Ammayi garu Serial Today Episode రాధిక ఇంటికి వెళ్తూ చాక్లెట్ తీసుకొని కొడుకు కోసం బయల్దేరుతుంది. దారిలో చాక్లెట్ చూసుకొని ఇకపై మనం దాక్కోని బతకాల్సిన అవసరం లేదు నాన్న దర్జాగా బతకొచ్చు మనకి ఇక ఏ ఇబ్బంది లేదు అనుకొని సంతోషంగా ఇంటికి వెళ్తుంటుంది. ఇంతలో దీపక్, విజయాంబికలు రౌడీలతో కలిసి రాధికను ఫాలో అవుతారు. 

దీపక్ రాధికను చంపేయమని చెప్తాడు. రాధిక వాళ్లని చూసి అనుమానం వచ్చి వెంటనే రూపకి కాల్ చేసి తనని ఎవరో చంపడానికి ఫాలో అవుతున్నారని చెప్తుంది. రాజు లైవ్‌ లొకేషన్ పెట్టమని రాధికతో చెప్తాడు. రాజు, రూప ఇద్దరూ బయల్దేరుతారు. విజయాంబిక, దీపక్‌లు రాధిక ఫోన్‌లో మాట్లాడటం చూసి ఎలా అయినా రాధికను చంపేయాలి అనుకుంటారు. ఇక ఇంట్లో సూర్యప్రతాప్ రూప గురించి ఆలోచిస్తారు. ఎలా అయినా రూపని కాపాడుకోవాలని అనుకుంటారు. దీపక్, విజయాంబికలను చూసి రాధిక షాక్ అయిపోతుంది. దీపక్ రాధికతో చేయని నేరానికి నన్ను చెప్పుతో కొట్టించావ్ నిన్ను వదలను అని అంటాడు. మీరు చేసిన పనికి నేను గుణపాఠం చెప్పానని రాధిక అంటుంది. దాంతో విజయాంబిక రాధికను పట్టుకొని నువ్వు చేసిన పనికి మేం గుణపాఠం చెప్పడానికి వచ్చాం అని దీపక్‌ని పొడవ మని చెప్తుంది. దీపక్ రాధికను పొడిచేస్తాడు. ప్రేమతో చంపేయాలి అనుకున్నా కానీ ఇలా కత్తితో చంపాల్సి వస్తుందని అనుకోలేదని పొడిచేస్తాడు. రాధికను చాలా కత్తిపోట్లు పొడుస్తాడు. ఇంతలో రాజు రూపలు రావడంతో రాధికను వదిలేసి పారిపోతారు. 

రూప, రాజులు రాధికను చూసి పరుగులు తీస్తారు. చాటు నుంచి దీపక్, విజయాంబికలు చూస్తుంటారు. రాధికను హాస్పిటల్‌కి తీసుకెళ్తామని అనుకుంటారు. రాధిక ఆపి తాను ఎక్కువ సేపు బతకను అని అర్థమైంది అని దీపక్, విజయాంబికలే తనని పొడిచేశారని ఆధారాలు లేకుండా ఉండాలని ఇలా సీసీ కెమెరాలు లేని చోటులో ప్లాన్ చేశారని అంటుంది. ఇక తాను చేసింది వీడియో తీసుకోమని చెప్తుంది. హాస్పిటల్‌కి వెళ్దామని రూప అంటే వద్దని రాధిక వీడియో రికార్డ్ చేసుకోమని అంటుంది. రాజు ఫోన్ ఆన్ చేస్తాడు. 

రాధిక తనని పొడిచింది దీపక్ అని చెప్పబోయి చనిపోతుంది. రూప, రాజులు షాక్ అయిపోతారు. రూప ఏడుస్తుంది. విజయాంబిక, దీపక్‌లను వదలకూడదు అని రాజు అంటాడు. విజయాంబిక రాధిక చావుని దీపక్ అకౌంట్‌లో వేసేయాలి అనుకుంటుంది. రాధిక మర్డర్ జరిగింది కాబట్టి లీగల్‌గా ముందుకు వెళ్దామని రాజు అంటాడు. ఇక రాధిక మర్డర్‌కి గురైనట్లు వార్తల్లో బ్రేకింగ్ న్యూస్ వస్తుంది. ఇంట్లో అందరూ చూసి షాక్ అయిపోతారు. ఏం తెలీనట్లు దీపక్, విజయాంబికలు వచ్చి రాధిక చనిపోవడం ఏంటి అని ఓవర్ చేస్తారు. 

రాజు రూపలు ఇంటికి వచ్చి రాధికను మేమే చంపుకున్నాం అని అంటాడు. రాధిక తమకి కాల్ చేసిందని కానీ కాపాడలేకపోయాం అని బాధపడతారు. దీపక్, విజయాంబికల్ని సూర్యప్రతాప్ రాధికను చంపడంలో మీ పాత్ర ఉందా అని అడుగుతారు. మాకేం సంబంధం లేదని విజయాంబిక అంటుంది. దానికి మందారం దీపక్ దెబ్బలకు రాధికే కారణం కదా మీరే చేసుంటారు అంటుంది. మాకేం తెలీదు అని విజయాంబిక అంటుంది. రాజు మనసులో రాధికను చంపింది మీరే అని నిరూపిస్తా అని అనుకుంటాడు. రాధిక అయిపోయింది ఇక రాజు, రూపలను టార్గెట్ చేస్తారు. 

చంద్ర అన్నతో రాధిక చావుకి మనల్ని కారణం చేస్తారేమో అంటాడు. దానికి విజయాంబిక రాధికను చంపాల్సిన అవసరం జీవన్‌కి మాత్రమే ఉందని జీవన్ జైలులో ఉన్నా వాడి సైన్యం మొత్తం బయటే ఉంది కదా అని తప్పు జీవన్ మీద నెట్టేస్తుంది. సూర్యప్రతాప్ రూపతో ఆ అంతకులను వలదను అని డీజీపీకి కాల్ చేస్తాడు. అమావాస్య వరకు రూపని బయటకు వెళ్లొద్దని అంటాడు. రాధిక రాధిక అని దీపక్, విజయాంబిక గదిలోకి వెళ్లి డ్యాన్స్ చేస్తారు. రూప, రాజులు గదిలోకి వెళ్లి రాధికను ఎందుకు చంపారు అని అడుగుతారు. దాంతో దీపక్ రాధిక మీతో చేతులు కలిపి నన్ను కొట్టించినప్పుడు మిమల్ని రాధికని చంపేయాలి అన్నంత కోపం వచ్చిందని అంటాడు. మీరు మమల్ని ఇరికించాలని అని ప్రయత్నించినా ఏం చేయలేరు అని అంటాడు. మాకు నిజం తెలుసు అని దీపక్  అంటే నిజం తెలుసుకొని ఏం పీకుతావ్ర్‌రా అని దీపక్ అంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.  

Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!