గత వారం విడుదలైన 'లైగర్' సినిమా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఈ సినిమా ప్రభావం చూపకపోవడంతో అంతకముందు విడుదలైన 'కార్తికేయ2', 'బింబిసార', 'సీతారామం' సినిమాలకు ఇప్పటికీ టికెట్స్ తెగుతున్నాయి. ఈ సినిమాలన్నీ చూసేసిన ప్రేక్షకులు కొత్త సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు. వారిని అలరించడానికి ఈ వారం కొన్ని సినిమాలు రాబోతున్నాయి. 


కోబ్రా:


చియాన్ విక్రమ్ (Chiyaan Vikram) కథానాయకుడిగా నటించిన సినిమా 'కోబ్రా' (Cobra Movie). ఇందులో 'కెజియఫ్ 2' (KGF 2 Movie) ఫేమ్ శ్రీనిధి శెట్టి (Srinidhi Shetty) కథానాయిక. ఇటీవల చెన్నైలో గ్రాండ్ ప్రీ రిలీజ్ ఈవెంట్ ను నిర్వహించారు. మొదట ఆగస్టు 11న 'కోబ్రా'ను విడుదల చేయాలని ప్లాన్ చేశారు. కానీ ఆ సమయానికి రావడం కుదరలేదు. ఇప్పుడు ఆగస్టు 31న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. 


'కోబ్రా'లో విక్రమ్ సుమారు 20 పాత్రల్లో కనిపిస్తారని టాక్. ఇదొక యాక్షన్ థ్రిల్లర్. స‌క్సెస్‌ఫుల్ డైరెక్ట‌ర్‌గా పేరు తెచ్చుకున్న అజ‌య్ జ్ఞాన‌ముత్తు (Ajay Gnanamuthu) ఈ సినిమాను డైరెక్ట్ చేశారు. సెవెన్ స్క్రీన్ స్టూడియోస్ బ్యానర్‌పై ఎస్ఎస్ లలిత్ కుమార్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాలో క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్ కీలక పాత్ర పోషిస్తున్నారు. తెలుగు, తమిళం, కన్నడ భాషల్లో సినిమా రిలీజ్ కానుంది. ఎ.ఆర్‌.రెహ‌మాన్ (A.R.Rahman)సంగీతాన్ని అందిస్తున్నారు. ప్రముఖ నిర్మాత ఎన్.వి.ప్రసాద్ ఈ సినిమా తెలుగు హక్కులను సొంతం చేసుకున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో ఆయనే స్వయంగా రిలీజ్ చేస్తున్నారు.


రంగ రంగ వైభవంగా:


మెగా మేనల్లుడు పంజా వైష్ణవ్ తేజ్(Vaishnav Tej) కథానాయకుడిగా శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై ప్రముఖ నిర్మాత బి.వి.ఎస్.ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న సినిమా 'రంగ రంగ వైభవంగా'(Ranga Ranga Vaibhavanga). ఇందులో కేతికా శర్మ(Ketika Sharma) కథానాయిక. గిరీశయ్య దర్శకత్వం వహిస్తున్నారు. సెప్టెంబర్ 2న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.


ఫస్ట్ డే ఫస్ట్ షో: 


'జాతిరత్నాలు' ఫేమ్ కేవీ అనుదీప్ అందించిన కథతో 'ఫస్ట్ డే ఫస్ట్ షో' (First Day First Show Movie) అనే సినిమా రూపొందుతోంది. దీనికి ఇద్దరు యువకులు.. వంశీధర్ గౌడ్, లక్ష్మీనారాయణ పి సంయుక్తంగా దర్శకత్వం వహించనున్నారు. 'సిరి సిరి మువ్వ', 'శంకరాభరణం', 'సాగర సంగమం' వంటి చిత్రాలు నిర్మించిన పూర్ణోదయా పిక్చర్స్ ఏడిద నాగేశ్వరరావు వారసులు ఈ సినిమాకు నిర్మాతలు. శ్రీజ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌, మిత్రవింద మూవీస్ పతాకంపై శ్రీరామ్ ఏడిద సమర్పణలో శ్రీజ ఏడిద ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాను కూడా సెప్టెంబర్ 2నే విడుదల చేయనున్నారు. 


బుజ్జి ఇలా రా: 


సునీల్ పోలీస్ ఆఫీసర్ గా నటిస్తోన్న ఈ సినిమా కూడా సెప్టెంబర్ 2న విడుదల కానుంది. 
ఈ సినిమాలతో పాటు 'డైహార్డ్ ఫ్యాన్', 'ఆకాశ వీధుల్లో', 'నా వెంటపడుతున్న చిన్నవాడెవరమ్మా' వంటి సినిమాలు పోటీ పడుతున్నాయి. ఈ సినిమాలకు పెద్దగా బజ్ లేదు. 


ఓటీటీ రిలీజెస్:


పెళ్లికూతురు పార్టీ:


ప్రిన్స్, అనీషా దామా, అర్జున్ కళ్యాణ్, సీత, జయత్రీ, సాయికీర్తన్, ఫణి ప్రధాన పాత్రలు పోషించిన ఒక విమెన్ సెంట్రిక్ ఫిల్మ్ పెళ్లికూతురు పార్టీ. ఈ సినిమా ఆగస్టు 31నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానుంది. 


పంచతంత్ర కథలు:


ఐదుగురు వ్యక్తులు, ఐదు విభిన్న కథల సమాహారంగా రూపుదిద్దుకున్న సినిమా 'పంచతంత్ర కథలు'. మధు క్రియేషన్స్‌పై గంగనమోని శేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ చిత్రం 'ఆహా' ఓటీటీ వేదికగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నెల 31 నుంచి స్ట్రీమింగ్ కానుంది. 


మై డియర్ భూతం:  


ప్రభుదేవా ప్రధానపాత్రలో రాబోతున్న కొత్త సినిమా 'మై డియర్ భూతం'. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ సినిమాగా ఈ సినిమా సెప్టెంబర్ 2 నుంచి జీ5లో స్ట్రీమింగ్ కానుంది. 


విక్రాంత్ రోణ:


కిచ్చా సుదీప్ టైటిల్ పాత్రలో నటించిన పాన్ ఇండియా సినిమా 'విక్రాంత్ రోణ'. జూలైలో ఈ సినిమా విడుదలైంది. ఇప్పుడు జీ5లో సెప్టెంబర్ 2 నుంచి స్ట్రీమింగ్ కానుంది.


వీటితో పాటు 'చిత్తం మహారాణి', 'వాంటెడ్ పండుగాడు' వంటి సినిమాలు సెప్టెంబర్ 2నుంచి 'ఆహా'లో స్ట్రీమింగ్ కానున్నాయి. 


Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్


Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్