Venu Swamy Wife Fires on Media: నాగచైతన్య-శోభిత ధూళిపాళ ఎంగేజ్‌మెంట్‌ తర్వాత ప్రముఖ జ్యోతిష్యుడు వేణుస్వామి హాట్‌టాపిక్‌గా నిలిచారు. వీరిద్దరి వైవాహిక జీవితంపై జ్యోతిష్యం చెప్పి సంచలనంగా మారారు. సమంత-నాగచైతన్య మాదిరిగానే నాగచైతన్య-శోభితల జాతకం కలవలేదని, వీరద్దరు కూడా ఎక్కువ కాలం కలిసి ఉండలేరంటూ చెప్పి ఫ్యాన్స్‌ ఆగ్రహానికి గురయ్యారు. దీంతో సోషల్‌ మీడియాలో ఆయనపై ట్రోలింగ్‌ మొదలైంది.  ఈ విషయమై మా అసోసియేషన్‌ అధ్యక్షుడు మంచు విష్ణు కూడా ఆయనకు ఫోన్‌ చేసి మాట్లాడినట్టు స్వయంగా వేణు స్వామి చెప్పారు.


జర్నలిజం అర్థమే మార్చేశారు


అంతేకాదు వేణుస్వామిపై తెలుగు ఫిల్మ్ జరలిస్టుల అసోసియేషన్.. తెలుగు ఫిల్మ్ డిజిటల్ మీడియా అసోసియేషన్ కలిసి పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించుకున్నారు. ఈ నేపథ్యంలో తన భర్తకు మద్దతుగా ఆయన భార్య వీణశ్రీవాణి నిలిచారు. తాజాగా ఆమె వీడియో రిలీజ్‌ చేశారు. ఈ మేరకు ఆమె మాట్లాడుతూ.. "నేను ఈ వీడియో చేయడానికి కారణం మీడియా. వీణశ్రీవాణిగా మాట్లాడటం లేదు. ఓ సీనియర్ జర్నలిస్ట్‌గా మాట్లాడుతున్న. ఒకప్పుడు ఎన్నో టెస్ట్‌లు పాస్‌ అయితేనే జర్నలిస్ట్‌ అనేవారు. కానీ ఇప్పుడు ఒకటి రెండు వీడియో చేస్తే చాలు జర్నలిస్ట్‌లు అయిపోతున్నారు. అసలు ఈ కాలం జర్నలిజంకు అర్థమే మారిపోతుంది. లైవ్‌లో బీప్స్‌ లేకుండానే బూతులు వేస్తున్నారు. ఇవన్ని కూడా పేరున్న సో కాల్డ్‌ మీడియా చానళ్లే చేస్తున్నాయి.






మీడియాపై ఫైర్


అలాంటి సెలబ్రిటీల జ్యోతిష్యం చెప్పిన వ్యక్తి మీద గంటలు గంటలు డిబెట్‌లు పెడుతున్నారు. అది అంత పెద్ద తప్పుగా చూస్తున్నారు. కానీ, గత నెల రోజులుగా మీ మీడియా చేస్తుందేంటి? రాజ్‌ తరుణ్‌-లావణ్య కేసుపై డిబెట్‌ మీద డిబెట్‌లు పెడుతున్నాయి. పెద్ద పెద్ద చానళ్లే బీప్స్‌ లేకుండ అన్ని బూతులు వేస్తున్నాయి. వాళ్లకు పర్సనల్‌ లైఫ్స్‌ ఉండవా? వారికి ఫ్యామిలీస్‌ లేవా? ఒక్క శాటిలైట్‌ ఛానలైనా 24 గంటల్లో యూత్‌కి పనికి వచ్చేవి ఏమైనా వేస్తున్నాయి. జాబ్‌ నోటిఫికేషన్స్‌ కానీ, ఆడవాళ్ల సెక్యూరిటీ గురించి కానీ చెబుతున్నాయా?. ఈ విషయాన్ని యూత్‌ గమనించాలి. అసలు ఏ ఛానల్‌ అయినా సెలబ్రిటీలను వదులుతుందా? వారిని ఎయిర్‌పోర్టులో బతకనివ్వరు, ఫ్యామిలీతో షాపింగ్‌ చేయనివ్వరు. వారు ఎక్కడ కనిపిస్తే అక్కడ వెంటపడుతుంటారు.


వీటికి తెరలేపిందే మీడియా..!


ఇదంత చేసేది సో కాల్డ్ మీడియా కాదా. అసలు సెలబ్రిటీలు బయట ఎవరితో అయినా కనిపిస్తే చాలు వాళ్ల వెంటపడుతున్నారు. వారి గురించి ఎన్నో పుకార్లు సృష్టిస్తున్నారు" అంటూ ఆమె మండిపడ్డారు. అనంతరం మా అధ్యక్షుడు మంచు విష్ణు గారు నాకు కాల్‌ చేశారనీ, ఆయన చాలా బాగా మాట్లాడారన్నారు. కానీ, ఓ సినిమా మీద వందల కుటుంబాలు బతుకుతున్నాయి. అలాంటి సినిమాపై ముందే రివ్యూస్‌ ఇచ్చి మూవీని భ్రష్టు పట్టిస్తున్న వారిపై ఎలాంటి చర్యలు తీసుకోరా? అని ఆమె ప్రశ్నించారు. ఎందుకు అందులో కూడా జర్నలిస్టు ఉన్నారని భయపడుతున్నారా?. తప్పు చేస్తే జర్నలిస్ట్‌ ఎంటీ ఎవరిపై అయినా చర్యలు తీసుకోవాల్సిందే అని ఆమె పేర్కొన్నారు.



అలాగే అసలు ఇలాంటి వాటికి తెరతీసింది కూడా మీడియానే.. 2009 నుంచి ఓ పెద్ద రాజకీయనేత అనారోగ్యంతో ఆస్పత్రిపాలైతే ఆయన బతుకుతాడా? లేదా ఓ వైపు జ్యోతిష్యులు, మరోవైపు డాక్టర్లతో డిబెట్‌లు పెట్టించారు. అదీ ప్రముఖ షో కాల్డ్‌ మీడియా ఛానళ్లే. ఇండియా మ్యాచ్‌ అయితే గెలుస్తుందా? లేదా? అని ఓ వైపు జ్యోతిష్యులు అనలిస్టులతో డిబెట్‌లు. మళ్లీ అందులో కూడా వేణు స్వామి ఉండాల్సిందే. ఇవన్ని కూడా మీడియానే చేసి ఇప్పుడు సెలబ్రిటీల జీవితంపై నెగిటివ్ కామెంట్స్‌ ఏంటని ఇతరుల మీద పడేది కూడా వాళ్లేనా?" అంటూ ఆమె మీడియాకు ఇచ్చిపడేసింది. ప్రస్తుతం ఆమె కామెంట్స్‌ వైరల్‌ అవుతున్నాయి. 


Also Read: 'డబుల్‌ ఇస్మార్ట్‌'ను నైజాంలో రిలీజ్‌ చేసేది వీరే! - అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది