మే 12 గురువారం గుప్పెడంతమనసు ఎపిసోడ్


తన రూం సర్దుతున్న వసుధార చదువు సంగతిపై ఆరా తీస్తాడు రిషి. చదువుపై శ్రద్దపెట్టాలంటాడు. గాలి పీల్చుకోవడం మానేస్తానేమో గానీ చదువు సంగతి మాత్రం మర్చిపోనంటుంది. ఇలా చాలా కూల్‌గా డిస్కషన్ జరుగుతున్నప్పుడు వసుధార మనసు తన స్థానమేంటో తెలుసుకోవాలనుకుంటాడు రిషి. ఇంతలో హార్ట్ సింబల్ ఉన్న బొమ్మ పై నుంచి పడుతుంది. అదేంటని అడుగితే... హార్ట్ అని రిషి సమాధానం చెబుతాడు. జాగ్రత్త సార్‌ మళ్లీ కింద పడుతుందని కౌంటర్ ఇస్తుంది వసుధార. నిన్నో విషయం అడుగుదామనుకుంటున్నాను వసుధార అంటాడు. ఇంతలో సాక్షి కాలేజీలోకి రావడం చూసిన రిషి..వసుని తీసుకుని లైబ్రరీకి అక్కడి నుంచి బయటకు ఎస్కేప్ అవుతాడు.  సాక్షి వచ్చి రిషి కోసం ఆరా తీస్తుంది. లేడని తెలుసుకుని కాల్ చేస్తుంది. ముందుగా కాల్ కట్ చేసిన రిషి...ఆ తర్వాత స్విచ్చాఫ్ చేసేస్తాడు.  ఎంత దూరం పెట్టాలని చూస్తే అంత దగ్గరవుతానంటూ అక్కడి నుంచి వెళ్లిపోతుంది సాక్షి.  


కారు ఓ దగ్గర ఆపి కిందకు దిగమంటాడు 
రిషి: ఇష్టానికి అయిష్టానికి తేడా ఏంటి
వసుధార: అంతా ఒక అక్షరం తేడా అనుకుంటారు కానీ ఓ జీవితం సార్. అయిష్టమైతే ఎంత చిన్న పని అయినా చేయలేమని... ఇష్టమైన పని ఎంత కష్టమైన ఈజీగా చేస్తామంటుంది. 
రిషి: చాలా గొప్పగా చెప్పావు వసుధార . ఈ సమాధానం విన్నాక నాలో ఉన్న కన్ఫ్యూజన్ క్లియర్ అయింది. నీకు తెలియకుండానే గొప్ప ప్రశ్నకు సమాధానం ఇచ్చావంటాడు. ఏంటీ ఎందుకని వివరాలు అడక్కు అని కండిషన్ పెడతాడు. నాకో మాట ఇవ్వాలని రిక్వస్ట్ చేస్తాడు రిషి. నా అయిష్టాన్ని నా నుంచి దూరం చేయడానికి నువ్వు సాయం చేస్తావా అని అడుగుతాడు రిషి.  కాసేపు వసు మొహం చూసి కార్లో కూర్చునేందుకు వెనుతిరుగుతాడు...
వసు: వెళ్లిపోతున్న రిషి చేయి పట్టుకుని ఆపిన వసుధార...అలాంటి పరిస్థితి రాకూడదనే కోరుకుంటానని... ఒక వేళ మనసుకు నచ్చని విషయాలు ఏమైనా జరిగితే మీ అయిష్టాన్ని దూరం చేసే విషయంలో మీకు సపోర్ట్ చేస్తానంటూ మాట ఇస్తుంది. 
రిషి: మనం ఈ ఒప్పందం చేసుకున్నందుకు పార్టీ చేసుకుందామంటాడు రిషి. 
వసుధార: బ్యాగ్ నుంచి ఫైవ్‌స్టార్ చాక్లెట్ తీసి ఇస్తుంది. 
మనసులో వసుధారకు థాంక్స్ చెప్తాడు రిషి. నాలో కూడా ఏదో తెలియని ఆనందం కలుగుతోందని మనసులో అనుకుంటుంది వసుధార. 


జగతి-మహేంద్ర: వసుధార రూంలో జగతి, మహేంద్ర వచ్చి వసుధార కోసం వచ్చి ఎదురు చూస్తుంటారు. పుస్తకాలు చూస్తుంటే అక్కడ కూడా లవ్‌ లెటర్‌ కనిపిస్తుంది. ఒకే లా ఉంటే రెండు లెటర్స్‌  చూస్తూ మహేంద్ర వాళ్లిద్దర్నీ ఇమిటేట్ చేస్తూ జగతిని కాసేపు నవ్విస్తాడు. గౌతమ్ ఇచ్చిన బొమ్మ(రిషీ గీసిన వసు బొమ్మ)ని కూడా చూస్తారు. వీళ్లు ఇద్దరూ దొంగలే మహేంద్రా.. అని నవ్వుకుంటారు. ఇక వసు రాగానే.. ఆ బొమ్మని గౌతమ్ ఇచ్చారని చెప్పి ఏం జరిగిందో చెబుతుంది. నీకు దేవుడు తెలివి , ధైర్యం ఇచ్చాడు అదే నీకు జీవితంలో దారి చూపుతుందంటుంది జగతి.  రిషి ఏంటో కొన్ని మనసులో దాచుకుంటాడు ఆ అలవాటు నీక్కూడా వచ్చినట్టుందని సెటైర్ వేస్తాడు మహేంద్ర. ఇంతలో జగతి ....నీకో గిఫ్ట్ పంపిస్తాను చూసుకో వసుధారా’ అంటూ మహేంద్ర సెల్ నుంచి రిషి ప్రేమ లేఖని పంపిస్తుంది. మహేంద్ర, జగతిలు వెళ్లిపోతారు. కార్లో వెళుతూ...ఎంతకాలం వాళ్లు దాగుడు మూతలు అడుతారు, ఎవరో ఒకరు బయట పడాలి కదా అనుకుంటారు.   అంతా మంచే జరగాలని కోరుకుందాం అంటాడు మహేంద్ర...


ప్రేమ లేఖని ప్రింట్ తీయించి.. తన బొమ్మని, ఆ ప్రేమ లేఖని పక్కన పెట్టుకుని.. ‘ఎవరు? ఇద్దరూ వేరు వేరా? లేక ఒకరేనా? ఆ ఒక్కరూ ఎవరు?’ అంటూ ఆలోచనలో పడుతుంది. ఈ రెండింటిలోనూ ఏదో తెలియని అభిమానం కనిపిస్తోందనుకుని మురిసిపోతూ ఉంటుంది. 


రేపటి (శుక్రవారం) ఎపిసోడ్ లో
నీ బొమ్మ బావుందక్కా ఈ బొమ్మని అందరికీ చూపిస్తాంటూ ఓ పిల్లాడు తీసుకెళ్లిపోతాడు..వాడి వెనుకే పరిగెత్తుతుంది. ఇంతలో ఆ బొమ్మ చించేయడంతో ఏడుస్తుంది వసుధార. ఎవరో తెలియని వ్యక్తి గీసిన బొమ్మ గురించి ఎందుకు బాధపడుతున్నావ్ అని రిషి అంటే..ఎవరో తెలియకపోయినా తనపై నాకు గౌరవం ఉందంటుంది వసు.