'గుప్పెడంత మనసు' సీరియల్‌‌లో జగతి మేడం క్యారెక్టర్‌కు స్పెషల్ ఫ్యాన్ బేస్ ఉంది. సీరియల్ కథకు అనుగుణంగా ఆవిడ అత్త రోల్ చేశారు గానీ... రియల్ లైఫ్‌లో ఆవిడ యంగ్ అండ్ మోడ్రన్. అసలు పేరు జ్యోతి పూర్వాజ్. గ్లామర్ ఫోటోలు షేర్ చేస్తూ వైరల్ అయ్యారు. జ్యోతి పూర్వాజ్ ప్రధాన పాత్రలో 'కిల్లర్' సినిమా తెరకెక్కింది. రీసెంట్‌గా గ్లింప్స్‌ రిలీజ్ చేశారు. అందులో ఆవిడ క్యారెక్టర్ చూస్తే సీరియల్ ఫ్యాన్స్ అందరూ షాక్ అవ్వడం గ్యారంటీ.

రోబోగా మారిన జ్యోతి పూర్వాజ్!'శుక్ర', 'మాటరాని మౌనమిది', 'ఏ మాస్టర్ పీస్' వంటి డిఫరెంట్ సినిమాల తర్వాత దర్శకుడు పూర్వాజ్ తెరకెక్కించిన సినిమా 'కిల్లర్'. ఇదొక సైన్స్ ఫిక్షనల్ యాక్షన్ థ్రిల్లర్. ఇందులో ఆయన హీరోగా నటిస్తుండటం విశేషం. జ్యోతి పూర్వజ్ హీరోయిన్ రోల్ చేశారు. విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ ఇతర కీలక తారాగణం. ఇవాళ రిలీజ్ చేసిన గ్లింప్స్‌ చూస్తే... జ్యోతి రాయ్ అలియాస్ జ్యోతి పూర్వాజ్ రోబోగా స్క్రీన్ మీద సందడి చేయనున్నారని అర్థం అవుతోంది. 

'ప్రాచీనమైన వైమానిక శాస్త్రంలో మానవ మేథస్సు రహస్యాలను, ఆశ్చర్యం కలిగే శక్తుల మూలలను అప్పట్లో కథలుగా చెప్పుకొనేవారు' అనే డైలాగుతో గ్లింప్స్‌ స్టార్ట్ అయ్యింది. ఆత్మ కలిగిన యంత్రాలు (మెషీన్స్ విత్ ఏ సోల్) అంటూ రోబోలను చూపించారు. ఆ తర్వాత రొమాంటిక్ మూమెంట్స్ వచ్చాయి. జ్యోతి పూర్వాజ్ పాత్ర పరిచయం జరిగింది. కొన్ని క్షణాలు ఆమె క్యారెక్టర్ ట్విస్ట్ రివీల్ చేశారు. 'సూపర్ షి' అంటూ ఆవిడను చూపించారు. 'డీ బౌండ్' అంటే ఏమిటి? దాన్నుంచి కోలుకున్న ఆమెకు ఎటువంటి పునర్జన్మ వచ్చింది? అనే ఆలోచిస్తుండగా... గ్లింప్స్‌ ఎండింగ్‌లో ఆమెను రోబోగా చూపించి సినిమాపై మరింత క్యూరియాసిటీ కలిగించారు దర్శకుడు పూర్వాజ్. 'మొదలెడదామా' అంటూ గ్లింప్స్ చివర్లో హీరో కమ్ డైరెక్టర్ పూర్వాజ్ పవర్ ఫుల్ డైలాగుతో ఆకట్టుకున్నారు.

Also Readనాని 'హిట్ 3' ఫస్ట్ షో డీటెయిల్స్‌... ట్విట్టర్ రివ్యూస్, USA Premier Show రిపోర్ట్ వచ్చేది ఎప్పుడంటే?

'కిల్లర్' సినిమాను ఏయు అండ్ ఐ, మెర్జ్ ఎక్స్ ఆర్ సంస్థలతో కలిసి థింక్ సినిమా పతాకంపై పూర్వాజ్, ప్రజయ్ కామత్, ఎ. పద్మనాభ రెడ్డి  నిర్మిస్తున్నారు. తెలుగుతో పాటు కన్నడలో గ్లింప్స్ రిలీజ్ చేశారు. మైథాలజీ, సైన్స్ ఫిక్షన్, సూపర్ హీరో - అంశాలతో గ్లింప్స్ ఆసక్తికరంగా సాగింది. ప్రస్తుతం చిత్రీకరణ తుది దశకు చేరుకుందని, త్వరలో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నామని దర్శక నిర్మాతలు వెల్లడించారు.

Also Readశర్వా38... ఇప్పట్నుంచి 'భోగి'... షూటింగ్ మొదలైంది... టైమ్ పీరియడ్, స్టోరీ బ్యాక్‌డ్రాప్ ఇదే

జ్యోతి పూర్వజ్, పూర్వాజ్, విశాల్ రాజ్, దశరథ, చందూ, గౌతమ్ తదితరులు యాక్ట్ చేస్తున్న ఈ సినిమాకు సినిమాటోగ్రఫీ: జగదీశ్ బొమ్మిశెట్టి, సంగీతం: ఆశీర్వాద్ & సుమన్ జీవ, వీఎఫ్ఎక్స్ - వర్చువల్ ప్రొడక్షన్: మెర్జ్ ఎక్స్ఆర్, నిర్మాణ సంస్థలు: థింక్ సినిమా - మెర్జ్ ఎక్స్ఆర్ - ఏయు అండ్ ఐ, నిర్మాతలు: పూర్వాజ్ - ప్రజయ్ కామత్ - ఎ. పద్మనాభ రెడ్డి, రచన - దర్శకత్వం: పూర్వాజ్.