస్తే ఎవరూ ఊరుకోరని అంటుంది. ఎందుకు ఇలా చేశావని అందరూ మాధవిని ప్రశ్నిస్తుంది.

మీరే వినలేదు సార్..

మాధవి సూర్యతో సార్ మన పరువు పోతుంది అని నేను చెప్పాను మీరు వినలేదు ఇప్పుడు చూడండి అని అంటుంది. ఆడవాళ్లు కూడా తన గురించి ఆలోచించడం లేదని అంటుంది. ఇక నాకు ఏం న్యాయం జరగదు అని వెళ్లబోతే విరూపాక్షి ఆపి సూర్యప్రతాప్‌ ఎలాంటి వారో ఆయన భార్యగా నాకు తెలుసు. ప్రజలకు తెలుసు ఆయన పరువు తీయడానికి ఇలా చేశావని అర్థమవుతుంది ఎందుకు ఇలా చేశావో చెప్పు అంటే సూర్యనే అడుగు అంటుంది. విజయాంబిక మాధవిని కొట్టి తన తమ్ముడి గురించి తప్పుగా మాట్లాడొద్దని అంటుంది.

రాజు, రూపలకు పెద్ద షాక్..  రాజు, రూపలు సీఎంఓ ఆఫీస్‌కి వెళ్లి మాధవి గురించి అడిగితే తాము కాపాడిందే అసలైన మాధవి అని గుర్తిస్తారు. ఇక విషయం చెప్పాలని మందారం కాల్ చేసి ఇక్కడ మాధవి ఏదేదో చేస్తుంది అని అర్జెంటుగా రమ్మని అంటుంది. రూప, రాజులు అసలైన మాధవిని తీసుకెళ్లాలి అనుకుంటారు.

నీకేం కావాలి మాధవి..

సూర్యప్రతాప్‌ మాధవి దగ్గరకు వచ్చి నీకేం కావాలి మాధవి ఎందుకు ఇలా చేస్తున్నావ్ నిన్ను నేను చాలా నమ్మాను అంటారు. దాంతో మాధవి మీరు చెప్పినట్లు చేస్తున్నాను. రమ్మన్న ప్రతీ సారి ఇంటికి వస్తున్న అందరి ముందు మన సంబంధం బయట పడినందుకు మాట మార్చేస్తున్నారా అని అడుగుతుంది. సూర్యప్రతాప్‌ మాధవిని కొట్టడానికి చేయి ఎత్తుతారు. 

నీ భార్య రింగ్ నాకు ఎందుకు ఇచ్చావ్..

అసలు నీకు నాకు ఏ సంబంధం లేకపోతే నీ భార్య కోసం చేయించిన రింగ్ నాకు ఎందుకు తొడిగావు సూర్య అని అంటుంది. ఆ రింగ్ చూసి విరూపాక్షి షాక్ అవుతుంది. అందరూ షాక్ అవుతారు. ఫ్లాష్ బ్యాక్లో ఆ రింగ్ విజయాంబికి మాధవికి ఇస్తుంది. ఇక జీవన్ మాధవి తన మనిషి అని డాక్టర్‌తో చెప్పి తీసుకెళ్తానని అంటాడు. ఇంట్లో మాధవి సూర్య మీద నిందలు మోపుతుంది. మీ అక్క కోసం చేసిన నెక్లెస్ నాకు ఎందుకు ఇచ్చావ్ అని అడుగుతుంది. నా నెక్లెస్ అని విజయాంబిక నోరెళ్లబెడుతుంది. నలుగురికి తెలిస్తే నన్ను పెళ్లి చేసుకుంటా అని చెప్పారని అంటుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది. 

Also Read: కార్తీకదీపం 2 సీరియల్: నువ్వు ఎవర్నినైనా ఉద్దరించుకో ఉద్యమాలు చేసుకో నా జోలికి రాకు.. దీపకు గౌతమ్ వార్నింగ్!