Kalavari Kodalu Kanaka Mahalakshmi Serial Today Episode లక్ష్మీ భిక్షాటనకు వెళ్తుంది. సహస్ర పనామెతో అందరితో చెప్పు ఎవరూ దానికి భిక్షం వేయకూడదు అని అంటుంది. మండుటెండలో లక్ష్మీ తిరగడం చూసి విహారి బాధ పడతాడు. లక్ష్మీ వెనకాలే విహారి తిరుగుతాడు. పక్కనే ఒకామె నీళ్ల బిందె తీసుకెళ్తుంటే దాన్ని లాక్కొని లక్ష్మీ కాలి కింద పడేస్తాడు. నీరు తగిలిన లక్ష్మీ ప్రాణం లేచొచ్చినట్లు అవుతుంది.
సహస్ర అది చూసి దానికి నొప్పి తగిలితే నీకు నొప్పి పుడుతుందా బావ నువ్వు ఎంత దాన్ని వెనకేసుకొచ్చినా రేపు మన పెళ్లి జరగడం పక్కా ఆ తర్వాత దానికి నేను నరకం చూపిస్తాను అని సహస్ర అనుకుంటుంది. విహారి వెళ్లిపోతాడు. లక్ష్మీని ఆపడానికి సహస్ర రౌడీలకు కాల్ చేస్తుంది. వాళ్లకి లక్ష్మీ ఫొటో పంపి తన జోలలో ఉన్న భిక్షని నేలపాలు చేయమని చెప్తుంది. రౌడీలు లక్ష్మీని అడ్డుకొని జోల లాగడానికి ప్రయత్నిస్తారు. లక్ష్మీ వాళ్ల నుంచి తప్పించుకోవడానికి బ్యాగ్ పట్టుకొని లాగుతుంటుంది. ఇంతలో వెళ్లిపోయిన విహారి వెనక్కి వస్తాడు. ఈలోపు లక్ష్మీ అమ్మవారికి దండం పెట్టుకొని రౌడీలను కొడుతుంది. సహస్ర, విహారి ఇద్దరూ లక్ష్మీని చూసి షాక్ అయిపోతారు. విహారి లక్ష్మీ అని పిలిచి నువ్వేనా లక్ష్మీ నిన్ను ఎప్పుడూ ఇంత ఆవేశంగా చూడలేదు అలా ఎలా కొట్టావ్ అంటే దానికి లక్ష్మీ వాళ్లు నా జోలికి వచ్చినా పట్టించుకునేదాన్ని కాదు కానీ ఏ ఆడదైనా తన పసుపు కుంకుమల జోలికి వస్తే ఇలాగే మారుతుందని అంటుంది. లక్ష్మీతో పాటు విహారి వస్తాను అంటే లక్ష్మీ వద్దని విహారిని పంపేస్తుంది. తర్వాత భిక్షాటనకు వెళ్తుంది.
సహస్ర లోపలికి వెళ్లి అంబికతో అది భిక్ష దొరికే వరకు వచ్చేలా లేదు పిన్ని అని అంటుంది. రౌడీలను పంపితే వాళ్లని కొట్టి పంపిందని జరిగింది చెప్తుంది. ఇంతలో పనామె వచ్చి లక్ష్మీకి ఇద్దరే భిక్షం వేశారు. మరి ఎవరూ వేయరు అని అంటుంది. అంబిక తాంబూలం కోసం కూడా ఎవరూ రా కూడదు అని అంటుంది. ఎదురు డబ్బిచ్చి ఆపేశానని పనామె చెప్తుంది. లక్ష్మీ ఇంటికి వచ్చి ఏడుస్తుందని ఇద్దరూ అనుకుంటారు. పద్మాక్షి ఇంట్లో పూజ వద్దని చెప్పడంతో యమున, వసుధలు బయట పూజకు ఏర్పాట్లు చేస్తారు. మన వీథిలో చాలా మంది ఉన్నారు భిక్షకు సరిపోతారు కదా లక్ష్మీ ఇంకా రాలేదు ఏంటి అని యమున, వసుధ అనుకుంటారు.
లక్ష్మీ ఓ చెట్టు కింద కూర్చొని తనకు భిక్షం కూడా ఎవరూ వేయడం లేదని ఏడుస్తుంది. ఇంతలో అమ్మవారు బామ్మ రూపంలో అక్కడికి వస్తుంది. లక్ష్మీని పిలిచి విషయం అడుగుతుంది. లక్ష్మీ సుమంగళి వ్రతం చేస్తున్నా అని తనకు ఎవరూ భిక్ష వేయడం లేదని చెప్తుంది. దానికి అమ్మవారు వేరే దిక్కు చూపించి ఇటు వెళ్లు భిక్షం వేస్తారు అని చెప్తుంది. దాంతో లక్ష్మీ సంతోషంగా అటు వెళ్తుంది. అందరూ భిక్ష వేస్తారు. లక్ష్మీ అమ్మవారికి థ్యాంక్స్ చెప్తుంది. మిమల్ని చూస్తుంటే సాక్ష్యాత్తు అమ్మవారిని చూసినట్లు ఉందని కాళ్లకి దండం పెడుతుంది. ఇక అమ్మవారు లక్ష్మీతో నిన్ను చూస్తే నా కూతురిని చూసినట్లు ఉందని నేనే దగ్గరుండి ఈ వ్రతం చేయిస్తాను అని చెప్తుంది. లక్ష్మీ చాలా సంతోషంతో బామ్మని తీసుకెళ్తుంది. ఇంటి దగ్గర అందరూ లక్ష్మీ కోసం ఎదురు చూస్తుంటారు.
లక్ష్మీ బామ్మతో కలిసి రావడంతో సహస్ర, అంబిక షాక్ అయిపోతారు. పండు ఎదురెళ్లి దిష్టి తీస్తాడు. యమున లక్ష్మీతో ఆ పెద్దావిడ ఎవరు అని అమ్మ అని అడుగుతుంది. అమ్మవారి పూజ దగ్గరుండి చేయిస్తా అంటే తీసుకొచ్చానని చెప్తుంది. విహారి చూసి నాకోసం నువ్వు ఎంత కష్టపడుతున్నావ్ కనకం కానీ నేను నిన్ను సంతోషంగా చూసుకోలేకపోతున్నా అని అనుకుంటాడు. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తయిపోతుంది.
Also Read: చిన్ని సీరియల్: దేవేంద్రవర్మ ఎవరో తెలుసుకున్న సత్యం.. చెల్లి నిర్దోషి అని నిరూపించుకోగలడా!