Tillu Square Box Office Collection Day 3: సీక్వెల్ తెర‌కెక్కించ‌డంలో ‘టిల్లు స్క్వేర్’ పూర్తిగా స‌క్సెస్ అయ్యింది. ప్రేక్ష‌కులు మెప్పించ ద‌గ్గ రేంజ్ లో సీక్వెల్ అందించ‌డంలో సిద్దు జొన్న‌ల‌గ‌డ్డ స‌క్సెస్ అయ్యారు. సిద్ధు జొన్నలగడ్డ, అనుపమ పరమేశ్వరన్ హీరోహీరోయిన్లుగా తెరకెక్కిన ‘టిల్లు స్క్వేర్’కు క‌లెక్ష‌న్ల విష‌యంలో దూసుకుపోతోంది. పాజిటివ్ టాక్ రావ‌డంతో ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు వెళ్లి సినిమా చూసేందుకు ఆస‌క్తి చూపిస్తున్నారు. రోజురోజుకీ కలెక్షన్స్ పెరిగిపోతున్నాయి. ఇక ఈ సినిమా ఇదే రేంజ్‌లో రన్ అయితే వెంటనే త్వ‌ర‌లోనే వంద కోట్ల లిస్ట్ లో చేరిపోవ‌డం ఖాయం అంటున్నారు సినీ విశ్లేష‌కులు. ‘టిల్లు స్క్వేర్’ మూడు రోజుల‌ క‌లెక్ష‌న్లు కూడా భారీగా ఉన్నాయ‌ని సితారా ఎంట‌ర్ టైన్మెంట్స్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది.






క‌లెక్ష‌న్ల మోత‌.. 


‘టిల్లు స్క్వేర్’ క‌లెక్ష‌న్ మోత కొన‌సాగుతోంద‌ని సితార ఎంట‌ర్ టైన్మెంట్స్ ఇన్ స్టాలో పోస్ట్ చేసింది. ఇప్ప‌టి వ‌ర‌కు ప్ర‌పంచవ్యాప్తంగా.. గ్రాస్ కలెక్షన్స్ రూ.68.1 కోట్లు దాటింద‌ని, త్వ‌ర‌లోనే రూ.100 కోట్ల మార్క్ చేరుకుంటుంద‌ని పోస్ట్ చేసింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా ఓవ‌రాల్ క‌లెక్ష‌న్ మూడో రోజు రూ.12కోట్లు దాటిన‌ట్లుగా తెలుస్తోంది. ఇక ఓవర్సీస్‌లో సైతం ‘టిల్లు స్క్వేర్’కు మంచి ఆదరణ లభిస్తోంది. బాక్సాఫీస్ ద‌గ్గ‌ర టిల్ల‌న్న డామినేష‌న్ కొన‌సాగుతోంది. మూడు రోజుల్లో గ్రాస్ క‌లెక్ష‌న్స్ రూ.68.1 కోట్లు దాటింది. ఇక రూ.100 కోట్ల‌వైపు ప‌రుగులు పెడుతున్నాం అంటూ పోస్ట్ పెట్టారు. 


బ్రేక్ ఈవెన్ వ‌చ్చేసిన‌ట్లే.. 


ఓవర్సీస్‌లో రెండు రోజుల్లోనే ‘టిల్లు స్క్వేర్’కు రూ.7.10 కోట్ల కలెక్షన్స్ దక్కాయి. తెలుగు రాష్ట్రాల్లో కాకుండా ఇతర రాష్ట్రాల్లో రూ.1.40 కోట్ల కలెక్షన్స్ సాధించినట్టు తెలుస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ‘టిల్లు స్క్వేర్’కు గ్రాస్ కలెక్షన్స్ రూ.68.1 కోట్లుగా నిలిచాయి. విడుదలయిన మొదటిరోజు ‘టిల్లు స్క్వేర్’.. ప్రపంచవ్యాప్తంగా రూ.23.70 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. రెండోరోజు రూ.18.90 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను సాధించింది. ఈ మూవీకి రూ.27 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ జరిగింది. అంటే బ్రేక్ ఈవెన్ రావాలంటే రూ.28 కోట్లు కావాలి. అంటే ఇప్పుడు కలెక్షన్స్‌ను బట్టి చూస్తే.. ‘టిల్లు స్క్వేర్’కు బ్రేక్ ఈవెన్ వచ్చేసినట్లే అని లెక్క‌ల ద్వారా తెలుస్తోంది.


మొద‌టి నుంచే పాజిటివ్ టాక్.. 


'టిల్లు స్క్వేర్ సినిమాకి మొద‌టి నుంచే పాజిటివ్ టాక్ వ‌చ్చింది. ట్రైల‌ర్, టీజ‌ర్ అన్నీ ఆక‌ట్టుకున్నాయి. అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ ని చూసిన వాళ్లు కూడా సినిమాపై ఇంట్రెస్ట్ పెంచుకున్నారు. రివ్యూలు కూడా పాజిటివ్ గానే వినిపించాయి. సినిమా చూసిన వాళ్లంతా... ఇది ప‌ర్ఫెక్ట్ సీక్వెల్ అని కామెంట్ చేశారు. 2022లో 'డీజే టిల్లు పేరుతో థియేట‌ర్ల‌లో సంద‌డి చేశాడు సిద్దూ జొన్న‌ల‌గ‌డ్డ‌. ఫ‌స్ట్ పార్ట్ లో నేహా శెట్టి హీరోయిన్ గా చేశారు. టిల్లు స్క్వేర్ లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ క‌థానాయిక కాగా.. మల్లిక్ రామ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా శ్రీకర స్టూడియోస్ సమర్పణలో సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ సంస్థలపై తెరకెక్కింది.  సూర్యదేవర నాగవంశీ, త్రివిక్రమ్ సతీమణి సాయి సౌజన్య నిర్మాతలు. రామ్ మిరియాల, అచ్చు రాజమణి స్వరకర్తలు.  


Also Read: షాకుల మీద షాకులు తగులుతున్నాయ్, భ‌క్తికి, ముక్తికి చ‌దువులెందుకు? కుమారి ఆంటీ పవర్ ఫుల్ స్పీచ్