టాలీవుడ్ నటుడు, నిర్మాత బండ్ల గణేష్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన స్వయంగా ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. అయితే ఆయన కరోనాకు గురవడం ఇదే మొదటిసారి కాదు. ఫస్ట్ వేవ్‌లో ఒకసారి, సెకండ్ వేవ్‌లో ఒకసారి కూడా గణేష్‌కు కరోనా సోకింది. సెకండ్ వేవ్ సమయంలో ఆయనకు కొంచెం సీరియస్ కూడా అయింది.


ఈ మధ్య టాలీవుడ్ సెలబ్రిటీలు ఎక్కువగా కరోనా బారిన పడుతున్నారు. ఇటీవలే సూపర్ స్టార్ మహేష్ బాబు, థమన్‌లకు కూడా కరోనావైరస్ సోకింది. కరోనా కారణంగా అన్నయ్య రమేష్ బాబు అంత్యక్రియలకు కూడా మహేష్ బాబు హాజరు కాలేకపోయాడు.


బండ్ల గణేష్ తన ట్వీట్‌లో ‘గత మూడు రోజులుగా నేను ఢిల్లీలో ఉన్నాను. ఈరోజు సాయంత్రం నాకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. నాకు తక్కువ లక్షణాలు ఉన్నాయి. కానీ నా కుటుంబానికి మాత్రం కోవిడ్ నెగిటివ్ వచ్చింది. జాగ్రత్తగా ఉండండి. ప్రయాణం చేసేటప్పుడు మరోసారి ఆలోచించుకోండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్‌లో ఉన్నాను.’ అని పేర్కొన్నారు.