ఆర్యపై శ్రీలంక యువతి ఫిర్యాదు..
తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని శ్రీలంక యువతి ప్రముఖ సినీ నటుడు ఆర్యపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో తమిళనాడులోని చెన్నైలో కమిషనర్ ఎదుట ఆర్య విచారణకు హాజరయ్యాడు. ఈ సందర్భంగా పోలీసులు పలు విషయాలు ఆరా తీశారు. శ్రీలంకకు చెందిన యువతి.. జర్మనీలో ఉంటోంది. ఆర్య తనను పెళ్లి చేసుకుంటానని చెప్పి రూ.70 లక్షలు తీసుకొని మోసం చేశాడని ఆమె జర్మనీలో ఆన్ లైన్ లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పాటు ఆర్యతో చేసిన చాటింగ్ అంటూ కొన్ని స్క్రీన్ షాట్ లను విడుదల చేసింది. దీంతో చెన్నైలో ఆర్యను మూడు గంటల పాటు విచారించారు. ప్రస్తుతం ఈ కేసు కోర్టులో విచారణ జరుగుతోంది. ఆగస్టు 17వ తేదీకి విచారణ వాయిదా వేశారు.
మెగాస్టార్ పై బండ్ల గణేష్ ట్వీట్..
ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్.. మెగాస్టార్ చిరంజీవిపై చేసిన ట్వీట్ ఇప్పుడు వైరల్ అవుతోంది ఎప్పుడూ పవన్ కళ్యాణ్ మీద అభిమానాన్ని కురిపించే బండ్ల గణేష్ ఈసారి చిరంజీవిపై తన ప్రేమను చాటుకున్నాడు. ''మా దేవరకి అన్న.. అందరికి నేను అనే నమ్మకం. మనిషి అంటే ఇలా ఉండాలి.. అని ప్రజలకు చెప్పిన మహోన్నత వ్యక్తి మా పెద్దన్న మెగాస్టార్'' అంటూ చేతులు జోడించిన ఎమోజీను జత చేశాడు. అయితే ఈ ట్వీట్ ను బండ్ల గణేష్ ఏ సందర్భంగా చేశాడనేది మాత్రం స్పష్టం చేయలేదు.
తమిళనటి, బిగ్ బాస్ ఫేమ్ యషికా ఆనంద్ ఇటీవల ఘోర ప్రమాదానికి గురైన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో గాయపడ్డ ఆమెని హాస్పిటల్ లో జాయిన్ చేసి ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రీసెంట్ గానే ఈమె కోలుకొని డిశ్చార్జ్ అయింది. తన స్నేహితురాలు పావని.. మరో ఇద్దరితో కలిసి కారులో ప్రయాణిస్తుండగా.. మహాబలేశ్యరం వద్ద ఆమె కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ఈ ప్రమాదం యషికా ర్యాష్ డ్రైవింగ్ వలన జరిగిందని గుర్తించిన పోలీసులు ఆమెపై కేసు నమోదు చేశారు. చెంగల్పట్టు జిల్లా కానత్తూరు పోలీసులు ఆమెపై ఐపీసీ సెక్షన్ 279, 304 ఏ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. అంతేగాక పోలీసులు ఆమె డ్రైవింగ్ లైసెన్స్‌ను కూడా స్వాధీనం చేసుకున్నారు.
Also Read : Salaar Movie : క్యాజువల్ లుక్ లో ప్రభాస్.. 'సలార్' వీడియో లీక్..