గత కొంతకాలంగా హీరోయిన్లు ఓటీటీ బాట పట్టారు. ఓవైపు సినిమాల్లో నటిస్తూనే మరోవైపు వెబ్ సిరీస్ లలోనూ సత్తా చాటుతున్నారు. ఇప్పటికే పలువురు స్టార్ హీరోయిన్లు సైతం డిజిటల్ రంగంలోకి అడుగు పెట్టారు. తాజాగా ఈ కోవలోకి చేరింది హనీ బ్యూటీ మెహ్రీన్. ఇప్పటికే పలు తెలుగు సినిమాల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది. ‘కృష్ణగాడి వీర ప్రేమ గాథ', 'ఎఫ్ 2', 'ఎఫ్ 3', 'రాజా ది గ్రేట్', 'మహానుభావుడు' లాంటి చిత్రాల్లో నటించి మంచి పాపులారిటీ సంపాదించింది. తాజాగా  మెహ్రీన్ 'సుల్తాన్ ఆఫ్ ఢిల్లీ' అనే వెబ్ సిరీస్ లో నటించింది. ఈ సిరీస్ లో పలు శృంగార సన్నివేశాల్లోనూ నటించింది.  


నెటిజన్లకు మెహ్రీన్ స్ట్రాంగ్ కౌంటర్


మెహ్రీన్ బోల్డ్ సన్నివేశాలు చూసి నెటిజన్లు షాక్ అయ్యారు. అంతేకాదు, సోషల్ మీడియా వేదికగా ఆమెను ట్రోల్ చేస్తున్నారు.  బోల్డ్ సీన్లలో మెహ్రీన్ అదరగొట్టింది కదా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. నెటిజన్ల ట్రోలింగ్ ను తట్టుకోలేని మెహ్రీన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. సోషల్ మీడియా వేదికగా ఓ పెద్ద పోస్టు పెట్టింది. తనను ట్రోల్ చేస్తున్న వారికి గట్టి సమాధానం చెప్పింది. నటనని నటనగా చూడాలి తప్ప, వ్యక్తిగతం చేసే ప్రయత్నం చేయకూడదని క్లాస్ తీసుకుంటుంది.  


అది శృంగారం కాదు, అత్యాచారం!


“సినిమా అనేది ఓ కళ. కొన్నిసార్లు కథకు అనుకూలంగా కొన్ని సీన్లలో నటించాల్సి ఉంటుంది. అలా నటించినప్పుడే వృత్తికి తగిన న్యాయం చేసినట్లు భావిస్తాం. అలా చేకపోతే పూర్తి స్థాయి నటిగా మారలేం. నటన అనేది నా ఉద్యోగంగా భావిస్తాను. ఉద్యోగంలో భాగంగానే ఆ సీన్లు చేశాను. ‘ఢిల్లీ ఆఫ్ సుల్తాన్‌’ వెబ్ సిరీస్ లో అత్యంత క్రూరమైన వైవాహిక అత్యాచారాన్ని చూపించే సన్నివేశం ఉంది. అలాంటి దారుణ అత్యాచార సన్నివేశాన్ని చూసి శృంగార సన్నివేశం అని భావించడం నాకు చాలా బాధ కలిగించింది. ఇలాంటి సమస్యను, వేధింపులను నిత్యం ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మంది మహిళలు ఎదుర్కొంటున్నాను. అలాంటి ఓ సమస్యను వెబ్ సిరీస్ లో చూపిస్తే, ఆ సీన్ ను పట్టుకుని సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం నిజంగా దారుణం” అని మెహ్రీన్ అభిప్రాయపడింది.






మీకూ ఆడ బిడ్డలు ఉన్నారని గుర్తుంచుకోండి!


తనపై అనవసరంగా ట్రోల్ చేస్తున్న వారికి బిడ్డలు, అక్కాచెల్లెళ్లు ఉన్నారని గుర్తుంచుకోవాలని మెహ్రీన్ సూచించింది. “వారి ఆడపడుచులు కూడా తమ వైవాహిక జీవితంలో ఇలాంటి ఇబ్బందులు పడకూడదని భావిస్తున్నాను. ఇందుకోసం దేవుడిని ప్రార్థిస్తున్నాను. మహిళల పట్ల హింస, క్రూరత్వం చూపించడం అత్యంత దారుణ విషయంగా నేను భావిస్తాను. ఈ వెబ్ సిరీస్ షూటింగ్ సమయంలో నాకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చిత్రబృందం తగు జాగ్రత్తలు తీసుకుంది. వారందరినీ ధన్యవాదాలు చెప్తున్నాను” అని మెహ్రీన్ వెల్లడించింది.      






Read Also: ‘బాషా’ కోసం చిరంజీవిని కాదని మోహన్ బాబుకు ఓకే చెప్పిన రజనీకాంత్, ఆ తర్వాత ఏం జరిగిందంటే!