Illu Illalu Pillalu Serial Aamani Prabhakar Guest Roles In Intinti Ramayanam: సీనియర్ నటి ఆమని అటు మూవీస్, ఇటు సీరియల్స్‌లో బిజీగా మారారు. ఆమని, బుల్లితెర స్టార్ ప్రభాకర్ లీడ్ రోల్స్‌లో నటించిన సీరియల్ 'ఇంటింటి రామాయణం'. ప్రస్తుతం ఈ సీరియల్ 'స్టార్ మా'లో ప్రసారమవుతోంది.
'ఇంటింటి రామాయణం'లో గెస్ట్ రోల్స్
'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్ యాక్టర్స్ ఆమని (Aamani), ప్రభాకర్ (Prabhakar) 'ఇంటింటి రామాయణం' (Intinti Ramayanam) సీరియల్‌లో అతిథి పాత్రల్లో సందడి చేయనున్నారు. దీనికి సంబంధించిన ప్రోమో తాజాగా రిలీజ్ అయ్యింది. ఈ వీడియో ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. ప్రభాకర్, ఆమనితో పాటు దుర్గాదేవి సైతం ఈ ప్రోమోలో కనిపించారు. అయితే వీరు అసలు పేర్లతో కాకుండా 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో పేర్లతోనే ఇంటింటి రామాయణంలో కనిపించనున్నట్లు ప్రోమోను బట్టి తెలుస్తోంది.
సడన్ సర్‌ప్రైజ్
ఓ సీరియల్‌లోని యాక్టర్స్ మరో సీరియల్‌లో నటించడం కామన్ అయినా.. ఒక్కోసారి సడెన్ సర్‌ప్రైజ్‌గా ఇలా గెస్ట్ రోల్స్‌లో మరో సీరియల్‌లో కనిపిస్తుంటారు. ఈ క్రమంలోనే 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' (Illu Illalu Pillalu) సీరియల్ టీం 'ఇంటింటి రామాయణం'లో కనిపించి సందడి చేశారు. తన అమ్మానాన్నలు కలిసి ఉండాలని ఆరాధ్య చెట్టుకు ముడుపు కట్టాలని చూస్తుంది. ఆమెకు రామరాజు, వేదవతి సాయం చేసినట్లుగా ప్రోమోలో ఉంది. తమ అమ్మానాన్నలు కలిసి ఉండాలని కోరుకుంటున్నట్లు ఆరాధ్యా వారికి చెప్పడం సహా అవనిని చూపిస్తుంది. అవనికి దైర్యం చెప్పే రోల్స్‌లో ఆమని, ప్రభాకర్ కనిపించారు.
టీఆర్పీలో టాప్ రేటింగ్స్
ప్రస్తుతం స్టార్ మా ఛానెల్‌లో సీరియల్ టీఆర్పీ రేటింగ్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సెకండ్ ప్లేస్‌లో కొనసాగుతోంది. ఇంటింటి రామాయణం సీరియల్ మూడో స్థానంలో ఉంది. తాజా రేటింగ్స్‌లో ఇల్లు ఇల్లాలు పిల్లలు సీరియల్ 12.45 రేటింగ్ సొంతం చేసుకోగా.. ఇంటింటి రామాయణం సీరియల్ 12.30 రేటింగ్ వచ్చింది. 'ఇంటింటి రామాయణం'లో పల్లవి రామస్వామి, రామకృష్ణ, యషు, కృష్ణశ్రీ కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇక 'ఇల్లు ఇల్లాలు పిల్లలు' సీరియల్‌లో ప్రభాకర్, ఆమని, అన్షురెడ్డి నటిస్తున్నారు.