Chiranjeevi Lakshmi Sowbhagyavathi Serial Today Episode: అరవిందను అడ్డుపెట్టుని మనీషా చేస్తున్న దారుణాలకు జనార్దన్ బాధపడుతుంటాడు.ఆయనను కోడలు లక్ష్మీ ఓదార్చుతుంది. అన్ని మంచిరోజులు వస్తాయని సముదాయిస్తుంది. నీ మంచితనాన్నిఅడ్డుపెట్టుని మనీషా ఇంకా ఎన్ని అరాచకాలు చేస్తుందోనని భయపడుతున్నానంటాడు. అవన్నీ నేను చూసుకుంటానని లక్ష్మీ చెప్పడంతో జనార్దన్ వెళ్లి పడుకుంటాడు.
జ్యూస్ గ్లాస్‌తో మిత్ర గదిలోకి మనీశా అడుగుపెడుతుంది. అప్పుడే అక్కడ మిత్రా చాలా ఇంపార్టెంట్ ఫైల్ చూస్తుంటాడు. సరియు చెప్పిన ఫైల్ ఇదేనని గమనించిన మనీషా....మిత్రకు తెలియకుండా ఆఫైల్‌లో ఉన్న వివరాలన్నీ ఫోన్‌లోకి ఎక్కించుకుని సరియుకు పంపాలని భావిస్తుంది.తనకు ఏం తెలియనట్లు మనీషా పిల్లలు ఏరని అడుగుతుంది. తనకు వర్కు అందని అమ్మదగ్గరకు వెళ్లారని మిత్ర చెబుతాడు. నీకు వర్కు ఉంటే లక్ష్మీ కూడా ఇక్కడికి రాదేమో అంటుంది. జ్యూస్ మిత్రాకు ఇవ్వగా...తనకు వద్దని చెబుతాడు. ఆ జ్యూస్ మొత్తం మనీషానే తాగేస్తుంది. మిత్ర ఫైల్ చూస్తుండగా...అందులో వివరాలు ఫోన్‌లో ఫొటోలు తీయడానికి మనీషా ప్రయత్నిస్తుండగా ఆమె కడుపులో గడబిడ మొదలవుతుంది. వాంతులు అయ్యేలా ఉండటంతో వెంటనే బాత్‌రూంలోకి పరుగెడుతుంది. బయటకు వచ్చిన తర్వాత చాలా నీరసంగా మారిపోతుంది.ఏమైందని మిత్రా అడిగితే ఒంట్లో బాగాలేదని...తాను తన రూంకి వెళ్లిపోతానని చెప్పి మనీషా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.ఇదంతా గోడపక్కనే ఉండి లక్ష్మీ గమనిస్తూ ఉంటుంది.
ఈలోగా బయట దేవయాని సంబరాలు చేసుకుంటుంది. ఈ రాత్రికి మిత్ర, మనీషా ఒక్కటవుతారని ఆశపడుతుంది.అప్పుడే మనీషా వాంతులు చేసుకుంటూ బయటకు రావడం గమనించి..ఏమైందని అడుగుతుంది. తన రూంలోకి వెళ్లి మరోసారి మనీషా వాంతు చేసుకుంటుంది. నీకు మిత్రకు మధ్య ఏం జరగలేదన్నావ్ కదా...వాంతులు ఎలా వస్తున్నాయన దేవయాని నిలదీస్తుంది.ఎవరు వాడు...ఎన్నాళ్ల నుంచి సాగుతుందని నిలదీస్తుంది. దీంతో మనీషా దేవయానిపై కోపంతో రగిలిపోతుంది. జ్యూస్‌లో ఏదో కలిపి లక్ష్మీ ఇవ్వడం వల్లే వాంతులు అవుతున్నాయని చెబుతుంది. ఈ వ్యవహారం ఇంతటితో వదిలేది లేదని దేవయాని అందరినీ పిలుస్తుంది. అరవింద వచ్చి ఏం జరిగిందని అడగ్గా...నా కడుపులో బిడ్డను నాశనం చేసేందుకు లక్ష్మీ కుట్రలు పన్నిందని...జ్యూస్ అడిగితే అందులో ఏదో కలిపి ఇచ్చిందని అప్పటి నుంచి వాంతులు అవుతున్నాయని చెబతుంది. దీంతో జనార్ధన్ పిచ్చిపిచ్చిగా మట్లాడొద్దని అరవగా...దేవయాని అడ్డుపడి నిజమేనని లక్ష్మీనే జ్యూస్‌లో ఏదో కలిపి ఇచ్చేసిందని చెబుతుంది. మనీషాను చంపడానికే ఇలాంటి ప్లాన్ వేసిందని చెబుతుంది. మధ్యలో అడ్డుపడిన మిత్రా....లక్ష్మీ అలాంటిది కాదని చెబుతాడు. మరి లక్ష్మీ ఇచ్చిన జ్యూస్ తాగిన తర్వాతే తనకు వాంతులు అయ్యాయని మనీశా చెబుతుంది.
అరవింద లక్ష్మీని నిలదీస్తుంది. మనీషాకు జ్యూస్ ఇచ్చావా అని అడగ్గా...జ్యూస్ ఇవ్వడం వరకు నిజమేనని అందులో తాను ఏం కలపలేదని చెబుతుంది.మరి వాంతులు ఎందుకు అవుతున్నాయని అడగ్గా...ఆమె కడుపుతో ఉందని చెప్పింది కాబట్టి వాంతులు అవుతున్నాయేమోనంటుంది. కడుపుతో ఉన్నవాళ్లుకు వేవిల్లు సహజమేనని జానూ,వివేక్ కూడా మాట కలుపుతారు. లేదు ఇవి వేవిల్లు కాదు జ్యూస్ తాగడం వల్లే వచ్చాయని అనడంతో...లక్ష్మీ నువ్వు నిజంగా ప్రెగ్నెంట్ కాదా అంటూ నిలదీస్తుంది. దేవయాని మధ్యలో కల్పించుకుని మనీషా ప్రెగ్నెంటేనని అనడంతో....అందరూ ఆ వాంతులు కూడా జ్యూస్ వల్ల వచ్చినవి కాదని...వేవిల్ల వల్లేనని అంటారు. రూంకు వెళ్లి రెస్ట్ తీసుకుంటే తగ్గిపోతాయని చెప్పి అందరూ అక్కడి నుంచి వెళ్లిపోతారు. అప్పుడే అక్కడికి వచ్చిన లక్ష్మీ...మరో స్పెషల్ జ్యూస్ ఏమైనా కావాలా అని ఆటపట్టిస్తుంది. వాంతులు చేసుకునిచేసుకుని కళ్లు తిరిగి లక్ష్మీ కాళ్లపై పడిపోతుంది మనీషా.. పైకి లేపి తనకు గట్టిగా క్లాస్ పీకుతుంది లక్ష్మీ...ఇంకోసారి తనజోలికి,పిల్లల జోలికి వస్తే నా రియాక్షన్ ఇలాగే ఉంటుందని అంటుంది.ఇది నీకు శాంపిల్ మాత్రమేనని...ఇంతటితో నువ్వు ఆగితే సరేసరని లేదంటే మున్ముందు నువ్వు ఇలాంటి మరుపురాని రాత్రులు ఎదుర్కోవాల్సి ఉంటుందంటుంది. నువ్వు మిత్రా ప్రేమికురాలివని చెప్పుకుంటున్నావ్...ఆయన ఏ జ్యూస్ తాగుతారో లేదో కూడా తెలియదా అంటుంది. ఆయన ఆ జ్యూస్ తాగరని తెలిసే....నీకు అందులో మందు కలిపి ఇచ్చానని చెబుతుంది. నువ్వు రోమాంటిక్ మూడ్‌లో ఉండి నేను జ్యూస్‌లో ఏం కలుపుతున్నానో గమనించలేదంటుంది. అతిగా ఆశపడిన ఆడది జీవితంలో పైకి వచ్చినట్లు చరిత్రలో లేదంటూ సెటైర్లు వేయడంతో ఈరోజు ఏపిసోడ్ ముగిసిపోతుంది.