వెండితెరకు వయలెన్స్ కొత్త కాదు. యాక్షన్ సినిమాలన్నిటిలోనూ అంతో ఇంతో  హింస తప్పనిసరి. అయితే ఇప్పుడు ఆ హింస ఓ స్థాయిని దాటిపోయి గగుర్పాటు కల్పించే స్థితికి దర్శకులు రెడీ అవుతున్నారు. ఇటీవల మలయాళం లో వచ్చిన మార్కో సినిమాని ఏం ఆశించి తీసారో గాని థియేటర్లో చూసిన జనాలు గగ్గోలు పెట్టారు. సున్నిత మనస్కులు ఆ సినిమా ప్రభావం నుంచి అంత తొందరగా బయట పడలేక పోయారు. ఆ సినిమాలో చూపించిన దాన్ని హింస అనలేము... అంతకు మించి అన్నట్టుగా వయలెన్స్ ఉంటుంది. ఇంగ్లీషులో క్రీపీ, డిస్టర్బ్ఇంగ్ లాంటి పదాలు మాత్రమే వాడగలం. విచిత్రంగా ఆ సినిమా హిట్ కూడా అయింది. అయితే దానిలో ఉన్న మితిమీరిన హింసను చూసి టీవీలో టెలికాస్ట్ చేయడానికి కుదరదు అంటూ నిషేధించారు. తాజాగా నేచురల్ స్టార్ నాని నటించిన 'హిట్ 3' ట్రైలర్ చూసిన నెటిజన్స్ కూడా ఇందులో హింస ఎక్కువ అని అభిప్రాయపడుతున్నారు. స్వయంగా నాని "ఈ సినిమా చిన్న పిల్లల కోసం, సున్నిత మనస్కుల కోసం కాదు" అని క్లారిటీ ఇచ్చేశారు. దానితో వెండితెరపై 'గగుర్పాటు' అనే కొత్త జోనర్ విస్తరించబోతుందా అనే చర్చ సినీ జనాల్లో మొదలైంది.

రక్తపు చుక్క లేకుండానే వయలెన్స్ చూపించిన సినిమాలుగతంలో ఇలా ఉండేది కాదు. ఇండియన్ సినిమా చరిత్రను మార్చిన 'షోలే' సినిమాలో ప్రేక్షకులను భయపెట్టే చాలా సీన్స్ ఉంటాయి. ఠాకూర్ కుటుంబాన్ని గబ్బర్ సింగ్ చంపేసే సీన్ ముఖ్యంగా పిల్లాడ్ని, ఠాకూరు రెండు చేతులు నరికేయడం ఇవన్నీ ఆడియన్స్ ని  భయపెట్టేవే. కానీ ఎక్కడా ఒక్క చుక్క రక్తం కనపడదు. అలాగే తెలుగు సినిమా చరిత్రను మార్చిన మోస్ట్ వయలెంట్ ఫిల్మ్ అని అప్పట్లో ప్రచారం జరిగిన RGV 'శివ'లో  రామ్ జగన్ను కొట్టే సీన్, శుభలేఖ సుధాకర్ హత్య, నాగార్జున అన్న కూతురు చావు ప్రేక్షకుల్ని భయపడతాయి. కానీ ఎక్కడ ఒక చుక్క రక్తం కనపడదు.ఈ సినిమాల్లోని హింస చూసే ప్రేక్షకుల్ని భయపెడతాయి తప్ప ఇబ్బందికి గురిచేయవు. తర్వాత ఫ్యాక్షన్ సినిమాలు ఎంటర్ అవ్వడంతో తెరపై రక్తపాతం చూపిస్తున్నా అవన్నీ యాక్షన్ సినిమా క్యాటగిరీలో కొట్టుకుపోయాయి. కానీ ఇదిగో ఇప్పటి ట్రెండ్ మాదిరి గగుర్పాటుకు  గురి చేసేవి కావు. 

హాలీవుడ్ లో ఎప్పటినుంచో ఈ ట్రెండ్  హాలీవుడ్ సినిమాల్లో క్రీపీ, డిస్టర్బ్డ్ సినిమాలు కంటూ ఒక జోనర్ ఉంది. ప్రపంచాన్ని 'గగుర్పాటు'కు గురిచేసిన క్యానిబల్ సినిమాలు గురించి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. 70, 80 దశకాల్లో  వచ్చిన క్యానిబల్ సినిమాలు ఈ కోవకు చెందినవే. మౌంటెన్ ఆఫ్ ద క్యాన్బల్ గాడ్స్, క్యానిబల్ ఫారెక్స్ సిరీస్, ఈటెన్ ఎలైవ్ లాంటి సినిమాల్లో చూపించిన దృశ్యాలు పై  జనాల్లో తీవ్రమైన చర్చ జరిగింది. అయితే వీటి బడ్జెట్ తక్కువ కావడం, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో రిలీజ్ కావడం వల్ల ఆయా ప్రాంతాల్లో కొద్దికొద్ది మందే సినిమా చూసినా కూడా బడ్జెట్ తిరిగి వచ్చేసేది. 

ఆస్కార్ సాధించిన సైకో కిల్లర్ సినిమాలుసైకో కిల్లర్ హత్యల పరంపరతో రూపొందిన  సైలెన్స్ ఆఫ్ ది లాంబ్స్ సిరీస్ (హానిబల్,హానిబల్ రైజింగ్, రెడ్ డ్రాగన్ ) ను హారర్ సినిమాల్లోని అతి గొప్ప సిరీస్ గా చెబుతారు. సైలెన్స్ ఆఫ్ ది ల్యాంప్స్ ఎంత సంచలనం సృష్టించింది అంటే ఏకంగా ఐదు ఆస్కార్ అవార్డులు కొల్లగొట్టింది. బెస్ట్ యాక్టర్, బెస్ట్ యాక్ట్రెస్, బెస్ట్ ఫిల్మ్, బెస్ట్ డైరెక్టర్, బెస్ట్ అడాప్టెడ్ స్క్రీన్ ప్లే  అనే టాప్ ఫైవ్ క్యాటగిరి ల్లోనూ ఆస్కార్ అవార్డులు పొందింది ఈ సినిమా. హారర్ సినిమాకు ఆస్కార్ అవార్డు రావడం అనేది ఇప్పటికీ ఈ సినిమా ఒక్కదానికే జరిగింది. ఈ సినిమాలోని సీన్లను సున్నిత మనస్కులు చూస్తే తట్టుకోలేరు. అలాగని సినిమా కూడా చెత్తదేం కాదు. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది.

శృంగారంతో పాటు హింస... రాంగ్ టర్న్ సిరీస్!పైకి చెప్పరు గాని రాంగ్ టర్న్ సిరీస్ కి యూత్ లో చాలా పెద్ద ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. విపరీతమైన హింస మితి మీరిన శృంగార సన్నివేశాలతో  ఈ సిరీస్ మొత్తం నిండిపోయి ఉంటుంది. ఇందులోని హత్యలు అన్ని చాలా గగుర్పాటు సన్నివేశాలతో ఉంటాయి.

హింసే ప్రాతిపదికగా సా (Saw) సిరీస్ మూవీస్భయంకరమైన హింసను చూపించడం కోసమే  తీసినట్టుగా ఉండే సా (saw ) సినిమా సిరీస్ ను చూసి ప్రశాంతంగా నిద్రపోవడం చాలా కష్టం. ఈ సిరీస్లోని సినిమాలు ఎంత భయంకరంగా ఉంటాయి అంటే చాలామంది ఏకబిగిన సినిమా మొత్తం చూడలేరు. ఇవి మాత్రమే కాక 'ది హాస్టల్ సిరీస్ '  'ఈవిల్ డెడ్ రీ-బూట్ సిరీస్' ప్రేక్షకుల్ని గగుర్పాటుకు గురి చేయడం కోసమే తీసినట్టుంటాయి.

ఇండియన్ ప్రేక్షకులు ఇంత హింస భరించగలరా?'మార్కో' సినిమా పుణ్యమా అంటూ ఇప్పుడు ఇండియన్ తెరపై కూడా 'గగుర్పాటు' అనేది కొత్త జోనర్ గా ఎంటర్ అయింది. ఇప్పుడు నేచురల్ స్టార్ నాని కూడా 'హిట్ 3'తో ఆ జోనర్ను తెలుగులోకి తీస్తున్నారా? అనే అభిప్రాయం నెటిజన్స్ నుంచి కలుగుతుంది. అదెంతవరకు నిజమో తెలియాలంటే మరికొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే.