ప్రముఖ టీవీ సీరియల్ నటిపై ఆమె భర్త తీవ్రమైన ఆరోపణలు చేశాడు. పెళ్లి తర్వాత తన తల్లిదండ్రులను మానసిక ఇబ్బందులకు గురిచేయడమే కాకుండా.. రూ.25 లక్షలు కాజేసిందని ఆరోపించాడు. ఆమె వేరే వ్యక్తితో అక్రమ సంబంధం పెట్టుకుందని, తనపై తప్పుడు కేసులు పెట్టి బెదిరిస్తోందని వెల్లడించాడు. ఆ నటికి గతేడాది సెప్టెంబర్ నెలలో పెళ్లయ్యింది. అయితే, పెళ్లయిన నెల రోజుల్లోనే ఆమె అక్రమ సంబంధం బయటపడిందని ఆమె భర్త తెలిపాడు. 


హైదరాబాద్‌కు చెందిన ఓ రియాల్టర్‌తో ఆమె సంబంధం పెట్టుకుందని ఆమె భర్త పేర్కొన్నాడు. ఈ ఆరోపణలు ఎదుర్కొ్ంటున్న నటి పలు తెలుగు టీవీ చానెళ్లలో ప్రసారమవుతున్న సీరియల్స్‌లో నటిస్తోంది. ‘పలుకే బంగారమాయేనా’, ‘అలా వైకుంఠపురం’, ‘అత్తారింటికి దారేది’, ‘అమ్యాయిగారు’ సీరియల్స్‌లో ఆమె నటిస్తున్నట్లు తెలిసింది. ‘నీరూటే సెపరేట్’, ‘త్రిముఖి’ సినిమాల్లో కూడా ఆమె నటించింది. ప్రస్తుతం ఆమె భర్త ఆరోపణలు ఇండస్ట్రీలో హాట్ టాపిక్‌గా మారాయి.


Also Read: 'కార్తీకదీపం' సీరియల్‌ : కొత్త ప్రోమో వచ్చేసింది - అసలు కథ ఇదే