అమెరికన్ టిక్ టాక్ స్టార్ కూపర్ నోరిగ(19) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. జూన్ 9న లాస్ ఏంజిల్స్ లోని మాల్ పార్కింగ్ లాట్ లో శవమై కనిపించాడు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. అయితే అతడు మృతి చెందడానికి కొన్ని గంటల క్రితం సోషల్ మీడియాలో షేర్ చేసిన వీడియో ప్రస్తుతం వైరల్ అవుతోంది.
అందులో బెడ్ పై సేద తీరుతున్న కూపర్.. యంగేజ్ లోనే చనిపోతామేమోనని ఎవరు ఆలోచిస్తున్నారు..? అని ఫ్యాన్స్ ను ప్రశ్నించాడు. ఈ వీడియో పోస్ట్ చేసిన కొద్దిగంటల్లోనే అతడు మరణించడం అనుమానాలకు దారి తీస్తుంది. కొంతకాలంగా కూపర్ మానసిక ఒత్తిడికి లోనవుతున్నట్లు తెలుస్తోంది. జూన్ 5న టిక్ టాక్ లో అతడు ఓ వీడియోను షేర్ చేశారు.
అలానే ఇన్స్టాగ్రామ్ లో కూడా మెంటల్ హెల్త్ కోసం ఓ పోస్ట్ పెట్టాడు. 'మీ కష్టాలను నాతో చెప్పుకోండి. ఎందుకంటే మానసిక ఒత్తిడి మనల్ని ఎంతగా బాధిస్తుందనేది నాకు తెలుసు. మీరు ఒంటరి కాదు.. మీకు నేనున్నాను' అంటూ చెప్పుకొచ్చారు. కూపర్ కి టిక్ టాక్ లో 1.77 మిలియన్ ఫాలోవర్లు ఉన్నారు. ఫన్నీ స్కేట్ బోర్డింగ్ వీడియోలతో పాటు ఫ్యాషన్ వీడియోలను సైతం టిక్ టాక్ అప్లోడ్ చేసి ఫ్యాన్స్ ను ఎంటర్టైన్ చేసేవాడు కూపర్.
Also Read: పెన్ను కదలడం లేదు బావా - 'సుడిగాలి' సుధీర్‌ను తలుచుకుని ఏడ్చిన 'ఆటో' రామ్ ప్రసాద్
Also Read: తిరుమలలో చెప్పులతో - క్షమాపణలు కోరిన నయన్ భర్త విఘ్నేష్, వివాదానికి ఫుల్ స్టాప్ పడుతుందా?