ప్రస్తుతం దేశం అంతా శ్రీరామ నామ స్మరణలో మునిగిపోయింది. అయోధ్యలో రామ మందిరం కోట్లాది మంది భారతీయుల కల. ఆ కల నేటిలో తీరిపోనుంది. సోమవారం అంగరంగ వైభవంగా అయోధ్యలో రామ మందిరానికి ప్రాణ ప్రతిష్ట జరగనుంది. ఈ వేడుకలు చూడటానికి పలువురు టాలీవుడ్ ప్రమఖులు సైతం అయోధ్యకు చేరుకుంటున్నారు.


పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అయోధ్యకు బయల్దేరారు. ఈ విషయాన్ని ఆయన తన అధికారిక ట్విట్టర్ ఖాతా ద్వారా వెల్లడించారు. భారత నాగరికతకు శ్రీరాముడు హీరో అని, రాముడిని అయోధ్యకు తీసుకురావడానికి శతాబ్దాల పాటు కృషి చేయాల్సి వచ్చిందని ఆయన ఎక్స్/ట్విట్టర్ ఖాతాలో పోస్టు చేశారు. కారులో అయోధ్యకు వెళ్తున్న వీడియోను కూడా ఆయన షేర్ చేశారు. 






మెగా స్టార్ చిరంజీవి, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్... ఇలా దాదాపు మెగా ఫ్యామిలీ అంతా ఆంజనేయ భక్తులన్న సంగతి అందరికీ తెలిసిందే. అయోధ్యలో రామ మందిర ప్రారంభోత్సవానికి వీరు కూడా బయలు దేరారు.