Anchor Suma With 90s Middle Class Team: ఓటీటీలకు ఆదరణ పెరగడంతో సినిమాలకు ధీటూగా వెబ్ సిరీస్‌లు వస్తున్నాయి. భాషతో సంబంధం లేకుండా ఓటీటీల్లో వెబ్ సిరీస్‌లు, సినిమాలు అలరిస్తున్నాయి. మౌత్ టాక్‌తోనే ఊహించని విజయం సాధిస్తున్నాయి. కంటెంట్ బాగుంటే చాలు సంచలనం అవుతున్నాయి. దీంతో వెబ్ సిరీస్‌లకు క్రేజ్ పెరిగిపోయింది. అలా మిడిల్ కంటెంట్‌తో వచ్చి ప్రస్తుతం ఇండస్ట్రీ టాక్‌గా మారింది ఓ వెబ్ సిరీస్. బిజీ బిజీ లైఫ్‌తో పరుగులు తీస్తున్న నేటి తరానికి వెనక్కి తీసుకెళ్లి 90లోని మధుర జ్ఞాపకాలను కళ్లముందుకు తీసుకువస్తోంది ఈ '90s ఏ మిడిల్ క్లాస్' బయోపిక్.
ప్రస్తుతం 90s కిడ్స్, 2k కిడ్స్ అంటూ సోషల్ మీడియాలో ఫన్నీ మీమ్స్ వస్తున్న క్రమంలో ఈ బయోపిక్ 90s కిడ్స్‌కి నోస్టాల్జిక్ ఫీలింగ్ ఇచ్చేలా.. ఓ పదిహేనేళ్లు వెనక్కి తీసుకెళ్లి వారి స్కూల్ డేస్‌ను గుర్తు చేస్తోంది. మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్, 90s కిడ్సి ఈ వెబ్ సిరీస్ బాగా కనెక్ట్ అవుతున్నారు. అలా ఎలాంటి అంచనాలు లేకుండా సైలెంట్‌గా ఓటీటీకి వచ్చిన ఈ వెబ్ సిరీస్ ఇప్పుడు ట్రెండింగ్‌లో నిలిచింది. ఏ సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలు చూసిన 90s ఏ మిడిల్ క్లాస్ క్లిప్సే దర్శనం ఇస్తున్నాయి.
సుమ అడ్డాలో '90s ఏ మిడిల్ క్లాస్' ఫ్యామిలీ సందడి
సినీ ప్రియులంతా ప్రస్తుతం 90s ఏ మిడిల్ క్లాస్ వెబ్ సిరీస్ గురించే మాట్లాడుకుంటారు. అంతగా విజయం సాధించిన ఈ వెబ్ సిరీస్ ప్రధాన పాత్రలు తాజాగా ఓ షో సందడి చేశాయి. యాంకర్ సుమ నిర్వహిస్తున్న ప్రముఖలో షో సుమా అడ్డాలో నటుడు శివాజి, నటి వాసుకి, చైల్డ్ ఆర్టిస్ట్‌లు అనందం, మౌలి, రోహన్‌లు పాల్గొన్నారు. తాజాగా ఈ షోకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో సుమతో కలిసి శివాజి చేసిన హంగామా అంతా ఇంతా కాదు. చైల్డ్ ఆర్టిస్ట్‌తోత సుమ చేసిన అల్లరి నెక్ట్స్ లెవల్ అని చెప్పాలి.
ప్రోమో ప్రారంభంలోనే ఎప్పటిలాగే సుమ తన వయసుని కవర్ చేసుకునే ప్రయత్నం చేయగా.. శివాజీ తన స్టైల్లో పంచ్‌లు విసిరాడు. "నేను అప్పటి జనరేషన్ కాకపోయినా.. 90s ఏ మిడిల్ క్లాస్‌కు మంచి రెస్పాన్స్ వచ్చిందంటూ చెప్పుకురాగా.. అదే.. మీరు మా కంటే ముందు జనరేషన్ వారు అయినా.. అని నేను అనను" అంటూ సుమకు నోటికి తాళం వేశాడు. అంతలో శివాజీకి ఫోన్ రాగా.. పల్లవి ప్రశాంత్ అంటూ సుమ శివాజిని ఆట పట్టించింది. ఇక ప్రొమో మొత్తం సంక్రాంతి పండుగ థీమ్ నేపథ్యంలో సాగింది.
ఇందులో సుమ ఫార్నర్ క్యారెక్టర్ వేయగా 90s ఏ మిడిల్ క్లాస్ టీం తెలుగు ఫ్యామిలీలా నటించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా ఇండియా వచ్చిన ఫార్నర్ సుమ ఇక్క సంప్రదాయాలు, ఎద్దు చూసి ఆశ్చర్యపోతుంటే ఆమెకు వాటి గురించి వివరిస్తుంటాడు శివాజీ అండ్ ఫ్యామిలీ. ఈ క్రమంలో వారి మధ్య జరిగే సరదా సంభాషణ, పంచ్‌లు కడుపుబ్బా నవ్విస్తుంటాయి. సుమా కామెడీ పంచ్, డైలాగ్స్‌కి శివాజీ సటైరికల్ కామెంట్స్ తోడు కావడంతో ప్రోమో మొత్తంగా ఫుల్ ఫన్నీగా సాగింది. అలా సుమ అడ్డాలో 90s మిడిల్ క్లాస్ ఫ్యామిలీ సంక్రాంతి పండుగ సంబరాలు చూపించారు.
Also Read: పాపం యశ్ - బాధను మిగిల్చిన బర్త్ డే, రెండు రోజుల్లో నలుగురు మృతి, హీరో వాహనం కిందే పడి..