‘జానకి కలగనలేదు’ సీరియల్ నటుడు అమర్ దీప్, 'C/Oఅనసూయ' నటి తేజశ్విని గౌడల వివాహం గురువారం ఘనంగా జరిగింది. తేజశ్విని ప్రస్తుతం ‘కోయిలమ్మ’ సీరియల్ లో నటిస్తోంది. వీరి పెళ్లికి బుల్లితెర నుంచి పలువురు సెలబ్రెటీలు హాజరై కొత్త జంటకు శుభాకాంక్షలు తెలియజేశారు. వీరి పెళ్లికి సంబంధించిన వీడియోను తేజస్విని తన యూట్యూబ్ చానెల్ లో అప్లోడ్ చేసింది. ఇప్పుడీ వీడియోకు మిలియన్స్ లో వ్యూస్ వస్తున్నాయి. ఈ వీడియో చూసి అమర్ దీప్-తేజస్వినికి కంగ్రాట్స్ చెప్తున్నారు నెటిజన్స్.
అమర్ దీప్, తేజశ్వినిల పెళ్లి గ్రాండ్ గా ఐదు రోజుల పండుగలా జరిగింది. ఈ పెళ్లి వేడుకల్లో మెహందీ, సంగీత్, హల్దీ, పెళ్లి కూతురు, పెళ్లి కొడుకు ఫంక్షన్లు జరిగాయి. వీటితో పాటు బంధుమిత్రుల కోసం రిసెప్షన్ ను కూడా భారీగానే ఏర్పాటు చేశారు. అమర్ దీప్-తేజస్విని పెళ్లిలో బుల్లితెర సెలబ్రిటీలు సందడి చేశారు. వీరి పెళ్లికి ‘జానకి కలగనలేదు’ సీరియల్ యూనిట్ మొత్తం హాజరయ్యింది. ఈ పెళ్లిలో జానకి అలియాస్ ప్రియాంక జైన్ ప్రత్యేక ఆకర్షణ గా నిలిచింది. ఆమెతో పాటు ఈ సీరియల్‌లో నటించిన మల్లిక, వెన్నెల, అఖిల్, చికీతా కూడా సందడి చేశారు. అలాగే ‘కోయిలమ్మ’, ‘మనసిచ్చిచూడు’ సీరియల్స్ నుంచి పలువురు నటీనటులు ఈ పెళ్లిలో కనిపించారు.
ఇక వీరి ప్రొఫెషన్ విషయానికొస్తే.. అమర్ దీప్ షార్ట్ ఫిల్మ్ నుంచి టీవీ రంగంలోకి వచ్చాడు. 2016లో షార్ట్ ఫిల్మ్ తో కెరీర్ ప్రారంభించాడు. తర్వాత సూపర్ మచ్చి, రాజధాని లవ్ స్టోరీ వంటి కొన్ని వెబ్ సిరీస్ లలో నటించి మెప్పించాడు. తర్వాత 'ఉయ్యాలా జంపాల' సీరియల్ తో తెలుగు టీవీ రంగంలోకి అడుగుపెట్టాడు. అలాగే ‘సిరిసిరి మువ్వలు’ సీరియల్ తో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ‘జానకి కలగనలేదు’ సీరియల్ లో హీరీగా నటిస్తూ మెప్పిస్తున్నాడు. అమర్ దీప్ పలు సినిమాల్లో కూడా నటించాడు. ‘కృష్ణార్జున యుద్ధం’, ‘శైలజరెడ్డి అల్లుడు’, ‘సారధి’, ‘ఎవరు’ సినిమాల్లో కనిపించాడు.
ఇక తేజస్విని కూడా సీరియల్ రంగంలో రానిస్తోంది. తెలుగు, కన్నడ, తమిళంలో టీవీ సీరియల్స్ నటిస్తోన్న తేజస్విని తెలుగులో ‘కోయిలమ్మ’ సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకుంది. అంతే కాదు సోషల్ మీడియాలోనూ ఈమెకు మంచి ఫాలోయింగ్ ఉంది. ఓ యూట్యూబ్ చానెల్ కూడా రన్ చేస్తుంది. ప్రస్తుతం 'C/Oఅనసూయ' సీరియల్ లో నటిస్తోంది.
Also Read: ‘అవతార్ 2’కు ఎందుకంత క్రేజ్ - ఈ 10 విషయాలు తెలిస్తే మైండ్ బ్లాక్ పక్కా!