ఓంకార్ యాంకర్‌గా ప్రసారమైన ‘ఆట’ సీజన్-1 షోలో విన్నర్‌గా నిలిచిన టీనా సాదు మృతి చెందినట్లు కొరియోగ్రాఫర్ సందీప్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు.


‘జీ’ తెలుగులో ప్రసారమైన ఈ షోలో టీనా.. సందీప్‌కు కో-పార్టనర్. ఈ సందర్భంగా సందీప్ ఆమె మరణంపై సంతాపం వ్యక్తం చేస్తూ ఇన్‌‌స్టాగ్రామ్ ద్వారా టీనాకు నివాళులు అర్పించాడు. ‘‘టీనా మరణ వార్త నన్ను షాక్‌కు గురిచేసింది. ఎంతో బాధించింది. ‘జీ-తెలుగు’లో ప్రసారమైన ఆట-1 డ్యాన్స్ రియాలిటీ షోలో ఆమె నాకు కో-పార్టనర్. ఆమె కుటుంబానికి సంతాపం వ్యక్తం చేస్తున్నాను. రెస్ట్ ఇన్ పీస్ టీనా’ అని పేర్కొన్నాడు. 


Also Read: 'సర్కారు వారి పాట' రివ్యూ: అయ్యో, మహేషా.. ఇలా చేశావేంటయ్యా!


36 ఏళ్ల వయస్సులోనే టీనా మృతి చెందడం ఆమె అభిమానులను, సన్నిహితులను బాధిస్తోంది. అయితే, ఆమె మరణానికి గల కారణాలు తెలియరాలేదు. ‘ఆట’ షో విజేతగా నిలిచిన తర్వాత ఆమె కొన్ని సినిమాలకు కొరియోగ్రాఫర్‌గా వ్యవహరించారు. ఆ తర్వాత ‘ఆట’ సీజన్-4కు జడ్జిగా వ్యవహరించారు. ఆ తర్వాత మళ్లీ ఆమె కనిపించలేదు. ప్రస్తుతం ఆమె గోవాలో నివసిస్తోంది. తన ఇన్‌స్టాగ్రామ్‌‌ అకౌంట్‌లో కూడా ఏప్రిల్ 18 నుంచి ఎలాంటి పోస్టులు లేవు. చివరి పోస్టులో ఆమె బీచ్‌లో పరిగెడుతున్న వీడియో ఉంది. ఆమె ఆకస్మిక గుండె నొప్పితో చనిపోయినట్లు తెలిసింది. ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. 






టీనా ఆఖరి పోస్ట్ ఇదే:






Also Read: మూన్ నైట్ వెబ్ సిరీస్ రివ్యూ: హాలీవుడ్ అపరిచితుడు ఎలా ఉన్నాడంటే?