Amazon Prime Update: ‘టక్ జగదీష్’ సర్‌ప్రైజ్.. పేరు మార్చుకున్న ‘అమెజాన్ ప్రైమ్’, మీరూ మార్చుకోవాలంటూ..

అమెజాన్ ప్రైమ్ వీడియో నాని సినిమా కోసం ట్విట్టర్‌లో ప్రొఫైల్ నేమ్ ముందు ‘టక్’ చేర్చుకుని.. సర్‌ప్రైజ్ సిద్ధమవ్వండని ప్రకటించింది.

Continues below advertisement

నానీ హీరోగా నటించిన ‘టక్ జగదీష్’ సినిమా విడుదలకు సిద్ధమైన సంగతి తెలిసిందే. సెప్టెంబరు 10న అమెజాన్ ప్రైమ్ ఓటీటీ వేదికగా ‘టక్ జగదీష్’ సినిమాను విడుదల చేయనున్నట్లు.. ఇటీవలే ప్రకటించారు. ‘‘నాయుడుగారి చిన్నబ్బాయి టక్ జగదీశ్ చెబుతున్నాడు.. మొదలెట్టండి’’ అనే డైలాగ్ ప్రోమోతో తేదీని ఖాయం చేశారు. ఈ సినిమా టీజర్ ఇప్పటికే  అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలోని పాటలు సైతం ఆకట్టుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో నాని అభిమానులు.. ట్రైలర్ ఎప్పుడంటూ వెంటపడుతున్నారు. ఈ సందర్భంగా షైన్ స్క్రీన్ సంస్థ నాని వీడియోను పోస్ట్ చేసింది. 

Continues below advertisement

‘‘మీరందరూ ‘టక్ జగదీష్’ సినిమా ట్రైలర్ గురించి ఎంతగా ఎదురు చూస్తున్నారో నాకు తెలుసు. అది మీకు చిన్న సర్‌ప్రైజ్. ‘టక్ జగదీష్’  ట్రైలర్ నుంచి మీరు ఏం ఆశిస్తున్నారో ఒక్క వర్డ్‌లో కామెంట్ చేయండి. మీ కామెంట్స్ అన్నీ చదవడానికి ఎదురుచూస్తాను’’ నాని వీడియోలో కోరాడు. అంతేగాక, నాని.. అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్ పోస్ట్ చేసిన ఓ ట్వీట్‌ను కూడా షేర్ చేసుకున్నాడు. ‘టక్ జగదీష్’ ఫ్యామిలీలో భాగమయ్యేందుకు ఇదే తగిన సమయం. మీ ప్రొఫైల్ నేమ్‌ ముందు ‘టక్’ (TUCK) అని చేర్చుకోడానికి మీరు సిద్ధమేనా? అని అడిగాడు. దీంతో నాని అభిమానులు తమ పేరు ముందు ‘టక్’ చేర్చుకుని ట్రైలర్‌లో తాము ఏం ఆశిస్తున్నారనేది కామెంట్లలో చెబుతున్నారు. 

మరో విశేషం ఏమిటంటే.. టక్ జగదీష్ సినిమా కోసం ‘amazon prime video IN’.. తమ ట్విట్టర్ ప్రొఫైల్‌‌ను tuck amazon prime video IN‌గా మార్చుకుంది. ‘‘మేము నేచురల్ స్టార్ నానికి పెద్ద అభిమానులం. ఇప్పుడు మేం ‘టక్ అమెజాన్ ప్రైమ్ వీడియో ఇన్’. మీరు కూడా మీ పేరు ముందు ‘టక్’ను చేర్చుకుని సర్‌ప్రైజ్ కోసం ఎదురు చూడండి’’ అని ట్వీట్ చేసింది. అయితే, అమెజాన్ ఇచ్చే ఆ సర్‌ప్రైజ్ మరేదో కాదు, ‘టక్ జగదీష్’ ట్రైలర్. సెప్టెంబరు 1వ తేదీన ట్రైలర్ విడుదల చేసే అవకాశాలు ఉన్నట్లు సమాచారం.  

కరోనా సీజన్ మొదలైన తర్వాత నుంచి నాని తన సినిమా నిర్మాతలు ఓటీటీలో విడుదలకే మొగ్గు చూపుతున్నారు. గతంలో విడుదల చేసిన ‘వి’ సినిమా నానికి చేదు అనుభవమే మిగల్చింది. అయితే, ‘టక్ జగదీష్’ మీద భారీ అంచనాలే ఉండటంతో మరోసారి ఓటీటీలో విడుదలకు సిద్ధమవుతున్నారు. అయితే, నాగచైతన్య నటిస్తున్న ‘లవ్ స్టోరీ’ సినిమా విడుదల రోజే.. ఈ చిత్రాన్ని విడుదల చేయడంపై ఇటీవల ఎగ్జిబిటర్లు ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా, నానిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. దీంతో ‘టక్ జగదీష్’ నిర్మాతలు ఈ విషయంలో వెనక్కి తగ్గేదిలేదంటూ పట్టుదలగా సెప్టెంబరు 10నే ‘టక్ జగదీష్’ విడుదల చేస్తామని ప్రకటించారు. శివ నిర్వాణ దర్శకత్వంలో తెరకెక్కిన ‘టక్ జగదీష్’ సినిమాలో నాని సరసన రీతూ వర్మ హీరోయిన్‌గా నటించింది. ఐశ్వర్య రాజేష్, జగపతి బాబు కీలక పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమాకు తమన్ సంగీతం అందించాడు. 

Read Also: అక్కినేని ‘లవ్‌ స్టోరీ’.. నాగ్-అమలను కలిపింది రామానాయుడే! కింగ్‌ను భయపెట్టిన కిస్

Read Also: వడివేలు రీ-ఎంట్రీ.. అలా చేసినందుకే అప్పట్లో బ్యాన్, నాలుగేళ్ల తర్వాత విముక్తి!

Read Also: ‘నెట్’ ట్రైలర్: గ్లామర్ డోసు పెంచిన అవికా గోర్.. బోల్డ్ సీన్స్‌లో రాహుల్ రామకృష్ణ

Continues below advertisement