చరణ్-శంకర్ టైటిల్.. 


టాలీవుడ్ స్టార్ హీరో రామ్ చరణ్ 'ఆర్ఆర్ఆర్' తరువాత శంకర్ దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నారు. సెప్టెంబర్ 8న ఈ సినిమా పూజా కార్యక్రమాలు జరగనున్నాయి. అయితే ఇప్పుడు ఈ సినిమాకి టైటిల్ గా 'విశ్వంభర' అనే పేరుని అనుకున్నట్లుగా వార్తలొస్తున్నాయి. విశ్వంభర అంటే భూమి అని అర్ధం. పొలిటికల్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకి ఈ టైటిల్ బాగుంటుందని భావిస్తున్నారు. ప్రముఖ నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై  దిల్‌ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించబోతున్నారు. కియారా అద్వానీ హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాని పాన్ ఇండియా నేపథ్యంలో తెరకెక్కించనున్నారు. ఈ సినిమాకి తమన్ మ్యూజిక్ అందించనున్నారు. 


దసరా బరిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'.. 


అక్కినేని అఖిల్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా తెరకెక్కిన సినిమా 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్'. బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేసిన ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని చాలా కాలమవుతుంది. కానీ కరోనా కారణంగా సినిమా వాయిదా పడుతోంది. ఈ ఏడాది ప్రారంభంలో సంక్రాంతి పండుగ సందర్భంగా విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను ఎట్టకేలకి విజయదశమి పండుగ సందర్భంగా అక్టోబర్ 8న రిలీజ్ చేస్తున్నట్టు ఓ కొత్త పోస్టర్ విడుదల చేసి అధికారకంగా ప్రకటించారు.


 




'ఆహా'లో సుశాంత్ సినిమా.. 


యంగ్ హీరో సుశాంత్ నటించిన 'ఇచ్చట వాహనములు నిలుపరాదు' సినిమా ఆగస్టు 27నే థియేటర్లలోకి వచ్చిన సంగతి తెలిసిందే. యాక్షన్ కామెడీ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా త్వరలోనే ఓటిటి లో విడుదల కానుంది. ఇప్పటికే ఆహా (Aha) ఓటిటి ప్లాట్‌ఫామ్‌ తో డీల్ కుదుర్చుకున్న మేకర్స్.. సెప్టెంబర్ 17న సినిమాను ఆహాలో విడుదల చేయాలని నిర్ణయంచుకున్నట్టు తెలుస్తోంది. దీనికి సంబంధించిన అధికార ప్రకటన వచ్చేసింది.