లయాళ బ్లాక్ బస్టర్ సినిమా ‘లూసీఫర్‘ తెలుగులో ‘గాడ్ ఫాదర్‘ పేరుతో రీమేక్ అయ్యింది. దసరా కానుకగా అక్టోబర్ 5 విడుదలైన ఈ సినిమా మంచి విజయాన్ని అందుకుంది. ఆచార్య పరాభవం తర్వాత చిరంజీవిని ఈ సినిమా హిట్ ట్రాక్ లో నిలబెట్టింది. మోహన్ రాజా దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మెగా అభిమానులను ఎంతగానో అలరిస్తోంది. చిరంజీవి  డైలాగ్స్, ఫైట్స్, మాస్ మూమెంట్స్‌ తో ఆకట్టుకుంటున్నాయి. మెగాస్టార్ మరోసారి తనదైన శైలి నటనతో, డైలాగ్ డెలివరీతో అభిమానులను అలరించాడు. మొత్తంగా ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర మంచి వసూళ్లను సాధిస్తోంది. ’లూసీఫర్’ రీమేక్ మంచి హిట్ అందుకోవడంతో ఆయన తనయుడు రాంచరణ్ మరో స్టెప్ తీసుకున్నట్లు సమాచారం. మలయాళంలో బ్లాక్ బస్టర్ సాధించిన ఓ సినిమా తెలుగు రీమేక్ రైట్స్ తీసుకున్నట్లు టాక్ వినిపిస్తోంది. 


మలయాళ సినీ పరిశ్రమలో అమల్ నీరద్ దర్శకత్వంలో మమ్ముట్టి నటించిన తాజా సినిమా ‘భీష్మ పర్వం’. ఈ సినిమా ఈ ఏడాది మార్చిలో విడుదలైంది. ఈ సినిమాకు మలయాళ ప్రేక్షకులు బ్రహ్మరథం పట్టారు. సినిమా చూసేందుకు థియేటర్లకు పోటెత్తారు. బ్లాక్ బస్టర్ హిట్ కట్టబెట్టారు. హాలీవుడ్ క్లాసిక్ ‘ది గాడ్ ఫాదర్’తో పాటు భారతీయ ఇతిహాసం మహాభారతం నుంచి ప్రేరణ పొంది, అమల్ నీరద్ ఈ సినిమాను రూపొందించారు.  గ్యాంగ్‌ స్టర్ డ్రామాగా ఈ సినిమా తెరకెక్కింది. ఉమ్మడి కుటుంబం చుట్టూ కేంద్రీకృతమై ఈ కథ ముందుకు నడుస్తుంది. ఈ సినిమాలో మమ్ముట్టి, సౌబిన్ షాహిర్, శ్రీనాథ్ భాసి, నదియా మొయిదు, నేదురుమూడి వేణు సహా పలువురు నటీనటులు కీలక పాత్రలు పోషించారు.






మల్లూవుడ్ లో ఓరేంజిలో విజయాన్ని అందుకున్న ‘భీష్మ పర్వం’ సినిమాను తెలుగులోకి రీమేక్ చేయాలని చిరంజీవి తనయుడు రాంచరణ్ భావిస్తున్నారట. ఈ మేరకు ఈ సినిమా  తెలుగు రీమేక్ హక్కులను చెర్రీ దక్కించుకున్నట్లు తెలుస్తున్నది.  త్వరలోనే తెలుగు వెర్షన్‌కి సంబంధించి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఈ సినిమాలో చిరంజీవి హీరోగా నటించబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే, దీనిపై రామ్ చరణ్ టీమ్ ఎలాంటి అధికారిక సమాచారం ఇవ్వలేదు.  అటు తాజాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన లూసిఫర్ తెలుగు రీమేక్ ‘గాడ్ ఫాదర్’ సక్సెస్ ఫుల్ గా రన్ అవుతున్నది. మోహన్ రాజా దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో నయనతార, సత్యదేవ్, సముద్రఖని, పూరి జగన్నాథ్ నటించారు. సల్మాన్ ఖాన్ కూడా అతిథి పాత్రలో మెరిశాడు.


Also Read :'గాడ్ ఫాదర్' ఓపెనింగ్ డే వసూళ్లు ఎంత? 'బాస్ ఈజ్ బ్యాక్' అనేలా ఉన్నాయా? లేదా?


Also Read : ఆస్కార్స్‌కు 'ఆర్ఆర్ఆర్' - తొలి అడుగు పడింది