అదో అందమైన కొండకోనల ప్రాంతం. అక్కడ ఓ రైలు ట్రాక్. దాని మీద రైలు ప్రయాణిస్తూ ఉంటుంది. హఠాత్తుగా ఓ బోగీ నుంచి ఓ లవర్ బోయ్ బోగీ హ్యాండిల్‌నుపట్టుని బయటకు వేలాడతాడు. అతని మీదకు అతని ప్రేమికురాలు వాలిపోతుంది. రైలు వెళ్తూ ఉంటుంది. చుట్టూ ఆహ్లాదకమైన వాతావరణం ఉంటుంది. అలాంటి ప్రాంతంలో అడ్వంచరస్ లవ్ సీన్ అక్కడ కనిపిస్తూ ఉంటుంది. ఇదంతా కొత్తగా ప్రేమలో పడిన వారో.. ప్రేమను ఆస్వాదిస్తున్నవారికో కలలో వచ్చే సీన్. అందుకే ట్రావెల్ ఇన్‌ఫ్లూయర్స్ పేరుతో ఇది సోషల్ మీడియాలో ఇలాంటి సీన్‌లతో కూడిన ఫోటోలు వైరల్ అవుతూ ఉంటాయి. ఇప్పుడు దీన్ని చూసి సినిమా వాళ్లూ ఫిదా అయిపోతున్నారు. ఎంతగా అంటే మక్కీకి మక్కీ కాపీ కొడుతున్నారు.
రెండురోజుల క్రితం.. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ హీరోగా నటించిన "బెల్ బాటమ్" అనే సినిమా నుంచి ఓ పోస్టర్‌ను సినిమా యూనిట్ రిలీజ్ చేసింది. వెంటనే నెటిజన్లు మీమ్స్‌తో హోరెత్తించడం ప్రారంభించారు. ఎందుకంటే ఆ ఫోటో కూడా.. "ట్రావెల్స్ ఇన్‌ఫ్లూయర్స్" కాన్సెప్ట్‌దే. అక్షయ్ కుమార్‌తో కలిసి వాణీ కపూర్ సేమ్ పొజిషనలో స్టిల్ ఇచ్చారు. ప్రేమను పండించారు. అక్షయ్ కుమార్ కాపీ కొట్టారని విమర్శలు చేయడం ప్రారంభించారు.
నిజానికి అక్షయ్ కుమార్ మాత్రమే కాదు. కొద్ది రోజుల కిందట ప్రభాస్ సినిమా రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ విడుదల చేసినప్పుడు కూడా ఇదే తరహా విమర్శలు వచ్చాయి. ఎందుకంటే అక్కడ ప్రభాస్, పూజాహెగ్డే సేమ్ టు సేమ్ ఫోటోలో స్టిల్ ఇచ్చారు మరి. ఆ ఫోటో వైరల్ అయింది. అప్పుడే ఆ స్టిల్ కాపీ అంటూ సోషల్ మీడియాలో విస్తృతంగా
చర్చ జరిగింది.
రాథేశ్యామ్ విషయంలో వివాదాలు వచ్చినప్పటికీ.. అక్షయ్ కుమార్ బెల్ బాటమ్ పబ్లిసిటీని కూడా అలాంటి ఫోటోతోనే స్టార్ట్ చేయడం.. ట్రావెల్ ఇన్‌ఫ్లూయర్స్ ప్రభావం ఫిల్మ్ మేకర్స్‌పై ఎంత ఉందో అర్థం చేసుకోవచ్చని నెటిజన్లు వ్యాఖ్యానిస్తున్నారు. ఇప్పటికే అనేక మంది ప్రేమికులు... ట్రైన్ గేటు వద్ద లవర్‌తో కలిసి దిగిన ఫోటోలను సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్ట్ చేస్తున్నారు.
రాధేశ్యామ్ ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన తర్వాతనే అనేక మంది ప్రేమికులకు అలాంటి వాతావరణంలో ఫోటోలు దిగడం పెద్ద ఫ్యాషన్‌గా మారిపోయింది. ఇప్పుడు అక్షయ్ కుమార్ - వాణి కపూర్ స్టిల్ సోషల్ మీడియాను దున్నేయడం ప్రారంభించిన తర్వాత ఆ ట్రెండ్ మరింత పెరిగే అవకాశం ఉంది. ఏదైనా ప్రేమికులు అనిపిస్తే చేసేదాకా వదలరు మరి..!