త కొంత కాలంగా చిన్న సినిమాలే బాక్సాఫీస్ దగ్గర సత్తా చాటుతున్నాయి. గత కొద్ది వారాలుగా పెద్ద సినిమాలు లేకపోవడంతో చిన్న, మధ్య తరహా సినిమాలు బాక్సాఫీస్ ను ఏలుతున్నాయి. రీసెంట్ గా ‘సామజవరగమన’, ‘బేబీ’ సినిమాలు మంచి హిట్ అందుకున్నాయి. ఈ వారం ఏ సినిమాలు థియేటర్లలో విడుదల అవుతున్నాయి? ఓటీటీలో సందడి చేయబోయే సినిమాలు, సిరీస్ లు ఏంటి? అనే వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.. 


థియేటర్లలో విడుదలయ్యే సినిమాలు


1. హిడింబ - జులై 20న విడుదల


అశ్విన్ హీరోగా, అనీల్‌ కన్నెగంటి దర్శకత్వంలో వస్తున్న తాజా  చిత్రం ‘హిడింబ’. అవుట్‌ అండ్‌ అవుట్‌ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని శ్రీవిఘ్నేష్‌ సినిమాస్‌ బ్యానర్‌పై గంగపట్నం శ్రీధర్‌ నిర్మించాడు. అనిల్ సుంకర, ఏకే ఎంటర్ టైన్మెంట్స్ సమర్పిస్తున్న ఈ సినిమాలో, అశ్విన్‌కు జోడీగా నందితా శ్వేత హీరోయిన్‌గా నటించింది. వికాస్‌ బడిసా సంగీతం అందిస్తున్నారు.  రాజశేఖర్‌ సినిమాటో గ్రాఫర్‌గా పనిచేస్తున్నారు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన పోస్టర్స్, గ్లింప్స్‌ సినిమాపై భారీ అంచనాలు పెంచాయి.



2. అన్నపూర్ణ ఫోటో స్టూడియో - జులై 21న విడుదల


గోదావరి ప్రాంతంలో జరిగే ఓ చిన్న లవ్ స్టోరీని కథాంశంగా తీసుకొని ‘అన్నపూర్ణ ఫోటో స్టూడియో’ మూవీని రూపొందించారు. ‘30 వెడ్స్ 21’ ఫేమ్ చైతన్య రావు, లావణ్య హీరో, హీరోయిన్లుగా నటించారు. ‘పెళ్లిచూపులు’, ‘డియర్ కామ్రేడ్’, ‘దొరసాని’ లాంటి సినిమాలను నిర్మించిన బిగ్ బెన్ బ్యానర్ పై చందు ముద్దు దర్శకత్వంలో ఈ సినిమా రూపొందింది.  ఇందులో రాఘవ, ఉత్తర, మిహిర ,లలిత్ ఆదిత్య సహా పలువురు కీలక పాత్రలు పోషించారు.  ప్రిన్స్ హెన్రీ సంగీతం అందించారు.  



3. హత్య - జులై 21న విడుదల


అడివి శేష్, సందీప్ కిషన్ అతిథులుగా కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ అంటోని నటిస్తున్న కొత్త సినిమా ‘హత్య’. క్రైమ్ థ్రిల్లర్ బ్యాక్‌ డ్రాప్‌లో దర్శకుడు బాలాజీ కుమార్ ఈ మూవీని రూపొందించారు. ఈ సినిమాలో విజయ్ ఆంటోని డిటెక్టివ్ పాత్రలో కనిపించనున్నారు. రితికా సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తున్నారు. లోటస్ పిక్చర్స్‌, ఇన్ఫినిటీ ఫిల్మ్ వెంచర్స్ బ్యానర్స్ సంయుక్తంగా ఈ సినిమాను  నిర్మిస్తున్నాయి. ఈ సినిమా  గ్లోబల్ సినిమాస్, సురేష్ ప్రొడక్షన్ ద్వారా తెలుగులో రిలీజ్ కానుంది.   



4. ఒప్పెన్‌ హైమర్‌ - జులై 21న విడుదల


5. హర్‌: చాప్టర్‌ 1 - జులై 21న విడుదల


6. అలా ఇలా ఎలా - జులై 21న విడుదల


7. కాజల్‌ కార్తీక - జులై 21న విడుదల


8. జిలేబి- జులై 21న విడుదల


9. నాగద్వీపం- జులై 22న విడుదల


ఓటీటీలో అలరించే సినిమాలు  


అమెజాన్‌ ప్రైమ్‌


1. బవాల్‌ (హిందీ) - జులై 21న విడుదల


నెట్‌ఫ్లిక్స్‌


1. ది డీపెస్ట్‌ బ్రెత్‌ (హాలీవుడ్‌)- జులై 19న విడుదల


2. అశ్విన్స్‌ (తెలుగు)- జులై 20న విడుదల


3. స్వీట్‌ మంగోలియాస్‌ (వెబ్‌ సిరీస్‌) - జులై 20న విడుదల


4. ది క్లోన్‌డ్‌ టైరోన్‌ (హాలీవుడ్‌) - జులై 21న విడుదల


జీ5


1. స్పైడర్‌మ్యాన్‌: ఎక్రాస్‌ ది స్పైడర్స్‌ వర్స్‌ (యానిమేషన్‌) - జులై 18న విడుదల


జియో సినిమా


1. ట్రయల్‌ పీరియడ్‌ (హిందీ) - జులై 21న విడుదల


Read Also: 'సామజవరగమన' ఓటీటీ స్ట్రీమింగ్ ఈ వారంలోనే!


ముఖ్యమైన, మరిన్ని ఆసక్తికర కథనాల కోసం ‘టెలిగ్రామ్’లో ‘ఏబీపీ దేశం’లో జాయిన్ అవ్వండి.
Join Us on Telegram: https://t.me/abpdesamofficial