టాలెంటెడ్ యాక్టర్ ధనుష్(Dhanush) గురించి ప్రత్యేకంగా పరిచయం చేయనక్కర్లేదు. తన సినిమాలతో, నటనతో కోట్ల మంది అభిమానులను సంపాదించుకున్నారు ఈ హీరో. ఈ కోలీవుడ్ హీరో త్వరలోనే 'సార్' సినిమాతో తెలుగులో ఎంట్రీ ఇవ్వనున్నారు. రీసెంట్ గా ఈ హీరో నటించిన 'ది గ్రే మ్యాన్'(The Gray Man) అనే హాలీవుడ్ సినిమా నెట్ ఫ్లిక్స్ లో రిలీజై మంచి టాక్ సంపాదించుకుంది. ఈరోజు ధనుష్ పుట్టినరోజు(Dhanush Birthday) వేడుకలు జరుపుకుంటున్నారు. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా ఈరోజు గ్లోబర్ స్టార్ ఇమేజ్ సంపాదించుకున్న ధనుష్.. తన కెరీర్ లో బాడీ షేమింగ్ ను ఎదుర్కొన్నారు. 


ఈ విషయాన్ని ఆయన పలు సందర్భాల్లో వెల్లడించారు. ధనుష్ తన కెరీర్ ఆరంభంలో 'కాదల్ కొండేన్' అనే సినిమా చేశారు. ఈ సినిమా షూటింగ్ సమయంలో తాను హీరో అని చెప్పుకోవడానికి ధనుష్ కాస్త ఇబ్బంది పడేవారట. దానికి కారణం అతడు హీరో మెటీరియల్ లా కాకుండా ఒక సాధారణ కుర్రాడిలా ఉండేవాడు. దీంతో ఇతరులు తనను ఏడిపిస్తారేమోనని భావించేవాడు ధనుష్. 


ఒకసారి 'కాదల్ కొండేన్' సెట్స్ లోకి కొందరు వచ్చి హీరో ఎవరని ధనుష్ ని అడిగారట. దానికి ధనుష్ వేరొకరిని చూపించారట. ఆ తరువాత ధనుష్ హీరో తెలుసుకున్న వారు.. 'ఆటో డ్రైవ‌ర్‌లా ఉన్నాడు.. వీడు హీరో ఏంటి..?' అని ధనుష్ ముఖం మీదే కామెంట్ చేశారట. ఆ మాటలు ధనుష్ ని బాధించడంతో తన కారెక్కి ఏడ్చేశాడట. ఆ తరువాత తనను తాను ధైర్యం చెప్పుకొని షూటింగ్ లో పాల్గొన్నారట. ఫైనల్ గా 'కాదల్ కొండేన్' సినిమా హిట్ అవ్వడంతో ధనుష్ కి యూత్ లో క్రేజ్ పెరిగింది. ఈ విషయాలను ఓ ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చారు ధనుష్.  


Also Read: 'పుష్ప2'లో బుచ్చిబాబు ఇన్వాల్వ్మెంట్ - అంత లేదంటున్న దర్శకుడు!


Also Read: 'చంద్రముఖి' సీక్వెల్ లో ఐదుగురు హీరోయిన్లు - ఎవరెవరంటే?