Tollywood Updates: న్యూ ఇయ‌ర్ సంద‌డి... హీరోగా మారుతున్న యంగ్ కమెడియన్... హన్సిక '105 మినిట్స్' అప్‌డేట్‌

ABP Desam పాఠకులకు, సినిమా ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఏడాదికి తెలుగు సినిమా పరిశ్రమ సందడిగా స్వాగతం పలికింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు విడుదల చేసిన పోస్టర్లు, కొత్త కబుర్లు, ఇంకా ఎన్నో... 

ABP Desam Last Updated: 01 Jan 2022 04:17 PM
హీరోగా యంగ్ కమెడియన్ అభినవ్ గోమఠం

'మళ్ళీ రావా', 'ఈ నగరానికి ఏమైంది', 'మీకు మాత్రమే చెప్తా', 'రంగ్ దే', 'ఇచ్చట వాహనములు నిలపరాదు' తదితర సినిమాలతో హాస్యనటుడిగా మంచి పేరు, గుర్తింపు తెచ్చుకున్న యువకుడు అభినవ్ గోమఠం. నాని 'శ్యామ్ సింగ రాయ్'లో కాఫీ షాప్ ఓనరుగా, హీరో స్నేహితుడిగా మంచి పాత్ర పోషించారు. త్వరలో ఆయన హీరోగా మారుతున్నారు.
కాసుల క్రియేటివ్ వర్క్స్ సమర్పణలో అభినవ్ గోమఠం హీరోగా ఓ సినిమా రూపొందుతోంది. జనవరి 1న హీరో పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమాను ప్రకటించారు. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని చిత్రబృందం పేర్కొంది. 
పోస్ట్ ప్రొడ‌క్ష‌న్‌లో '105 మినిట్స్'



హన్సిక ప్రధాన పాత్రధారిగా బొమ్మక్ శివ నిర్మాణంలో రాజు దుస్సా దర్శకత్వం వహిస్తున్న సినిమా '105 మినిట్స్'. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. గ్రాఫిక్స్ అద్భుతంగా వస్తున్నాయని, ఇండియన్ స్క్రీన్ మీద మొట్టమొదటి సారిగా సింగిల్ షాట్, సింగిల్ క్యారెక్టర్ తో తెరకెక్కుతున్న సినిమా ఇదేనని యూనిట్ సభ్యులు చెప్పారు. ఇటువంటి ప్రయోగాత్మక చిత్రానికి సంగీతం అందించడం చాలా సంతోషంగా ఉందని, నేపథ్య సంగీతం అందించడం సవాల్ గా ఉందని సంగీత దర్శకులు సామ్ సి.యస్ అభిప్రాయపడ్డారు.

సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?

పవర్ స్టార్ పవన్ కల్యాణ్ 'భీమ్లా నాయక్' ముందుకు వస్తుందా? సంక్రాంతికి సినిమాను విడుదల చేయాలని అనుకుంటున్నారా? సంక్రాంతికి సినిమాను విడుదల చేయడం సాధ్యమేనా? పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి... సంక్రాంతికి 'భీమ్లా నాయక్'... పవర్ స్టార్ ముందుకు వస్తున్నారా?

ప్రేమ, విధి మధ్య యుద్ధం... ప్రభాస్, పూజా హెగ్డే కౌగిలింత

ప్రభాస్, పూజా హెగ్డే జంటగా నటిస్తున్న సినిమా 'రాధే శ్యామ్'. 'జిల్' ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా కొత్త పోస్టర్‌ను నేడు విడుదల చేశారు. 'ప్రేమకు, విధికి మధ్య యుద్ధం' అని అందులో పేర్కొన్నారు.
ఆడవాళ్ళు మీకు జోహార్లు పోస్టర్ అదిరింది!



శర్వానంద్, రష్మిక జంటగా నటిస్తున్న సినిమా 'ఆడవాళ్లు మీకు జోహార్లు'. న్యూ ఇయర్ సందర్భంగా విడుదల చేసిన సినిమా పోస్టర్లో ఫుల్ జోష్ కనిపించింది. అందరూ హుషారుగా స్టెప్పులు వేస్తూ ఉన్నారు. 



సమ్మర్ సోగ్గాళ్లుగా వెంకటేష్... వరుణ్ తేజ్... 

విక్టరీ వెంకటేష్, మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోలుగా నటిస్తున్న సినిమా 'ఎఫ్ 3'. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించారు. న్యూ ఇయర్ విషెష్ చెబుతూ... సినిమా కొత్త పోస్టర్ విడుదల చేశారు. 'సమ్మర్ సోగాళ్లు వస్తున్నారు' అని పేర్కొన్నారు. 





ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?

'ఆర్ఆర్ఆర్' సినిమా విడుదల మరోసారి వాయిదా పడిందా? సంక్రాంతి బరి నుంచి సినిమా తప్పుకొందా? అంటే 'అవును' అని సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాలు చదవడానికి ఈ లింక్ క్లిక్ చేయండి... ఆందోళనలో 'ఆర్ఆర్ఆర్' ఫ్యాన్స్‌... సినిమా మళ్లీ వాయిదా పడిందా!?

'మడత కాజా' నిర్మాతతో... శ్రీ విష్ణు కొత్త సినిమా


శ్రీ విష్ణు కథానాయకుడిగా టింబు ప్రొడక్షన్స్‌ పతాకంపై వేదరాజ్‌ టింబర్‌ ఓ సినిమా  నిర్మిస్తున్నారు. న్యూ ఇయర్ సందర్భంగా సినిమాను ప్రకటించారు. "శ్రీ విష్ణు హీరోగా మా సంస్థలో ప్రొడక్షన్‌ నెం. 4గా నిర్మిస్తున్న చిత్రమిది. ఫిబ్రవరి మొదటి వారంలో చిత్రీకరణ ప్రారంభిస్తాం. ఇంతకు ముందు, మా సంస్థలో అల్లరి నరేష్‌ హీరోగా 'మడత కాజా'తో పాటు 'సంఘర్షణ' అనే మరో చిత్రాన్ని నిర్మించాం. శ్రీ విష్ణుతో నిర్మించబోయే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలు త్వరలోనే తెలియజేస్తాం" అని వేదరాజ్ టింబర్ అన్నారు.

ఓ స్టాండప్ కమెడియన్... క్రిటిక్... మీమర్... మహానటులు అండీ!

ఆశోక్ కుమార్ దర్శకత్వంలో అనిల్ బొడ్డిరెడ్డి, తిరుపతి ఆర్. ఎర్రంరెడ్డి నిర్మించిన సినిమా 'మహానటులు'. సినిమాలో క్యారెక్టర్లను ఇంట్రడ్యూస్ చేస్తూ... న్యూ ఇయర్ సందర్భంగా ఓ గ్లింప్స్‌ విడుదల చేశారు. ఓ స్టాండప్ కమెడియన్, ఓ క్రిటిక్, ఓ మీమర్... ముగ్గురు జీవితాల్లో ఏం జరిగింది? ఘోస్ట్ వీడియోస్ తీసే ఓ అమ్మాయి (goldie nissy) పరిచయంతో వీళ్ల జీవితాల్లో ఏం జరిగిందనేది కథగా తెలుస్తోంది.


మెగా స్వాగ్... 'భోళా శంకర్'!

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వంలో ఏకే ఎంటర్టైన్మెంట్స్ సంస్థ నిర్మిస్తున్న సినిమా 'భోళా శంకర్'. 'స్వాగ్ ఆఫ్ భోళా శంకర్' పేరుతో ఈ రోజు ఓ మ్యూజిక్ టీజర్ విడుదల చేశారు. ఈ ఏడాదే సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్టు తెలిపారు.


షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పేస్తూ ఇన్‌స్టా పోస్ట్!

కొత్త ఏడాదిలో ప్రేక్షకులకు పెద్ద షాక్ ఇచ్చారు దీప్తి సునైన. షన్ముఖ్ జస్వంత్‌కు బ్రేకప్ చెప్పినట్లు ఆమె ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ప్రకటించింది. పూర్తి వార్త చదవడం కోసం ఈ లింక్ క్లిక్ చేయండి... షన్ముఖ్‌కు షాకిచ్చిన దీప్తి.. బ్రేకప్ చెప్పిందిగా!

Background

ABP Desam పాఠకులకు, తెలుగు సినిమా ప్రేక్షకులకు హ్యాపీ న్యూ ఇయర్. కొత్త ఏడాదికి తెలుగు సినిమా పరిశ్రమ సందడిగా స్వాగతం పలికింది. న్యూ ఇయర్ సందర్భంగా నేడు విడుదల చేసిన పోస్టర్లు, కొత్త కబుర్లు, ఇంకా ఎన్నో... 


కొత్త ఏడాది ప్రారంభానికి ముందే మెగాస్టార్ చిరంజీవి, నట సింహ నందమూరి బాలకృష్ణ, కింగ్ అక్కినేని నాగార్జున, మాస్ మహారాజ్ రవితేజ, రౌడీ బాయ్ విజయ్ దేవరకొండ సినిమాలకు సంబంధించిన అప్‌డేట్స్ వ‌చ్చేశాయి. డిసెంబర్ 31న 'ఆచార్య' నుంచి చిరంజీవి కొత్త పోస్టర్ విడుదల చేశారు. బాలకృష్ణతో సినిమా చేస్తున్నట్టు సంపత్ నంది వెల్లడించారు. తనయుడు నాగ చైతన్యతో కలిసి నాగార్జున నటిస్తున్న 'బంగార్రాజు' టీజర్ (Bangarraju Teaser) నేడు (జనవరి 1న) విడుదల చేయనున్నట్టు శుక్రవారం వెల్లడించారు. మాస్ మహారాజ్ రవితేజ 'ఖిలాడి' నుంచి 'అట్టా సూడకే మట్టెక్కుతాంది ఈడుకే' సాంగ్ విడుదల చేశారు. ఇంకా కొన్ని అప్‌డేట్స్ వ‌చ్చాయి. ఈ రోజు ఇంకొన్ని పోస్టర్లు న్యూ ఇయర్ విషెస్‌తో విడుద‌ల చేశారు. నాని (nani), నజ్రియా (nazriya nazim) జంటగా నటిస్తున్న 'అంటే సుందరానికి (ante sundaraniki first look) ఫస్ట్ లుక్ విడుదల చేయనున్నారు. అలాగే... సుధీర్ బాబు (sudheer babu), కృతి శెట్టి (krithi shetty) హీరో హీరోయిన్లుగా నటిస్తున్న 'ఆ అమ్మాయి గురించి మీరు చెప్పాలి' (aa ammayi gurinchi meeku cheppali first look) కూడా విడుదల చేయనున్నారు. హన్సిక '105 మినిట్స్', 'ఖిలాడి' కొత్త పోస్టర్లు కూడా ఈ రోజు విడుదల చేశారు. 'ఆర్ఆర్ఆర్: రౌద్రం రణం రుధిరం' (RRR movie postponed again)ను మరోసారి వాయిదా వేశారని ఫిల్మ్ నగర్ ఖబర్. అందుకు సంబంధించిన అనౌన్స్ ఈ రోజు రావచ్చని అంటున్నారు. అలాగే, ప్రభాస్ 'రాధే శ్యామ్' మూవీ (Radhe Shyam Postponed Again) విడుదల కూడా వాయిదా పడినట్టు టాక్. ఇంకా బోలెడు కొత్త కబుర్ల సమాహారమే ఈ లైవ్ బ్లాగ్. 

Also Read: జనవరి 1 ఎపిసోడ్: రుద్రాణికి కార్తీక్ వార్నింగ్, అప్పు తీర్చకపోతే కథ వేరే ఉంటదన్న రుద్రాణి.. ‘కార్తీకదీపం’ అప్ డేట్స్..
Also Read:  గౌతమ్ కి క్లారిటీ ఇచ్చిన రిషి - ఈగో మాస్టర్ కి షాక్ ఇచ్చిన వసుధార.. గుప్పెండత మనసు డిసెంబరు 29 బుధవారం ఎపిసోడ్
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

- - - - - - - - - Advertisement - - - - - - - - -

TRENDING NOW

© Copyright@2025.ABP Network Private Limited. All rights reserved.