Jabardasth Latest Promo: తెలుగు బుల్లితెరపై గత కొద్ది సంవత్సరాలుగా కామెడీని పంచుతున్న పాపులర్ షో ‘జబర్దస్త్’. గతంలో ‘జబర్దస్త్’, ‘ఎక్స్‌ ట్రా జబర్దస్త్‌’ పేరుతో వారానికి రెండు రోజులు కామెడీతో నవ్వులు పుట్టించిన ఈ షో, ఇప్పుడు ‘జబర్దస్త్’ షో పేరుతో శుక్ర, శని వారాలు ఎంటర్ టైన్మెంట్ అందిస్తోంది. తాజా ఎపిసోడ్ కు సంబంధించి ప్రోమో విడుదలైంది. ఎప్పటిలాగే ఈ వారం కూడా అదిరిపోయే ఫన్ తో ఆకట్టుకోనుంది.


భాస్కర్ పంచులు, రాఘర రివర్స్ పంచులు..


ప్రోమో ప్రారంభం కాగానే, డ్యాన్స్ చేస్తున్న రాఘవను చూసి “ఎయ్, ఎయ్” అంటాడు. “వచ్చిరాగానే  ఎయ్ ఎయ్ అంటున్నాడు. ఇవాళ ఏస్తా చూడు” అంటూ రాఘవ పంచ్ వేస్తాడు. దానికి బుల్లెట్ భాస్కర్ “56 ఛేజ్ చేశావ్.. ఇంకా సిగ్గురాలేదా? మీకు” అంటూ కౌంటర్ వేస్తాడు. “ఒకటి గుర్తు పెట్టుకోండి భాస్కర్ గారు.. నలుగురినీ నవ్వించడం అంటే.. నలుగురిని మెయింటెయిన్ చేయడం అంత ఈజీ కాదు. జిమ్ కు వెళ్తే కండలొస్తాయి.. కామెడీ రాదని గుర్తు పెట్టుకొవాలి” అంటూ రివర్స్ పంచులు వేస్తాడు. దీంతో అందరూ నవ్వుతారు.


అదరిపోయే కామెడీతో ఆకట్టుకున్న టీమ్ లు


ఇక ఆటో రామ్ ప్రసాద్ టీమ్ చేసిన కామెడీ అందరినీ నవ్వించింది. గే అయిన దొరబాబును ప్రేమించి.. పెళ్లి చేసుకుంటానని కుటుంబ సభ్యులకు చెప్పడంతో అందరూ షాక్ అవుతారు. ఇక తాగుబోతు రమేష్, నూకరాజు టీమ్ చేసిన కామెడీ ఫుల్ ఫన్ జెనరేట్ చేస్తుంది. ‘బాషా’ సినిమాలో రజనీకాంత్ క్యారెక్టర్ ను నూకరాజు చేసి అందరినీ నవ్విస్తాడు. ఫుడ్ ఇన్స్పెక్టర్  బుల్లెట్ భాస్కర్ పెళ్లి చూపులకు వెళ్లి చేసే కామెడీ ఆకట్టుకుంటుంది. నాటీ నరేష్, ఫైమా చేసే స్పాంటేనియస్ పంచులు నవ్వుల పువ్వులు పూయించాయి.


Also Read: వేణు స్వామికి అండగా ఆయన భార్య వీణశ్రీవాణి - మీడియా, జర్నలిస్ట్‌లపై ఫైర్‌.. వీడియో వైరల్‌



రాఘవపై జడ్జీల ఆగ్రహం


ఇక ఇమ్మాన్యుయేల్ స్కిట్ చేస్తున్న టైమ్ లో పదే పదే రఘవ అంతరాయం కలిగించడం పట్ల ఇమ్మన్యుయేట్, బుల్లెట్ భాస్కర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తారు. “రాఘవ గారు.. వయసులో పెద్దవారు అని గౌరవిస్తున్నా.. “ అంటూ మండిపడతారు. అటు చేసిన తప్పుకు రాఘవ క్షమాపణలు కోరుతాడు. ఫుల్ కు ఫుల్ మార్కులు ఇవ్వాలని జడ్జిలను కోరుతాడు. తోటి కంటెస్టెంట్ల స్కిట్లలో వేలు పెట్టడమే కాకుండా, జడ్జిమెంట్ లో కూడా వేలు పెడతారా? అంటూ జడ్జీలు సీరియస్ అవుతారు. మొత్తంగా ఈ వారం వివాదాలు, కామెడీతో బుల్లితెర అభిమానులు ఎంజాయ్ చేయనున్నారు. ఈ షో ఆగష్టు 16, 17న టెలీకాస్ట్ కానుంది. ప్రస్తుతం ఈ ప్రోమో సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది.


Also Read'కల్కి 2898 ఏడీ'... వచ్చే వారమే ప్రైమ్ వీడియో ఓటీటీలోకి... అఫీషియల్ రిలీజ్ డేట్ వచ్చేసింది



Also Readమిస్టర్ బచ్చన్ వర్సెస్ డబుల్ ఇస్మార్ట్... రవితేజ కంటే రామ్ సినిమాకు ఎక్కువ క్రేజ్... బిజినెస్ కూడా ఎక్కువేనా?